ADVERTISEMENT
home / Astrology
31 ఆగస్టు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

31 ఆగస్టు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 31, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) –  ఈ రోజు వ్యాపార రంగంలోని వ్యక్తులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు.  అలాగే వివాహితులకు కూడా ఆర్థికంగా మంచి లాభం చేకూరుతుంది. మీకు కొత్త స్నేహితులు కూడా పరిచయమవుతారు. అదే విధంగా.. మీ పని శైలి మీకు పదోన్నతులను అందిస్తుంది. రాజకీయ రంగంలోని వ్యక్తులకు బాధ్యతలు ఇంకా పెరుగుతాయి. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు చాలా సంతోషకరమైన రోజు. పాత స్నేహాలు కొత్త సంబంధాలుగా మారే అవకాశం ఉంది. అలాగే మీ భాగస్వామితో గొప్ప క్షణాలను ఆస్వాదించండి. అదేవిధంగా స్థిరాస్తులు కొనడానికి కూడా ప్రణాళికలు రచిస్తారు. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రేమికులు తమ బంధం విషయంలో ఒక క్లారిటీకి వస్తారు. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు నిర్లక్ష్యాన్ని వీడి పనిచేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అలాగే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవద్దు. అదేవిధంగా మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేసే సంఘటనలు కొన్ని మీకు ఎదురవుతాయి.  ముఖ్యంగా కోర్టు వివాదాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి.

ADVERTISEMENT

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని  ప్రతికూల అనుభవాలను ఎదుర్కొంటారు. అయినా సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్లడం మంచిది. విద్యార్థులు తొలుత భంగపడినా.. తర్వాత ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. ఉద్యోగులు ఆఫీసులో  కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వివాహితులు కుటుంబంతో కలిసి శుభకార్యాలకు హాజరవుతారు. 

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతారు. మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. వేగంగానే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. అలాగే ఉద్యోగులకు ఆఫీసులో అనుకోని సమస్యలు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. వివాహితులు అధిక ఖర్చులతో ఇబ్బంది పడతారు. 

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు పలు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు కొత్త లైసెన్సులు, ఉద్యోగులకు ప్రమోషన్లు సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. 

ADVERTISEMENT

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు స్నేహితులు, బంధువులతో హాయిగా గడుపుతారు. వివాహితులకు కూడా తమ భాగస్వామితో సంబంధాలు బలపడుతాయి. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. ఆఫీసులో కూడా వాతావరణం ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు హాయిగా, సంతోషంగా గడుపుతారు. పాత స్నేహాలు కొత్త సంబంధాలుగా మారతాయి. మీ భాగస్వామితో గొప్ప క్షణాలను ఆస్వాదిస్తారు. ఆస్తుల కొనుగోలు నిమిత్తం పలువురు వ్యక్తులను కలుస్తారు. అలాగే పాత వైరాలు సమసిపోతాయి. ప్రేమికులు అనుకోని అనుభవాలను ఎదుర్కొంటారు. తమ పెద్దలను కలిసి తమ మనసులోని మాటను తెలపడానికి ఇదే సరైన రోజు.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. అలాగే వివాహితులు ప్రస్తుతానికి ప్రయాణానికి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. అలాగే ఆధ్యాాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతంది. పలు సమావేశాలలో కూడా పాల్గొంటారు. 

ADVERTISEMENT

మకరం (Capricorn) –  ఈ రోజు మీరు కొత్త శక్తితో రోజును ప్రారంభిస్తారు.అయితే ఆహారపు అలవాట్లను మార్చుకొనే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అదేవిధంగా మీకు మీ కుటుంబంతో దూర ప్రాంతాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తుల వ్యవహార శైలిలో నిర్లక్ష్యం అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే.. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అదేవిధంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. అలాగే కోర్టు సంబంధిత వ్యవహారాలలో.. ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. 

మీనం (Pisces) – ఈ రోజు మిమ్మల్ని మానసిక ఒత్తిడి లేదా శారీరక అలసట ఆవరించే అవకాశం ఉంది. మీ జీవనశైలిని మెరుగుపరచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.  ఉద్యోగస్తులు కొన్ని సందర్భాలలో మొండి పట్టుదలను వీడి.. సహోద్యోగులతో కలిసి ముందుకు వెళ్లడం మంచిది. అలాగే ఈ రాశి వ్యక్తులకు ఈ రోజు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. 

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

30 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT