23 ఆగస్టు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు మీరు చదివేయండి)

23 ఆగస్టు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు మీరు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 23, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – మీకు వచ్చిన పదోన్నతి కారణంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఓ వ్యక్తి మీకు అనుకూలంగా మాట్లాడుతూ మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక ఒప్పందం తీసుకొస్తారు. మీరు దానిని సంతోషంగా అంగీకరిస్తారు.

వృషభం (Tarus) – విజయం సాధించడానికి కష్టించే తత్వం, క్రమశిక్షణ.. ఉంటే చాలని మీకు బాగా తెలుసు.. అయినా సరే.. దీనిని త్వరలో మీరు అనుభవపూర్వకంగా కూడా తెలుసుకుంటారు.

మిథునం (Gemini) – మీరు అతిగా ఆలోచించడం వల్ల సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. ఫలితంగా మీరు చేస్తోన్న పని కూడా బాగా ప్రభావితం అవుతోంది. కాబట్టి మీ బుర్రలో ఉన్న ఆలోచనలను ముందుగా క్రమబద్ధీకరించుకోవడానికి ప్రయత్నించండి.

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – ప్రస్తుతం మీ ముందు కొన్ని సవాళ్లు, సమస్యలు ఉన్నాయి. వాటిని చూసి మీరేమీ భయపడిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. కాస్త కష్టపడితే ముందున్నదంతా అద్రుష్టమే. మీరు ఎప్పట్నుంచో ఒక పదవి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాస్త సహనంగా ఉండండి. మీకు సరిపడని ఉద్యోగానికి తొందరపడి అప్లై చేయకండి. కాస్త సమయం తీసుకొని బాగా ఆలోచించండి.

సింహం (Leo) – మీరు ఎప్పట్నుంచో వెతుకుతున్న ప్రేమ మీ కళ్ల ముందుకు వచ్చే సమయం దగ్గర్లోనే ఉంది. అయితే వారు మీకు పరిచయం లేని వారని అనుకోకండి. మీకు తెలిసినవారు కూడా కావచ్చు.

క‌న్య (Virgo) – మీకు వచ్చిన అవకాశాన్ని మీరు ముందుగానే అందిపుచ్చుకుంటారు. ఈ క్రమంలో ఆఫీసులో ఉండే రాజకీయాలు లేదా చిన్న చిన్న సమస్యలు మీ ద్రుష్టిని మరల్చలేవు. మీ ఏకాగ్రత చాలా బలమైంది.

తుల (Libra) – మీ వ్యక్తిగత జీవిత ప్రభావం వ్రుత్తిపరమైన జీవితంపై పడకుండా చాలా చక్కగా మీరు బ్యాలన్స్ చేస్తారు. అయితే ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం కూడా ముఖ్యమే సుమా..

వృశ్చికం (Scorpio) – మీ భాగస్వామి గత కొద్ది రోజులుగా చాలా దిగులుగా ఉంటున్నారు. అయితే అందుకు గల కారణాలు మాత్రం వారు మీతో పంచుకోవడం లేదు. మీరు వారి కోసం కాస్త సమయం కేటాయించి, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావచ్చు.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – మీకు బాగా ఆసక్తికరంగా ఉన్న పనులు చేస్తూ సంతోషంగా సమయం గడుపుతున్నారు. ఆఫీసు విధుల్లో భాగంగా మీ సహచరులు అందరితోనూ కలిసి ఓ సమావేశంలో పాల్గొంటారు. అయితే మీ ఉద్యోగ రీత్యా మీరొక విదేశీ భాష నేర్చుకోవాల్సి రావచ్చు.

మకరం (Capricorn) – మీకు అప్పగించిన పని పూర్తి చేయడానికి మీరు కాస్త ఎక్కువ సమయమే తీసుకుంటున్నారు. వేగం పెంచకపోతే ఇబ్బందిపడక తప్పదని తెలుసుకోండి.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) – మీ ప్రేమ జీవితం గురించి అతిగా ఆలోచించకండి. దానికి బదులుగా వర్తమానంలో మీ భాగస్వామితో కలిసి సంతోషంగా జీవించడం పై ద్రుష్టి పెట్టండి. చక్కని ఫలితం కనిపిస్తుంది.

మీనం (Pisces) – మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి మీరు ఎంత కట్టుబడి ఉంటున్నారో మీ భాగస్వామికి తెలియజేయండి. అది మీ బంధాన్ని మరింత ధ్రుడంగా మారుస్తుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.