ఆగస్టు 2 2019, (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఆగస్టు 2 2019, (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 2, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తుల పరిస్థితి అంతా కూడా ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనసులో నిరాశ ఉన్నా.. బయట పెట్టరు. కానీ కొన్ని పరిస్థితుల్లో మన బాధను ఎదుటి వ్యక్తులతో పంచుకోవడం శ్రేయస్కరం. విద్యార్థులు ఏవైనా ఇబ్బందులు ఉంటే.. నిర్మోహమాటంగా పేరెంట్స్‌తో చెప్పండి. ఉద్యోగులు బాస్ చివాట్లు పెట్టినా.. పాజిటివ్‌గా తీసుకోండి. వ్యాపారస్తులు మొండి బాకీలు వసూలు చేసుకొనే క్రమంలో.. శాంతంగా వ్యవహరించండి. పలు విషయాలలో కోపాలతో పరిష్కారం లభించదు. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు రొమాంటిక్‌గా బాగా కలిసొస్తుంది. ప్రేమికులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. వివాహితులు భాగస్వామితో హాయిగా, ఆనందంగా కాలాన్ని వెల్లదీస్తారు. అలాగే కొత్తగా పెళ్లైన దంపతులు హనీమూన్‌కి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక సాధారణ విషయాలకు వస్తే.. ఈ రోజు ఉద్యోగులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. సృజనాత్మక రంగంలోని వారికి బాగా కలిసొస్తుంది.

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తుల జీవన ప్రయాణం పలు వివాదాల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగులు అనవసర విషయాలలో తల దూర్చకపోవడం మంచిది. వ్యాపారస్తులు ఒకరు చెప్పిన మాటలు విని.. నిజాయతీ లేని ప్రాజెక్టులు టేకప్ చేయద్దు. ప్రేమికులు తమ సమస్యలను.. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పరిష్కరించుకోవడం బెటర్. ఇక సాధారణ విషయాలకు వస్తే..  రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ఈ రోజు బాగా కలిసొస్తుంది.

కర్కాటకం (Cancer) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు మానసిక ఒత్తిళ్లకు బాగా గురవుతారు. కనుక అనేక విషయాలలో అప్రమత్తంగా ఉండడం మంచిది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువ స్ట్రెస్ తీసుకోండా.. కొంత రెస్ట్ తీసుకొని.. ఆ తర్వాత ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్లడం మంచిది. ఉద్యోగులు హైరానా పడిపోయి పనులు చేస్తూ.. మరిన్ని చిక్కులు తెచ్చుకోవద్దు. నిదానంగా పనిచేయండి. అలాగే కుటుంబ సమస్యల విషయంలో జాగ్రత్తగా డీల్ చేయండి. మీరు బాధపడుతూ కూర్చోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావని నమ్మండి. వివేకంతొ ఆలోచించండి. 

మన రాశిని బట్టి బలాలు, బలహీనతలు ఇట్టే తెలుసుకోవచ్చట. అవేంటో చూసేద్దామా..!

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తుల ప్రయాణమంతా సూపర్ ఎనర్జీతో సాగుతుంది. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. ఉద్యోగులు ఎంతో నేర్పుతో పనిచేసి.. అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు నూతన ఉత్సాహంతో.. కొత్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడతారు. ప్రేమికులు ఎవరూ ఊహించని ఓ వివేకవంతమైన  నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థులు కూడా తమ గమ్యాన్ని ఎలా చేరుకోవాలో.. ఒక నిర్థారణకు వస్తారు. 

క‌న్య (Virgo) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు పనులన్నీ నత్తనడకన నడుస్తాయి. కొన్ని పనులు ఆలస్యం కూడా అయ్యే అవకాశం ఉంది. అయినా చిరాకు పడకుండా.. ఓపికగా, నిజాయతీగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్లండి. కొన్ని పనులు ఆగిపోవడం వల్ల ఒత్తిడి కూడా పెరుగుతుంది. కానీ ఇలాంటి సమయాల్లోనే వివేకంతో, సమయస్ఫూర్తితో వ్యహరించాలి. ఉద్యోగులు పెండింగ్ పనులను ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడం బెటర్.  

