ఆగస్టు 3, 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఆగస్టు 3, 2019 (శనివారం,  ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 3, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తుల ప్రయాణమంతా సమయపాలన చుట్టూ తిరుగుతుంది. విద్యార్థులు సమయం విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా కాలం గడపుతూ.. కొన్ని అత్యవసర విషయాలను మర్చిపోవద్దు. ఉద్యోగులు సమయపాలన పాటించడం మంచిది. అలా పాటిస్తేనే.. మీ క్రమశిక్షణ గురించి ఎదుటివారికి కూడా తెలుస్తుంది. వ్యాపారస్తులు సకాలంలో పేమెంట్లు చేయడం వల్ల.. అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తుల ప్రయాణానికి.. ప్రమాద సూచికలు ఉన్నాయి. కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు.. కూడా అప్రమత్తతతో వ్యవహరించండి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు.. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు జాగరూకతతో వ్యవహరించండి. అపరిచితులను ఇంట్లోకి రానివ్వద్దు. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తుల జీవితం రొమాంటిక్‌గా గడుస్తుంది. ప్రేమికులు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. తమ సమస్యలను ఒక కొలిక్కి తెచ్చుకుంటారు. అలాగే ఆలుమగలు ఎంతో సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. కొత్తగా పెళ్లైన జంటలు.. హనీమూన్ ట్రిప్ గురించి ఆలోచనలు చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కూడా తమ దైనందిన కార్యక్రమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి.. హాయిగా మీ కుటుంబంతో గడపండి. 

కర్కాటకం (Cancer) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తుల జీవితం విజయం వైపు పయనిస్తుంది. వ్యాపారస్తులకు తమ ప్రాజెక్టులకు సంబంధించి చిరకాల కోరికలు నెరవేరే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్లు, పదోన్నతులు లభించే అవకాశం ఉంది. చిరుద్యోగులకు బోనస్‌లు, ఇంక్రిమెంట్లు లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా శుభవార్తలు వింటారు. 

మన రాశిని బట్టి బలాలు, బలహీనతలు ఇట్టే తెలుసుకోవచ్చట. అవేంటో చూసేద్దామా..!

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఖర్చు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా మహిళలు షాపింగ్ వైపు మొగ్గు చూపిస్తారు. యువత సెల్ ఫోన్లు లేదా ఇతర సాంకేతిక పరికరాలు కొనడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా డిస్కౌాంటు రేటులు, రాయితీలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. వివాహితులు ఎఫ్‌డీలు, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో పెట్టుబడులు పెట్టవచ్చు.

క‌న్య (Virgo) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఓ 'లక్కీ ఛాన్స్' లభిస్తుంది. అనుకోని అవకాశాలు మీ తలుపు తడతాయి. అయితే ఆ అవకాశాలను వినియోగించుకోవాలా.. వద్దా అన్నది మీ వివేకం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు కోసం కూ అనుకోని అవకాశాలు వేచి ఉన్నాయి. వెంటనే జాబ్స్‌‌కి అప్లై చేయడం ప్రారంభించండి. ఓ గొప్ప ఆఫర్ మీకోసం సిద్ధంగా ఉంది. 

తుల (Libra) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తుల కదలికలన్నీ కాంట్రవర్సీల చుట్టూ తిరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ కోపాన్ని నియంత్రించుకోండి. కొన్ని విషయాల్లో సమయస్ఫూర్తితో వ్యహరించండి. ఆఫీసులో కూడా ఉద్యోగులు.. మిమ్మల్ని వివాదాల్లోకి లాగే విషయాల జోలికి వెళ్లవద్దు. వ్యాపారస్తులు కూడా ఇతరుల మాటలు విని.. వివాదాస్పద ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టకుండా ఉంటే బెటర్. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు "ఒత్తిడికి" బాగా లోనవుతారు. ఆ ఒత్తిడి ఎలాంటిదైనా కావచ్చు. ముఖ్యంగా ఉద్యోగులకు ఆఫీసులో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే సంయమనంతో వ్యవహరించాలి. స్మార్ట్ వర్క్ చేయాలి. కాంట్రాక్టర్లకు కూడా ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి.. క్లయింట్స్ నుండి ఒత్తిడి ఉండవచ్చు. అయితే ఏ విషయాన్నైనా.. ఛాలెంజింగ్‌గా తీసుకొని ముందుకు వెళ్లాలి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని "ఆఫర్స్" లభిస్తాయి. షాపింగ్ చేసేవారికి ఊహించని రిబేట్లు, డిస్కౌంట్లు లభించవచ్చు. అలాగే సరసమైన ధరలకు బంగారం లేదా వెండి లభించవచ్చు. ఓసారి ప్రయత్నించండి. అలాగే ఈ రోజు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కూడా అనుకోని అవకాశాలు లభిస్తాయి. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశివ్యక్తుల ప్రయాణమంతా అపార్థాల చుట్టూ నడుస్తుంది. కనుక కాస్త వివేకంతో వ్యహరించండి. అటువంటి అపార్థాలను వేగంగా తొలిగించుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమికులు, భార్యభర్తల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. అలాగే ఉద్యోగులు, అధికారుల మధ్య కూడా సయోధ్య కుదరకపోవచ్చు. అయితే.. ఎలాంటి ఇబ్బందులు కలిగినా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యంగా ముందుకు వెళ్లండి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు స్టార్టింగ్ ప్రాబ్లమ్ ఉంటుంది. పనులను ఇబ్బందిగా మొదలుపెడతారు. అయితే విజయవంతంగానే వాటిని పూర్తి చేస్తారు. అలాగే నిర్ణయాలు తీసుకోవడానికి పదే పదే ఆలోచిస్తారు. కానీ ఒక కచ్చితమైన నిర్ఱయాన్ని తప్పకుండా తీసుకుంటారు. ఉద్యోగులు తమ మనసులోని మాటలను అధికారులతో పంచుకోవడానికి మీనమేషాలు లెక్కబెడతారు. కానీ చివరకు ధైర్యం చేసి మాట్లాడతారు. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు ప్రణాళికల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముందుగాా ఫిక్స్ చేసుకున్న ప్లాన్స్ తారుమారయ్యే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్లాన్స్ వాయిదా పడే అవకాశం కూడా ఉంది. కనుక, కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. విమాన, రైళ్ల టిక్కెట్ల రద్దు.. మొదలైన విషయాల్లో ధననష్టం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక చాలా వివేకంతో ఆలోచించి నిర్ఱయాలు తీసుకోండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.