ఈ రోజు (ఆగస్టు 10, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అలాగే వివాహితులు సంసారిక బంధంలో ఎలాంటి విభేదాలకు తావివ్వకుండా ఉంటే మంచిది. ఉద్యోగస్తులు కొత్త సవాళ్లు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులను టేకప్ చేసేటప్పుడు.. ఆయా రంగ నిపుణుల సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం.
వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కాస్త ఆందోళన చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రేమికులు ఆచితూచి వ్యవహరించాలి. నిజాయతీతో తమ బంధం గురించి ఇంట్లో వారికి చెప్పడానికి ప్రయత్నించాలి. అలాగే వివాహితులు భాగస్వామితో ఎలాంటి అభిప్రాయ భేదాలకు తావివ్వకుండా ఉంటే మంచిది. రాజకీయ నాయకులు సైద్ధాంతిక కారణాల కారణంగా.. సొంత పార్టీకే వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది.
మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఉద్రిక్త పరిస్థితుల మధ్య పనిచేయాల్సి ఉంటుంది. అలాగే తెలియని భయం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది. కనుక కాస్త అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి. వివాహితులు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో సంయమనంతో వ్యవహరించాలి.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు కాస్త రిలీఫ్ ఫీలవుతారు. ముఖ్యంగా వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. వివాహితులు కూడా భాగస్వామితో కలిసి హాయిగా గడుపుతారు. ఉద్యోగస్తులు తమ శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. విద్యార్థులు కూడా కొత్త కోర్సుల పట్ల ఆసక్తిని పెంపొందించుకుంటారు.
సింహం (Leo) – ఈ రోజు ఈ రాశివ్యక్తులకు కుటుంబ బంధాలు బలపడతాయి. అవివాహితులు శుభవార్తలు వింటారు. వివాహితులు తమ భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులు సిఫార్సుల వల్ల లాభం పొందుతారు. వ్యాపారస్తులకు కూడా కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.
కన్య (Virgo) – ఈ రోజు నిరుద్యోగులకు అనుకోని ఆఫర్స్ వస్తాయి. అయితే ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఫేక్ జాబ్ ఆఫర్స్ విషయంలో అప్రమతత్తతో ఉండండి. డబ్బు డిపాజిట్ చేయమని చెప్పే కంపెనీల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగులు కూడా ఈ రోజు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. అయితే వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్.
తుల (Libra) – ఈ రోజు స్థిరాస్తుల వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వ్యక్తులకు లాభసాటిగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త వాణిజ్య అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. వివాహితులు సంతానం విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే వ్యాపారస్తులు కూడా బ్రోకర్లను నమ్మే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. యువత ప్రతికూల ఆలోచనలను వీడి.. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఈ రాశి వారికి ఆకస్మిక ధనయోగం ఉన్నా.. చట్టవ్యతిరేక పనులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ప్రేమికులు కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటారు. అయినా భయపడకుండా ముందుకు సాగండి. అలాగే వివాహితులు భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు కళలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
మకరం (Capricorn) – ఈ రోజు ప్రేమికుల సమస్యలు అన్ని ఒక కొలిక్కి వస్తాయి. వివాహితులు తమ తోబుట్టువుల సహాయంతో వ్యాపారాలు లేదా కొత్త కెరీర్ ప్రారంభించవచ్చు. అలాగే ఆలుమగల సమస్యలు ఒక పరిష్కార దశకు చేరుకుంటాయి. వ్యాపారులు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అపరిచితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభం (Aquarius) – ఈ రోజు విద్యార్థులకు బాగా కలిసొస్తుంది. మంచి ఫలితాలను పొందుతారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల విషయంలో మంచి విషయాలను వింటారు. కోర్టు కేసులు, ఆస్తి లావాదేవీలకు సంబంధించిన వివాదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగులు తమ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. వివాహితులు అనుకోని శుభవార్తలు వింటారు.
మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు వాహన వినియోగంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే వ్యాపారస్తులు ఖర్చుల విషయంలో నిలకడగా ఉండాలి. రాజకీయ నాయకులకు పార్టీలో అదనపు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వివాహితులకు విదేశీ ప్రయాణ యోగం ఉంది. ఉద్యోగులు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.