ఈ రోజు (ఆగస్టు 6, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే.. హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలలో చేరండి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలలో మార్పులు చేసుకుంటే బెటర్. అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ చూపించండి.
వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశివ్యక్తులను సోమరితనం, బద్దకం ఆవిరించుకొని ఉంటాయి. కనుక కొన్ని పనులు నత్తనడకన నడిచే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు చదువు విషయంలో ఎలాంటి అశ్రద్ధ చూపించకుండా ఉంటే మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు సమయపాలన పాటించకపోవడం వల్ల మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది.
మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు చాలా చాకచక్యంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పలు సంఘటనలు ఎదురుకావచ్చు. అలాగే మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఇలాంటి సమయంలోనే వివేకంతో వ్యవహరించాలి. సహనంతో సమస్యలను ఒక కొలిక్కి తేవాలి.
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు ప్రతికూల ఆలోచనల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కనుక కాస్త అప్రమత్తతతో వ్యవహరించండి. ముఖ్యంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు నూటికి పదిసార్లు ఆలోచించండి. పాజిటివిటీని పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులు ఆఫీసులో వివాదాస్పద విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్.
మన రాశిని బట్టి బలాలు, బలహీనతలు ఇట్టే తెలుసుకోవచ్చట. అవేంటో చూసేద్దామా..!
సింహం (Leo) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు సంసారిక ఇబ్బందులకు గురవుతారు. ముఖ్యంగా మీ భాగస్వామికి, మీకు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా.. మీరు ఇరువురే పరిష్కరించుకోవడం ఎంతో శ్రేయస్కరం. అలాగే కోపాన్ని నియంత్రించుకోండి. శాంతియుతంగానే ఈ సమస్యలను ఒక కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నించండి.
కన్య (Virgo) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు చాలా ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తారు. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. అన్నింటిలోనూ ముందంజలో ఉండడానికి ప్రయత్నిస్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలని భావిస్తారు. కానీ అత్యుత్సాహం కూడా కొన్ని సందర్భాల్లో మంచిది కాదు. అలాంటి ఉత్సాహమే మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది.
తుల (Libra) – ఈ రోజు ఈ రాశివ్యక్తులకు లక్ ఫ్యాక్టర్ బ్రహ్మాండంగా ఉంది. వారి జీవితానికి సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు కూడా మంచి లాభదాయకమైన కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు విలువైన వస్తువులను పోగొట్టుకొనే అవకాశం ఉంది. కనుక చాలా అప్రమత్తంగా ఉండాలి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు, బ్రోకర్లను నమ్మే విషయంలో నూటికి పదిసార్లు ఆలోచించాలి. మహిళలు బయటకు వెళ్లేటప్పుడు బంగార ఆభరణాల వంటి విలువైన వస్తువులు ధరించకుండా వెళితే మంచిది.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశివ్యక్తులకు బాగా కలిసొస్తుంది. అన్నీ మంచి విషయాలనే వింటారు. ముఖ్యంగా కుటుంబంతో సరదాగా గడుపుతారు. అలాగే పాత మిత్రులను కలుస్తారు. వ్యాపారస్తులకు కూడా సులభ ధన యోగం ఉంటుంది. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు తలుపుతడతాయి. వివాహితులు తమ భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని సమస్యల వలయంలో చిక్కుకొనే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోండి. కొన్ని సమస్యలను శాంతియుతంగా, సమయస్ఫూర్తితోనే పరిష్కరించుకోవాలి. అలాగే సాధ్యమైనంత వరకూ వివాదాల జోలికి వెళ్లేందుకు ప్రయత్నించవద్దు.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభం (Aquarius) – ఈ రోజంతా ఈ రాశి వ్యక్తులకు నిరాశాజనకంగా గడుస్తుంది. కొన్ని విపత్కర పరిస్థితులలో కూడా చిక్కుకొనే అవకాశం ఉంది. మీ అసంతృప్తిని, అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తపరుస్తారు. అయినా సరే ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో ముందుకువెళ్లడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా.. మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చడానికి ప్రయత్నించవద్దు.
మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశివ్యక్తులకు ధన, వస్తు, కనక, వాహన యోగం ఉంది. కనుక కొంచెం కష్టపడితే సులువుగా ధనం సంపాదించగలుగుతారు. అలాగే మీ సన్నిహితుల నుండి బహుమతులు కూడా పొందే అవకాశం ఉంది. అలాగే మహిళలకు షాపింగ్‌లో భారీ రిబేట్లు, డిస్కౌంట్లు లభిస్తాయి. స్థిరాస్తులు కొనాలనుకొనే వారికి కూడా ఇది అనువైన రోజు.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.