15 ఆగస్టు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

15 ఆగస్టు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 15, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) –  ఈ రోజు విద్యార్థులు ప్రత్యమ్నాయ కోర్సులపై ఆసక్తి చూపించే అవకాశం ఉంది . అలాగే వివాహితులకు ఆధ్యాత్మిక విషయాల పై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులు తమ ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులు ఆఫీసు వివాదాలకు దూరంగా ఉండండి. రాజకీయ రంగంలోని వారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. 

వృషభం (Tarus) – ఈ రోజు ఆరోగ్యం విషయంలో ఈ రాశి వ్యక్తులు శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. వివాహితులకు సంసారిక జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది . విద్యార్థులకు కెరీర్‌కు సంబంధించి తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. బిజినెస్ చేసే వ్యక్తులు తమ వాణిజ్యాన్ని విస్తరించే అవకాశం ఉంది. అలాగే వాహన వినియోగంలో జాగ్రత్తగా ఉండండి.

మిథునం (Gemini) – ఈ రోజు  ఆప్తులు, ఆత్మీయులతో ఈ రాశి వ్యక్తులు ఆనందంగా గడపుతారు . అలాగే అవివాహితులు ప్రేమలో పడే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. బిజినెస్ చేసే వ్యక్తులు.. కొత్త వ్యాపారవేత్తలను కలిసే అవకాశం ఉంది. ఉద్యోగులకు తమ నిజాయతీకి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – ఈ రోజు  యువత తాము కోరుకున్న కెరీర్ వైపు మొగ్గు చూపిస్తారు. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి . వివాహితులకు తమ భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనే నేర్పుతో, సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఈ రాశివారికి విదేశీ ప్రయాణ యోగం ఉంది. 

సింహం (Leo) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో.. విలువైన వస్తువులను భద్రపరిచే సమయంలో అప్రమత్తతతో ఉండాలి. అపరిచిత వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే వ్యాపారస్తులు ఏజెంట్లు, బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహితులు ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. 

క‌న్య (Virgo) –  ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొత్తగా పెళ్లైన దంపతులు రొమాంటిక్‌గా గడుపుతారు. వివాహితులు కూడా తమ భాగస్వామితో హాయిగా, ఆనందంగా కాలాన్ని వెల్లదీస్తారు . సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగ వ్యక్తులకు ఈ రోజు తాము చేపట్టే పనులు విజయవంతం అవుతాయి. రాజకీయ రంగంలోని వ్యక్తులకు అనుకోని పదవులు లభించవచ్చు. 

తుల (Libra) – ఈ రోజు ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. అలాగే మిమ్మల్ని అతిగా ప్రశంసించే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు ధన నష్టం కలిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని అనుకోని సంఘటనలు మిమ్మల్ని ఈ రోజు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. వివాహితులు తమ కుటుంబ సమస్యలను.. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పరిష్కరించుకుంటే మంచిది.  

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీలైతే వారికి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించండి. ఉద్యోగస్తులు సెలవు దినం అయినప్పటికీ కూడా.. కొన్ని ముఖ్య పనులకు హాజరయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు బిజినెస్ విస్తరణకు కొత్త ప్రణాళికలు రచిస్తారు. అలాగే వివాహితులు పలు శుభవార్తలు వింటారు.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు రాశి వారికి సులభ ధనయోగం ఉంది. అలాగే ఊహించని బహుమతులు, కానుకలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కీలక ఒప్పందాలు చేసుకొనే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే కోర్టు కేసులు, ఆస్తి తగాదాలకు సంబంధించిన వివాదాలు ఈ రోజు పరిష్కార దశకు రావచ్చు. 

మకరం (Capricorn) –  ఈ రోజు తల్లిదండ్రులు.. తమ పిల్లలకు సంబంధించి మంచి విషయాలు వింటారు. అలాగే వివాహితులకు.. తమ సోదర, సోదరీమణుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది. అవివాహితులు ప్రేమలో పడే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు ఆర్థిక విషయాలలో రిస్క్ చేయకుండా ఉంటే మంచిది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు.. మరింత శ్రద్ధగా చదవాలి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) - ఈ రోజు ఉద్యోగస్తులకు కాస్త గడ్డుకాలం. తమ అధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు తమ నిర్లక్ష్యం కారణంగా.. మంచి అవకాశాలను పోగొట్టుకుంటారు. రాజకీయ రంగంలోని వారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వివాహితులు తమ భాగస్వామితో ఏర్పడిన మనస్పర్థలను వీలైనంత వేగంగా తొలిగించుకుంటే మంచిది. 

మీనం (Pisces) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధన యోగం ఉంది. అలాగే లగ్జరీ వస్తువులు, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ మొదలైన వాటిని వీరు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు లాభసాటిగా గడుస్తుంది. వివాహితులకు విదేశీ ప్రయాణ యోగం ఉంది. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్య దిశగా ఆలోచనలు చేస్తారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.