ఈ రోజు (ఆగస్టు 19, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..
మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు లక్ ఫ్యాక్టర్ అమోఘంగా ఉంటుంది. అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది. అలాగే నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులు కూడా తాము కోరుకున్న రంగాల్లో ప్రతిభను సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి.
వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శుభవార్తలు వింటారు. వివాహితులకు సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే అవివాహితులు పెళ్లి సంబంధాల గురించి ఈ రోజు నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టడం మంచిది. ప్రేమికులు కూడా తమ బంధం గురించి ఇంట్లో చెప్పడం శ్రేయస్కరం. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది.
మిథునం (Gemini) – ఈ రోజు మీకు పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. అలాగే పనిలో నిర్లక్ష్యం వల్ల వ్యాపారస్తులకు వాణిజ్య ఒప్పందాలు రద్దు అయ్యే అవకాశముంది. వివాహితులు తమ భాగస్వామితో మనస్పర్థలు వచ్చినా… సహనంతో వ్యవహరించండి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు ఆస్తి వివాదాలలో చట్టపరమైన ఉపశమనం పొందే అవకాశం ఉంది. అలాగే మొండి బాకీలు కూడా వసూలవుతాయి. వ్యాపారస్తులు ఓ పెద్ద సమస్య నుండి బయపడతారు. తల్లిదండ్రులకు పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. వివాహితులు భాగస్వామితో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు విజయ మార్గంలో పయనిస్తారు.
సింహం (Leo) – సోమరితనం మరియు నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగులు చాలా మంచి అవకాశాలను కోల్పోతారు. ఈ రోజు వ్యాపార విషయాలలో మీరు జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఆఫీసులో వివాదాల జోలికి వెళ్లవద్దు. మీ భాగస్వామితో చిరస్మరణీయమైన క్షణాలు గడుపుతారు. అవసరమైన పని మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది.
కన్య (Virgo) – ఈ రోజు మీ ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసు చంచలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఓ శుభవార్త వింటారు. క్రీడా రంగంలోని వ్యక్తులు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తుల (Libra) – మీ భాగస్వామి మనసులోని భావాలను అర్థం చేసుకోండి. మీ మధ్య ఉన్న సమస్యల గురించి పరస్పరం చర్చించుకోండి. కొత్త వ్యక్తులతో మాట్లాడండి. మీ ప్రవర్తన సమాజంలో మీకు ఉన్న గౌరవాన్ని మరింత పెంచుతుందని గుర్తుంచుకోండి. ఇతరుల వద్ద చిక్కుకున్న డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది. స్నేహితులతో కలిసి మధురమైన క్షణాలు గడుపుతారు. కొత్త బంధాలు ఏర్పరుచుకోవడం ద్వారా మీకు బోలెడంత ఆనందం లభిస్తుంది.
వృశ్చికం (Scorpio) – ఏదైనా పోటీ పరీక్ష లేదా ఇంటర్వ్యూలో యువతకు విజయం లభిస్తుంది. వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు మీ విశ్వాసాన్ని తిరిగి పొందుతారు. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. అలాగే వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా వ్యాాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు వ్యాపారంలో ఆర్థిక నష్టాలు కలిగే అవకాశం ఉంది. అలాగే మహిళలు షాపింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. విద్యార్థులు అధ్యయనం చేసే క్రమంలో మరింత కష్టపడాలి. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఈ రోజు పూర్తవుతాయి. ఆర్థిక నష్టం సంభవించవచ్చు.
మకరం (Capricorn) – ఈ రోజు భాగస్వామి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండడంతో.. అంతా సరదా వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే వ్యాపారస్తులు.. తమ స్నేహితుల సహాయంతో కొత్త ఆదాయ వనరులు కనుగొంటారు. రాజకీయాల్లో ఆసక్తి, బాధ్యతలు పెరుగుతాయి.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..
కుంభం (Aquarius) – ఈ రోజు మీ స్నేహితుల ప్రవర్తన మీ మనసును బాధపెడుతుంది. ఒక సీనియర్ అధికారి లేదా కుటుంబంలోని ఒక వ్యక్తితో మీకు అభిప్రాయ బేధాలు తలెత్తే అవకాశాలున్నాయి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల గురించి ఆందోళన చెందుతారు. అలాగే అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి.
మీనం (Pisces) – ఈ రోజు మీ భాగస్వామికి కొన్ని శారీరక రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు కూడా కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. అలాగే సామాజిక పనుల్లో విద్యార్థుల ధోరణి మారుతుంది. స్నేహితుల సహాయంతో అసంపూర్తిగా ఉన్న పనిని పూర్తి చేస్తారు. సృజనాత్మక పనులలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారస్తులకు అంతా లాభసాటిగా సాగుతుంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.