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా ఎదుటి వారి మీద ఆధారపడి.. పనులను  పూర్తి చేస్తారు. ఉదాహరణకు, ఉద్యోగులు ఆఫీసు వర్క్ విషయంలో కొలీగ్స్ హెల్ప్ తీసుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులు.. కొత్త రుణాలు కోసం ప్రయత్నించవచ్చు. రాజకీయ నాయకులు పొలిటికల్ మద్దతు కోసం ప్రయత్నించనూవచ్చు. ప్రేమికులు స్నేహితుల సహాయంతో.. తమ సమస్యలను ఒక్క కొలిక్కి తీసుకొస్తారు.

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధన, వస్తు, వాహన యోగం ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు అనుకోని విధంగా లాభాలు చేకూరుతాయి. ఉద్యోగులకు జీత, భత్యాలు పెరిగే అవకాశాలు లేదా బోనస్‌లు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే వివాహితులకు.. తమ స్నేహితులు బహుమతులు, కానుకలు అందించే అవకాశం ఉంది. అలాగే లాటరీలు తగలడం లేదా విలువైన ఆస్తులు కలిసి రావడం జరుగుతుంది.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశివ్యక్తుల జీవన ప్రయాణం "బాధ్యత" అనే అంశంపై కేంద్రీకరించబడి ఉంటుంది. ఉదాహరణకు ఆఫీసులో మీకు అధికారులు కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. వ్యాపారస్తులు ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులతో పాటు.. ప్రత్యమ్నాయ రంగాలలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. వివాహితులకు సంబంధించి భర్త దూర ప్రయాణాలకు వెళితే.. భార్య ఇంట్లో అదనపు బాధ్యతలు స్వీకరించడానికి రెడీ అవ్వచ్చు. ఇలా ఈ రోజు ఈ రాశివ్యక్తులు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశివ్యక్తుల ప్రయాణం "కోపం" అనే అంశంపై చుట్టూ తిరుగుతుంది. ఉద్యోగులు అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే కుటుంబంలో భార్య, భర్తల మధ్య అనుకోని కోపాతాపాలు చెలరేగే అవకాశం ఉంది. కనుక, ఈ రోజు మీరు చాలా అప్రమత్తతతో వ్యహరించాలి. సాధ్యమైనంత వరకూ శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి యత్నించాలి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తుల ప్రయాణమంతా అమ్మకాలు, కొనుగోళ్ల చుట్టూ తిరుగుతుంది. వివాహితులు సొంత ఇంటిని నిర్మించుకోవడానికి లేదా కొనడానికి ప్లాన్ చేయవచ్చు. మహిళలు షాపింగ్‌కు అధిక ప్రాధాన్యమిస్తారు. విద్యార్థులు ఖరీదైన వస్తువులు కొనడానికి మొగ్గు చూపిస్తారు. పాత బంగారం అమ్మి.. కొత్త బంగారం కొనడం.. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం... ఇత్యాది విషయాలకు ఈ రోజు అనువైనది.

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తుల ప్రయాణమంతా.. అనుకోని ఛాన్స్‌ల చుట్టూ నడుస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరై.. కాస్త వివేకంగా వ్యవహరిస్తే తప్పకుండా జాబ్ పొందుతారు. సినిమా, మోడలింగ్ రంగాల్లో ప్రయత్నాలు చేసే వ్యక్తులు కూడా తమ పోర్ట్ ఫోలియా రెడీ చేసి.. ఈ రోజే అప్లై చేయండి. స్టార్టప్ సంస్థలు ప్రారంభించాలని భావించే ఔత్సాహికులు.. ఈ రోజు మరింత స్మార్ట్‌గా పనిచేయండి. ఓ అద్భుతమైన అవకాశం మీకోసం రెడీగా ఉంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.