ఈ రోజు (ఆగస్టు 4, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తుల ప్రయాణమంతా ధన సమస్యల చుట్టూ తిరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రుణాలు తీసుకొనేటప్పుడు.. ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టే విషయంలో.. ఏజెంట్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులు అవసరానికి మించి ఎక్కువ ఖర్చు పెట్టడానికి అడ్డుకట్ట వేయాలి. ఆర్థికపరమైన విషయాలలో కొత్త ప్రణాళికలు వేసుకోవాలి. పొదుపు సూత్రం పాటించాలి.
వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశివ్యక్తుల ప్రయాణమంతా “హార్డ్ వర్క్” చుట్టూ తిరుగుతుంది. ఎంతో కష్టపడతారు. అలాగే పాజిటివిటీని పెంచుకుంటారు. విద్యార్థులు చదువుపై అదనపు శ్రద్ధ పెడతారు. అన్ని విషయాలలోనూ సానుకూలంగా స్పందిస్తారు. వివాహితులు కొన్ని విషయాలను ఒక కొలిక్కి తేవడానికి ఎంతగానో కష్టపడతారు. ఈ రోజు అందరూ కష్టేఫలి.. అనే సూత్రాన్ని నమ్మి ముందుకు పోతారు. తద్వారా విజయాన్ని పొందుతారు.
మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు చాలా వరకు అసహనానికి గురవుతారు. ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వీరిని వేధించే అవకాశం ఉంది. కనుక చాలా జాగ్రత్త పడాలి. అలాగే చికాకు కలిగించే విషయాలు మీకు ఎదురుకావచ్చు. అయినా సరే.. కోపాన్ని నియంత్రించుకోవాలి. ప్రతి విషయాన్ని నెగటివ్‌గా తీసుకోవడం మాని.. పాజిటివ్‌గా ముందుకు వెళ్లాలి.
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు ప్రేమతో తాము అనుకున్న పనులను సాధిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల నుండి ఆప్యాయతను పొంది.. ఆప్యాయతను అందివ్వండి. అలాగే ప్రేమికులు తమ బాంధవ్యంలోని తియ్యదనాన్ని మనసారా అనుభవించండి. వివాహితులు తమ భాగస్వామితో ప్రేమగా మెలుగుతారు. అలాగే పలు దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఈ రాశి వ్యక్తులకు ఈ రోజంతా ప్రేమమయమే.
మన రాశిని బట్టి బలాలు, బలహీనతలు ఇట్టే తెలుసుకోవచ్చట. అవేంటో చూసేద్దామా..!
సింహం (Leo) – ఈ రోజు ఈ రాశివ్యక్తులకు అంతా శుభప్రదంగా గడుస్తుంది. ముఖ్యంగా శుభవార్తలను వినే అవకాశం లభిస్తుంది. పాత స్నేహితులు లేదా బంధువులు మిమ్మల్ని ఈ రోజు కలుస్తారు. అలాగే ప్రేమికులు కూడా తమ బంధం గురించి ఇంట్లో చెప్పడం మంచిది. అందుకు ఈ రోజు అనువైనది. వివాహితులు కూడా ఈ రోజు మంచి విషయాలు వింటారు. అలాగే ఆధ్యాత్మిక అంశాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. సృజనాత్మక రంగంలోని వారికి అనుకోని అవకాశాలు లభిస్తాయి.
కన్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా వస్తువులను తాకట్టు పెట్టేటప్పుడు లేదా రుణాలు తీసుకొనేటప్పుడు.. నూటికి పదిసార్లు ఆలోచించాలి. ముఖ్యంగా భాగస్వాములతో కలిసి.. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తతతో వ్యవహరించడం ఎంతైనా శ్రేయస్కరం. వివాహితులు కూడా భాగస్వామితో కలిసి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయాలో ఆలోచిస్తే బెటర్.
తుల (Libra) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పెడితే అది తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉంటే మంచిది. చాలావరకు ఇంటి భోజనానికే తొలి ప్రాధాన్యమివ్వండి. అలాగే ఈ రోజు నుండే మీరు మీ డైట్ ప్లాన్ తయారు చేసుకుంటే బెటర్. మీ ఆరోగ్యం.. మీ పనిపై కూడా ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని నమ్మండి. కొన్ని రోజులు మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తుల ప్రయాణమంతా కుటుంబ సమస్యల చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి సమయాల్లోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మీ సమస్యల పరిష్కారానికి మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదనే విషయాన్ని నమ్మండి. మీ సమస్యలను మీరే వివేకంతో, ఆత్మస్థైర్యంతో పరిష్కరించుకుంటే.. మంచిదని భావించండి.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని ప్రయాణాలు సంభవిస్తాయి. ఉద్యోగులకు అయితే బదిలీలు సంభవించే అవకాశం కూడా ఉంది. అలాగే వివాహితులు తీర్థయాత్రలకు వెళ్లడానికి ఇదే అనువైన సమయం. ఈ రాశి వ్యక్తులు కొందరు ఇల్లు మారే అవకాశం కూడా ఉంది. అయితే ఎలాంటి ప్రయాణాలు చేసినా.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాహన చోదకులు.. డ్రైవింగ్ విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి.
మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశివ్యక్తులకు అనుకోని విధంగా ధన, వస్తు వాహన యోగం కలిగే అవకాశం ఉంది. అలాగే మొండి బాకీలు వసూలవుతాయి. అదేవిధంగా పాత నష్టాలను ప్రయోజనాలుగా మార్చడానికి ప్రయత్నిస్తారు. అయితే ఎంత లక్ ఫ్యాక్టర్ మీ వైపు ఉన్నా.. కొన్ని సందర్భాల్లో ఆ ఫలితాలు మీ కష్టాన్ని బట్టి, నిజాయతీని బట్టి మాత్రమే.. మీకు సిద్ధిస్తాయి. వివాహితులకు ఆస్తులు కలిసొచ్చే అవకాశం కూడా ఉంది.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభం (Aquarius) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు పాజిటివిటీని పెంచుకోవడానికి ఇదే అనువైన సమయం. కనుక ఎలాంటి అవాంతరాలు ఎదురైనా.. సానుకూలంగానే ముందుకు వెళ్లాలి. ఈ క్రమంలో పలు వివాదాలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు. అయితే మీరు నిజాయతీగా ఉన్నంత కాలం.. మీకు మంచే జరుగుతుందనే విషయాన్ని మీరు నమ్మాలి. ఆత్మస్థైర్యంతో దూసుకుపోవాలి.
మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశివ్యక్తుల ప్రయాణంతా కోపతాపాల చుట్టూ తిరుగుతుంది. కనుక ఒక వైపు తమ కోపాన్ని నియంత్రించుకుంటూనే.. ఎదుటి వారి కోపాన్ని కూడా తట్టుకొని శాంతంగా వ్యవహరించడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా స్వయం నియంత్రణ అనేది ఎంతైనా అవసరం. అనవసరమైన వివాదాలలో కూడా తలదూర్చకుండా ఉంటే మంచిది. అలాగే కొన్నిసార్లు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోండి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.