ఆగస్టు 29, 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఆగస్టు 29, 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 29, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు సోమరితనాన్ని వీడాలి. అలాగే డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉండడం తగదు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఆఫీసులో ప్రత్యర్థుల నుండి సవాళ్లను ఎదుర్కొంటారు. అదేవిధంగా ఈ రోజు మీ స్నేహితుల సహాయంతో.. పలు నూతన నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వివాదాలు, ఆస్తి తగాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

వృషభం (Tarus) – ఈ రోజు మీరు మీ కుటుంబంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అదేవిధంగా మీ భాగస్వామి నుండి మీరు ఓ ఆశ్చర్యకరమైన బహుమతిని పొందుతారు. ఆఫీసులో కూడా మీకు అధికారుల నుండి కావాల్సిన మద్దతు లభిస్తుంది. అలాగే సంఘంలో కూడా గౌరవ, మర్యాదలు పొందుతారు. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఈ క్రమంలో తమ స్నేహితుల సహాయం తీసుకుంటారు. అలాగే ప్రత్యర్థుల నుండి బహిరంగంగానే కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. అయినా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు. ఇక వివాహితులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే భాగస్వామికి సంబంధించి పలు శుభవార్తలు వింటారు.  

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించండి. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏజెంట్లు, బ్రోకర్లను నమ్మే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వివాహితులు కూడా అపరిచితుల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. 

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే ఆస్తికి సంబంధించిన లావాదేవీలలో కూడా.. మీకు అనుకూలమైన ఫలితం వస్తుంది. ఇక వ్యాపారస్తులు తమ వాణిజ్యాన్ని విస్తరించే దిశగా ప్రయత్నాలు సాగిస్తారు. అలాగే ప్రత్యర్థుల సవాళ్లను స్వీకరించి.. వారికి దీటుగా పోరాడతారు. 

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు.. ముఖ్యంగా యువతకు బాగా కలిసొచ్చే రోజు. ప్రేమికులు కూడా ఈ రోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. తమ మనసులోని మాటను తల్లిదండ్రులతో పంచుకోవడానికి కూడా.. ఇదే రోజు అనువైనది. అలాగే విద్యార్థులు క్రీడలపై ఆసక్తిని పెంచుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు మెండుగా ఉంటాయి.  

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారస్తులు కూడా రుణాలు ఇచ్చే విషయం లేదా తీసుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా అక్కరకు కాని స్నేహితులను దూరంగా ఉంచడం మంచిది. ఉద్యోగస్తులు కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాల వైపు ఆసక్తి చూపించే అవకాశం ఉంది.  

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు లాభసాటిగా సాగుతుంది. ఆఫీసులో కూడా ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. సృజనాత్మక, సినిమా రంగాలకు చెందిన వ్యక్తులకు పనులలో పురోగతి ఉంటుంది. అలాగే వివాహితులు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు పలు చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ప్రేమికులు అనుకోని సమస్యలలో చిక్కుకుంటారు. కొన్ని సందర్భాలలో మీరు కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. సహనంతో, సమయస్ఫూర్తితో, లౌక్యంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 

మకరం (Capricorn) –  ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే వివాహితులు కొన్ని విషయాలలో తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకొనే బదులు.. ప్రాక్టికల్‌గా ఆలోచించడం మంచిది. కొన్ని సందర్భాలలో.. మీ భాగస్వామి సలహాలు తీసుకోవడం కూడా ఎంతో శ్రేయస్కరం. అలాగే వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై విశ్వాసం పెరుగుతుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అలాగే కుటుంబంలో సరదా వాతావరణం నెలకొని ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలు వింటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు లభిస్తాయి. విద్యార్థులకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులకు కూడా అనుకోని అవకాశాలు లభిస్తాయి. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు తమ సోదరుల నుండి అనుకోని సహాయం లభిస్తుంది. వ్యాపారస్తులకు కూడా కొత్త ప్రాజెక్టుల మీద ఆసక్తి ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు కూడా ఊహించని రీతిలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మొత్తానికి ఈ రోజు ఈ రాశివారికి మంచి ఫలితాలనే అందిస్తుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.