5 ఆగస్టు 2019, (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

5 ఆగస్టు 2019, (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 5, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశివ్యక్తులకు కాస్త ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంది. కనుక ఏవైనా నిర్ణయాలు తీసుకొనేటప్పుడు వివేకంతో ఆలోచించడం మంచిది. ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి ప్రయత్నలోపం లేకుండా మీ పనులు మీరు పూర్తి చేయండి. ఉద్యోగులు నిజాయతీగా వ్యవహరించండి. వ్యాపారులు ఖర్చుల విషయంలో జాగ్రత్త పడడం మంచిది. 

వృషభం (Tarus) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని అదృష్ట అవకాశాలు లభిస్తాయి. లాటరీ తగలడం లేదా బహుమతులు పొందే అవకాశం ఉంది. అలాగే వ్యాపారులకు సులభ ధనయోగం ఉంది. ముఖ్యంగా మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు కూడా మంచి ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు కాస్త ఓపిగ్గా అవకాశాల కోసం వెతికితే.. మంచి జాబ్స్ మీ తలుపు తడతాయి. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు కొత్త ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా యువత తమ కెరీర్‌కు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. అలాగే వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. ఉద్యోగులు కొత్త జాబ్స్ కోసం ప్రయత్నిస్తారు. విద్యార్థులకు కూడా కొత్త కోర్సులపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఇలా ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కాస్త బిజీగా గడుపుతారు. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు ఎక్కువగా అలసటకు గురవుతారు. ముఖ్యంగా ఉద్యోగులకు ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు క్రీడా పోటీలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉండవచ్చు. మహిళలు ఇంటి పనుల్లో బిజీగా గడుపుతారు. అలాగే కొత్త బాధ్యతలూ స్వీకరిస్తారు. 

మన రాశిని బట్టి బలాలు, బలహీనతలు ఇట్టే తెలుసుకోవచ్చట. అవేంటో చూసేద్దామా..!

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశివ్యక్తుల కదలికలన్నీ రొమాంటిక్‌గా ముందుకు సాగుతాయి. ప్రేమికులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అలాగే వివాహితులు తమ భాగస్వామితో కలిసి హాయిగా ఆనందంగా కాలాన్ని వెల్లదీస్తారు. అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. కొత్తగా పెళ్లైన జంటలు హనీమూన్‌కి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. 

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు తమ సామర్థ్యాలను పెంచుకొనే దిశగా ఆలోచిస్తారు. ముఖ్యంగా ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని పెంచుకొనే క్రమంలో కొన్ని వర్క్ షాపులకు హాజరుకావచ్చు. అలాగే వ్యాపారులు కూడా కొన్ని బిజినెస్ సెమినార్స్‌కు హాజరు కావచ్చు. విద్యార్థులు కూడా కొత్త కోర్సుల వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంది. 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశివ్యక్తుల ప్రయాణమంతా ఖర్చుల చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా రుణాలు ఇచ్చే విషయంలోనూ లేదా తీసుకొనే విషయంలోనూ..  ఈ రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మహిళలు షాపింగ్ చేసేటప్పుడు అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. వివాహితులు పొదుపు సూత్రం పాటిస్తే మంచిది. ఆర్థికంగా మన పరిస్థితి బాగున్నప్పుడే.. డబ్బులు వెనకేసుకోవాలి. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా.. కీళ్లకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. అలాగే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఉద్యోగులు, వ్యాపారులు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకొనే దిశగా ఆలోచిస్తే బెటర్. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా తగిన కేర్ తీసుకోండి. 

 ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు నిరాశావాదంతో కొట్టుమిట్టాడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమ బంధాలు విఫలమవ్వడం లేదా వైవాహిక సమస్యలు వేధించడం.. లాంటి సమస్యలు ఎదురవుతాయి. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఏ సమస్యనైనా వివేకంతో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యంపై పూర్తి శ్రద్ద పెట్టడం మంచిది. వీలైతే మీ దినచర్యలో మార్పులు, చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆహారపు అలవాట్ల విషయంలో కూడా అప్రమత్తతతో వ్యవహరించండి. ఒకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకొనే దిశగా కూడా ఆలోచించండి. పని విషయంలో ఎక్కువగా పడి.. మీ ఆరోగ్యాన్ని మీరు అశ్రద్ధ చేయవద్దు.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు శుభవార్తలను వింటారు. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న వ్యక్తులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. అలాగే సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఊహించని ఆఫర్స్ తలుపు తడతాయి. మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా వేసిన టెండర్స్ మంజూరు అవుతాయి. కొత్త కాంట్రాక్టులను టేకప్ చేస్తారు.

మీనం (Pisces) –  ఈ రోజు ఈ రాశివ్యక్తులు ఎదుటివారి సహాయాన్ని పొందుతారు. ముఖ్యంగా మీరు మీ కుటుంబీకుల నుండి ధనసహాయం పొందే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు రుణాలు తీసుకుంటారు. అలాగే పాత స్నేహితులు కూడా మీకు సహాయం చేసే అవకాశం ఉంది. కొన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా మీరు చిక్కుకునే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.