24 ఆగస్టు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు మీరు చదివేయండి)

24 ఆగస్టు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు మీరు చదివేయండి)

ఈ రోజు (ఆగస్టు 24, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) – ఆఫీసులో సహచరుల మధ్య కమ్యూనికేషన్‌లో జరిగే లోపాల కారణంగా మీకు ఒత్తిడి ఎదురుకావచ్చు. ఈ రోజు జరిగే ఓ ముఖ్యమైన సమావేశం మీకు ప్రయోజనాలను చేకూర్చవచ్చు. మీరు తీసుకునే ఆహారంపై ద్రుష్టి పెట్టడం చాలా అవసరం.

వృషభం (Tarus) – ఈ మెయిల్స్, కమ్యూనికేషన్‌లో జరిగే జాప్యాల కారణంగా పనిలో పెద్దగా మార్పు ఏమీ ఉండదు. పాత క్లయింట్స్ నుంచి పని రావచ్చు. మీ కుటుంబ సభ్యుల ఎమోషనల్ అవసరాలు తీర్చడానికి మీరు అందుబాటులో ఉండండి.

మిథునం (Gemini) – మీకున్న పనిలో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ అది మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. అలాగే ఇతరుల ప్రవర్తన కారణంగా మీకు కాస్త డిస్టర్బ్డ్‌గా అనిపించవచ్చు. కానీ మీరు దేనికీ స్పందించకండి. మీ ప్రాధాన్యాలపైనే పూర్తి ద్రుష్టి పెట్టండి. తప్పక హాజరుకావాల్సిన సందర్భాలతో వ్యక్తిగత జీవితంలోనూ బిజీగా గడుపుతారు. భాగస్వామితో గొడవ పడకండి.

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – మీకున్న క్రియేటివిటీని సక్రమంగా ఉపయోగించుకోవడం ద్వారా ఈ రోజు మీ ఉత్పాదన బాగుండేలా చూసుకుంటారు. అలాగే మీరు చేపట్టిన కొత్త వ్యాపారాలు, ఆలోచనలపై ఓ స్పష్టత కూడా వస్తుంది. మీ కుటుంబ సభ్యులకు మీ తోడు అవసరం. అలాగే మీ భాగస్వామితో గడిపేందుకు కూడా కాస్త సమయం కేటాయించుకోండి.

సింహం (Leo) – పని ప్రదేశంలో మీకు అవసరమైన సహాయం మీ సీనియర్స్ నుంచి అందుతుంది. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఎవరి ఎమోషన్స్ వారు మీ ముందు ప్రదర్శిస్తారు. అయితే వారికి అవసరమైన స్పేస్ ఇవ్వడం కూడా ముఖ్యమే. మీ స్నేహితులతో మనసు విప్పి మాట్లాడండి. ప్రశాంతత లభిస్తుంది.

క‌న్య (Virgo) – పెండింగ్‌లో ఉన్న పూర్తి చేయాల్సి రావడంతో ఈ రోజంతా చాలా బిజీగా గడుస్తుంది. అలాగే ఈ రోజు జరగాల్సిన సమావేశాల్లో కాస్త జాప్యం జరగవచ్చు. ఇతరుల మనసులో ఉన్న అభద్రత కారణంగా మీ ద్రుష్టి మరలగుండా జాగ్రత్తపడండి. సాయంత్రం కూడా కాస్త బిజీగానే సమయం గడుపుతారు.

తుల (Libra) – మీరు చేస్తున్న పని వేగం పుంజుకుంటుంది. కానీ పని ప్రదేశంలో మీ సహచరులతో ఉన్న ఇష్యూస్ కారణంగా ఎమోషనల్‌గా మీకు టెన్షన్‌గా అనిపించవచ్చు. పనిలో ఎదురైన ఒత్తిడిని ఇంటికి మోసుకెళ్లకండి. అది మీ మూడ్, సంబంధ బాంధవ్యాలపై ప్రభావం చూపించవచ్చు.

వృశ్చికం (Scorpio) – ఇతరుల నుంచి డిమాండ్స్ అధికంగా ఉండడం వల్ల మీరు పూర్తి చేయాల్సిన పని చాలా ఎక్కువగా ఉండచ్చు. కానీ మీరు ఫోకస్ చేయలేకపోవచ్చు. మీ ప్రాధాన్యాలను సరిచూసుకోండి. ఆఫీసులో సహచరులతో సహనంతో వ్యవహరించండి. క్లయింట్స్ నుంచి మీరు ఎదురుచూస్తోన్న స్పష్టత మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గతం గురించి మాట్లాడకండి.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఇతరుల నుంచి కొన్ని విషయాల్లో స్పష్టత లభించడానికి ఆలస్యం అయిన కారణంగా పని కాస్త ఎక్కువగా ఉండవచ్చు. మీరు ఒంటరిగా సమయం గడపడానికి ప్రయత్నించండి. కొత్త ఐడియాలను స్వాగతించండి. ఒకవేళ మీరు నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంటే మీ చుట్టుపక్కల ఉన్నవారి సహాయం తీసుకోండి. నిద్రలేమి కారణంగా మీకు అలసటగా అనిపించవచ్చు.

మకరం (Capricorn) – ఆఫీసులో మీరు కలిసి పని చేసే వ్యక్తులతో అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశాలున్నాయి. కాబట్టి వీలైనంత మేరకు సహనంతో వ్యవహరించండి. మీకు కావాల్సిన ఫలితాలకు సంబంధించి కచ్చితత్వంతో వ్యవహరించండి. ఇతరులకు ఉన్న సమస్యల కారణంగా కుటుంబపరమైన జీవితంలోనూ ఒత్తిడి ఉండచ్చు.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) – పనిలో రోజు చాలా నిదానంగా గడుస్తుంది. అయితే ఇతరులు వారి కమిట్‌మెంట్స్‌కు కట్టుబడి ఉండకపోవడం వల్ల మీకు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ వాటిని అలానే వదిలేయండి. మీ చుట్టూ ఉన్నవారు మీ సహాయం కోసం మిమ్మల్ని కోరవచ్చు. కాబట్టి వారికి అందుబాటులో ఉండండి.

మీనం (Pisces) – మీ ప్లాన్స్‌లో జరిగే మార్పులు, ఆలస్యం కారణంగా పని నిదానంగా జరగవచ్చు. మీ షెడ్యూల్‌ని ఎప్పటికప్పుడు సరిచూసుకోండి. చేసే ప్రతి పనిలోనూ ఆర్గనైజ్డ్‌గా వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో గొడవ పడకండి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.