ఈ రోజు (ఆగస్టు 30, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..
మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు తమ భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీకు ఈ రోజు కాస్త మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. ఆఫీసులో ఉద్యోగులకు, అధికారులకు వాదోపవాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని పనులు పెండింగ్‌లో ఉండిపోతాయి. స్నేహితులకు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేరే సూచనలు కనిపించడం లేదు.
వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబ పరిస్థితులు మీకు ఆందోళనను కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది . వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండడం మంచిది.
మిథునం (Gemini) – ఈ రోజు వ్యాపారస్తులకు.. కొత్త ప్రాజెక్టులపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే మహిళలకు షాపింగ్ బాగా కలిసొస్తుంది. పలు రిబేట్లు, డిస్కౌంట్లు పొందుతారు. వివాహితులకు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. అలాగే సమాజంలో గౌరవ, మర్యాదలు కూడా పెరుగుతాయి. విద్యార్థులు ఇంకా బాగా కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కర్కాటకం (Cancer) – ఈ రోజు మీకు మీ స్నేహితులతో అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంది. అలాగే కొత్త వ్యక్తులు పరిచమవుతారు. ప్రముఖ వ్యక్తుల చేత ప్రశంసలు కూడా పొందుతారు. వివాహితులకు భాగస్వామి మద్దతు లభిస్తుంది. మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేసే పలు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు పెరుగుతాయి.
సింహం (Leo) – ఈ రోజు విద్యార్థులు సమయం వృథా చేయకుండా ఉంటే మంచిది. అలాగే ఆఫీసులో ఉద్యోగులు ప్రత్యర్థుల నుండి సవాళ్లను స్వీకరిస్తారు. మీ ప్రమోషన్‌కు ఆటంకం కలిగే అవకాశం ఉంది. అందుకే కొన్ని వివాదాలకు దూరంగా ఉండాలి. మిమ్మల్ని మోసం చేయడానికి కొందరు అపరిచితులు ప్రయత్నించవచ్చు. కనుక జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
కన్య (Virgo) – ఈ రోజు స్థిరాస్థి రంగానికి చెందిన వ్యాపారస్తులకు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. కొత్త వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. అలాగే కొత్త కాంట్రాక్టులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గర పడుతున్నాయి. నిరుద్యోగులకు కూడా అనుకోని అవకాశాలు.. వెతుక్కుంటూ వస్తున్నాయి.
తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు పనులలో అంతరాయం కలిగే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆఫీసులో బిజీ బిజీ వాతావరణం ఉంటుంది. చదువు విషయంలో విద్యార్థులు మరింత కష్టపడాలి. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఈ రోజు కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు చాలా బిజీగా ఉండడం వల్ల శారీరక అలసటకు గురవుతారు. అలాగే మీకు విచారం కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఆఫీసులో కూడా పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. మీకు మీ భాగస్వామి నుండి మద్దతు కూడా లభిస్తుంది.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు మీరు మీ భాగస్వామికి సంబంధించిన ఓ విషయంలో ఎంతో భావోద్వేగానికి గురవుతారు. అలాగే కుటుంబంలో కూడా కొన్ని పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది. మీ వల్ల కొందరు రాజకీయ ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది. కొన్ని విపత్కర పరిస్థితులలో.. మీకు మీ స్నేహితుల సహాయం లభించే అవకాశం ఉంది.
మకరం (Capricorn) – ఈ రోజు మీరు ఒక సరికొత్త అనుభూతిని పొందుతారు. ఉద్యోగులు ఆఫీసులో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగానికి చెందిన వ్యక్తులకు కూడా ఈ రోజు బాగా కలిసొస్తుంది. విద్యార్థులు కూడా కొన్ని విషయాలలో ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులకు సులభ ధన యోగం ఉంటుంది.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..
కుంభం (Aquarius) – ఈ రాశి వ్యక్తులకు ఈ రోజు దిగుమతి-ఎగుమతి వ్యాపారంలో ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే కొత్త పనుల ప్రారంభంలో నిధుల కొరత ఉండవచ్చు. అలాగే మీ కుటుంబానికి ఏదో ఒక రూపంలో ఆర్థిక సహాయం లభిస్తుంది. కోర్టు వివాదాలు, ఆస్తి తగాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు కూడా అనుకోని అవకాశాలు పొందుతారు.
మీనం (Pisces) – ఈ రోజు మీ ఆరోగ్య సమస్యలు అన్నీ ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులలో కూడా మీ వైఖరి బలంగా ఉంటుంది. ఆఫీసులో ఉద్యోగులు అధికారులతో మంచి సంబంధాలను కలిగి ఉండడం వల్ల.. లాభాన్ని పొందుతారు. వివాహితులు కొత్త పథకాలలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ప్రేమికులు తమ బంధం గురించి తల్లిదండ్రులకు చెప్పడానికి ఇదే సరైన సమయం.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.