22 ఆగస్టు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు మీరు చదివేయండి)

22 ఆగస్టు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు మీరు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 22, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మానసిక ఒత్తిడిని తట్టుకొని నిలబడాలి. అలాగే కుటుంబంలో ఏర్పడే మనస్పర్థలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అలాగే విద్యార్థులు ఈ రోజు నుండి ఒక ప్రణాళిక ప్రకారం చదవడం ప్రారంభించడం మంచిది. నిరుద్యోగులు కూడా తమకు అందివచ్చింది చిన్న అవకాశం అయినా సరే.. దానిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా వివాహితులకు తమ భాగస్వామితో అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. అలాగే నమ్మకస్తులపై విశ్వాసం కోల్పోతారు. వ్యాపారస్తులు తమ పార్టనర్స్‌తో విడిపోయే అవకాశం కూడా ఉంది. క్రియేటివ్ ఫీల్ఢ్, సినిమా రంగాలకు చెందిన వ్యక్తులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు చాలా బిజీగా గడుపుతారు. శారీరకంగా కూడా ఎంతో కష్టపడతారు. ఆఫీసులో కూడా ఉద్యోగులకు మానసిక ఒత్తిడి ఉంటుంది. అలాగే.. ప్రత్యర్థుల నుండి కూడా సవాళ్లు ఎదురవుతాయి. అయినా సరే.. చాలా లౌక్యంగా వ్యవహరించాలి. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా వ్యవహరించండి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకోని విధంగా కాంట్రాక్టులు కలిసి వస్తాయి. స్థిరాస్తులు కొనాలని భావించే వారికి ఈ రోజు చాలా మంచిది. అయితే క్రయ, విక్రయాలు జరిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏకాగ్రతను పెంచుకోవాలి. 

సింహం (Leo) –  ఈ రోజు ఈ రాశివ్యక్తులు తమ కుటుంబంతో సరదాగా గడుపుతారు. అలాగే ఉద్యోగులు కూడా తమ ఆఫీసులో ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేస్తారు. అలాగే అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు. అలాగే మహిళలు తమ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి కూడా ఈ రోజు చాలా అనువైనది. 

క‌న్య (Virgo) –  ఈ రోజు మీరు ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది. అలాగే నిర్లక్ష్యాన్ని వీడాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. ఆఫీసులో పనిచేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆడిట్ జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా అప్రమత్తతతో వ్యవహరించాలి. అలాగే అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి.

తుల (Libra) – ఈ రోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన దినం. అలాగే వివాహితులు కూడా తమ భాగస్వామి నుండి శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంటుంది. ఇంజనీరింగ్, సాంకేతిక రంగానికి చెందిన విద్యార్థులకు ఈ రోజు బాగా కలిసొస్తుంది. అదే విధంగా మీ బాల్య స్నేహితులు.. ఈ రోజు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఆఫీసులో మీకు అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులు కూడా ప్రత్యమ్నాయ కోర్సుల వైపు మొగ్గు చూపించే క్రమంలో.. బాగా ఆలోచించి నిర్ఱయం తీసుకోవాలి. వ్యాపారస్తులు కూడా ఏజెంట్లు, బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే తల్లిదండ్రులు ఈ రోజు తమ బిడ్డల విషయంలో శుభవార్తలు వింటారు. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు పిల్లల ఆరోగ్యానికి సంబంధించి తల్లిదండ్రులు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించడం మంచిది. ఉద్యోగస్తులు కూడా ఆఫీసులో వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్. అలాగే వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే విద్యార్థులు పాజిటివ్ ఎనర్జీతో దూసుకెళ్తారు. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు తమ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాాగే ఉద్యోగులు ఆఫీసులో నిజాయతీతో పనిచేయాలి. మీకు పదోన్నతులు కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు పెరుగుతాయి. అలాగే వివాహితులకు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) - ఈ రోజు విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి రోజు. మీ కెరీర్ సమస్యలు అన్ని పరిష్కారమవుతాయి. అలాగే ఆఫీసులో కూడా మీ అంకితభావానికి తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే సంఘంలో గౌరవ, మర్యాదలు కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు వృత్తి సంబంధిత సమస్యలు కూడా ఒక పరిష్కార దశకు వస్తాయి. 

మీనం (Pisces) – ఈ రోజు రుణాలు ఇచ్చే విషయం లేదా తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి. అలాగే పిల్లల విషయంలో తల్లిదండ్రులు భావోద్వేగాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే వృత్తిపరమైన నష్టాలు ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం కూడా ఉంది

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.