27 ఆగస్టు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

27 ఆగస్టు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 27, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు చాలా హడావుడిగా పనిచేస్తారు. అయితే పెండింగ్ పనులను పూర్తిచేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆఫీసులో ఉద్యోగులు కొత్త బాధ్యతలను టేకప్ చేసే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా మంచి కెరీర్ అవకాశాల కోసం ఎదురుచూస్తారు. వివాహితులు వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్. 

వృషభం (Tarus) –  ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి. అలాగే ఈ రోజు పలు సంఘటనలు మిమ్మల్ని భయాందోళనలకు గురి చేయవచ్చు. అయినా సరే.. మీరు మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులు కొంచెం మానసిక ఆందోళనకు గురైనా.. ఆఖరికి విజయం సాధిస్తారు. 

మిథునం (Gemini) –  ఈ రోజు మీరు పెద్దల సలహాలతో ముందుకు వెళ్లడం మంచిది. అలాగే కొన్ని విషయాలలో వివేకంగా ఆలోచించాలి. అలాగే సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అయితే  ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సానుకూల ఆలోచనలను పెంచుకొనే అవకాశం ఉంది. అలాగే తమ స్వశక్తితో విజయాలను సాధిస్తారు. మీ వృత్తిపరమైన ప్రయాణం కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగుతుంది. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు ఈ రోజు మంచి లాభసాటిగా ఉంటుంది. 

సింహం (Leo) – ఈ రోజు వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికంగా లాభాలు ఆర్జించినా.. లౌక్యంగా లేకపోవడం వల్ల నష్టాలు కూడా సంభవించవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు కూడా అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వివాహితులు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. అలాగే ముఖ్యమైన విషయాలలో మీ భాగస్వామి సలహాలు తీసుకోండి. 

క‌న్య (Virgo) –   ఈ రోజు మీరు ఆరోగ్యపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగులు పని విషయంలో చురుగ్గా ఉండాలి. ముందు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఆఫీసులో ఆడిట్ జరిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు దుబారా ఖర్చులు తగ్గిస్తే మంచిది. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సమస్యలకు సంబంధించి మానసిక ఒత్తిడి ఉంటుంది. అయినా చాలా సమయస్ఫూర్తితో పలు సమస్యలను పరిష్కరిస్తారు. అయితే ప్రత్యర్థులు మిమ్మల్ని కట్టడి చేసే అవకాశం ఉంది. అయితే స్నేహితుల నుండి  మీకు కావాల్సిన మద్దతు లభిస్తుంది. వివాహితులు కొన్ని ముఖ్యమైన విషయాలలో భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. 

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీరు అన్ని విషయాలలోనూ పాజిటివ్‌గా ఆలోచించండి. అలాగే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించినా.. సహనంతో, ఓర్పుతో వ్యవహరించండి. లౌక్యంతో సమస్యల నుండి బయటపడండి. వివాహితులు తమ భాగస్వామితో కలిసి.. తమ మనసులోని ఆలోచనలను పంచుకోవడానికి ఇదే సరైన సమయం. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉన్నత విద్య కోసం విద్యార్థులు ధన సహాయాన్ని పొందుతారు. వ్యాపారస్తులు కూడా కొత్త ఉద్యోగులకు అవకాశమిస్తారు. నిరుద్యోగులకు కూడా అనుకోని అవకాశాలు లభిస్తాయి. అలాగే కొన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల సలహాలు తీసుకోవడం మంచిది. 

మకరం (Capricorn) –  ఈ రోజు మీకు మీ కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం లభిస్తుంది. అలాగే ఆఫీసులో కూడా మీరు ప్రశంసలు పొందే అవకాశం ఉంది. అదేవిధంగా చట్టపరమైన సమస్యలు లేదా కోర్టు వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వివాహితులు కూడా తమ భాగస్వామితో ఏర్పడిన పొరపొచ్చాలను దూరం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు స్థాన చలనం ఉంటుంది. దూర ప్రయణాలు చేయడం లేదా దూర ప్రాంతాలలో నివసించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులకు బదిలీలు సంభవించే అవకాశం కూడా ఉంది. వివాహితులు తమ భాగస్వామితో కలిసి తీర్థయాత్రలు చేయవచ్చు. వ్యాపారస్తులు కాస్త లౌక్యంతో వ్యవహరించడం మంచిది. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. అలాగే అపరిచితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వివాహితులు తమ భాగస్వామితో ఏర్పడిన మనస్పర్థలను తొలిగించుకోవడానికి ఇదే అనువైన రోజు. అలాగే రుణాలు ఇచ్చిపుచ్చుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొత్త కోర్సుల వైపు ఆలోచనలను కేంద్రీకరిస్తారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.