26 ఆగస్టు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

26 ఆగస్టు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 26, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు మానసిక ఉద్రిక్తతకు లోనయ్యే అవకాశం ఉంది. కనుక కాస్త జాగరూకతతో వ్యవహరించండి. ఆఫీసులో ఎవరితోనూ గొడవ పడవద్దు. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోండి. కోపాన్ని నియంత్రించండి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. నిజాయతీతో పనిచేసి అధికారుల మన్ననలు పొందడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి సలహాలు తీసుకోండి. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు ఆర్థిక సంక్షోభం బారిన పడే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. అలాగే సోదరుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ భాగస్వామితో మీ సంబంధాలు పటిష్టంగా మారతాయి. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు ప్రత్యమ్నాయ కోర్సుల వైపు మొగ్గు చూపుతారు. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అలాగే పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అలాగే మీరు మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే రుణాలు తీరే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు వివాదాల్లో చిక్కుకొనే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపారస్తులు రుణాలు ఇచ్చే విషయం లేదా తీసుకొనే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అదేవిధంగా సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. 

సింహం (Leo) –  ఈ రోజు రాశి వ్యక్తులు ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే అధికారులతో స్నేహ పూర్వకమైన సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి పలు మంచి విషయాలు వింటారు. అలాగే ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. 

క‌న్య (Virgo) –  ఈ రోజు ఈ రాశివ్యక్తులకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఆర్థిక పరిస్థితులు బలంగా ఉంటాయి. కుటుంబ వివాదాలు కూడా ఒక పరిష్కార దశకు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు తమ ప్రత్యర్థుల నుండి సమస్యలు ఎదురైనా.. వాటిని వారు ధైర్యంగా ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. 

తుల (Libra) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులను పలు ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులకు పని విషయంలో పలు అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ట్రాఫిక్ సమస్యలు లేదా వాహన వినియోగంలో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అలాగే పలు విషయాలలో మీరు మీ స్నేహితుల సహాయాన్ని పొందుతారు. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు శుభవార్తలు వింటారు. అలాగే వ్యాపారస్తులకు లాభసాటిగా గడుస్తుంది. అదే విధంగా కుటుంబ సమస్యలు కూడా ఒక కొలిక్క వస్తాయి. కొత్త వ్యాపార ప్రణాళికలు కూడా విజయవంతమవుతాయి. అలాగే పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. అలాగే కొన్ని విషయాలలో మీ భాగస్వామి సలహాలు కూడా తీసుకుంటారు. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీ స్నేహితులలో ఒకరు.. మీకు వ్యాపారంలో సహాయం చేసే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులకు పలు రిఫరెన్సులు లభించే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు క్రీడలు పట్ల ఆసక్తిని పెంచుకుంటారు. అలాగే పలు బహుమతులు కూడా పొందే అవకాశం ఉంది. అయితే  ఈ రాశి వ్యక్తులు  ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని అత్యవసర పనుల నిమిత్తం దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. అలాగే సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో తమ సత్తా చాటుతారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆర్థికంగా ఎంతో లాభం చేకూరుతుంది. అలాగే భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులు సృజనాత్మక రంగం వైపు ఆసక్తిని చూపిస్తారు. అలాగే దూర ప్రయాణాలు చేస్తారు. అయితే అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. 

మీనం (Pisces) –  ఈ రోజు వ్యాపారస్తులకు అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులు కూడా కొత్త సవాళ్లను స్వీకరిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో శ్రమ పడినా ఫలితం ఉండకపోవచ్చు. అలాంటి సమయాల్లో ధైర్యాన్ని వీడకండి. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. లౌక్యంతో సమస్యను ఒక కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నించండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.