మొలకలతో ఆరోగ్యకరమైన, నోరూరించే వంటకాలు.. ఇలా తయారు చేసేద్దామా..!

మొలకలతో ఆరోగ్యకరమైన, నోరూరించే వంటకాలు.. ఇలా తయారు చేసేద్దామా..!

వర్షాకాలం బయట వాన పడుతుంటే..  దుప్పటి కప్పుకొని వేడి వేడి ఛాయ్ చప్పరిస్తూ.. హాట్ హాట్ బజ్జీలు, పకోడీలు తినాలని చాలామంది భావిస్తుంటారు. కానీ దీనివల్ల బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. బయట నుంచి తెచ్చుకుని తినే ఆహారం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. మరి, ఎలా అని ఆలోచిస్తున్నారా?

మేం చెప్పేది పాటిస్తే చాలు.. వానా కాలంలో మీరు తినే చట్ పటా వంటకాలు మీ ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు వీటిలో లభ్యమయ్యే క్యాలరీల వల్ల మీరు బరువు పెరిగే అవకాశం కూడా తగ్గుతుంది. పైగా ఎన్నో పోషకాలు కూడా అందుతాయి. ఇన్ని సుగుణాలున్న ఆహారం ఏంటి అనుకుంటున్నారా? మన ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే మొలకలు (Sprouts).. వాటితో చేసే వంటకాలు.. ఇవి తయారుచేయడం కూడా చాలా సింపుల్. మరి, వీటిని ఎలా చేసుకోవాలంటే..

ఈ రెసిపీలన్నింటినీ (recipes) తయారుచేసుకోవడానికి ముందు ఓ పని చేయాలి.  శనగలు, పెసలు, ఉలవలు.. ఇలా ఏవో కొన్ని పప్పు ధాన్యాలు నానబెట్టుకొని.. సాయంత్రం తీసి తడిగుడ్డలో కట్టి పెట్టాలి. వాటికి మొలకలు వచ్చాక ఈ వంటకాలు చేసుకోవచ్చు.

1. స్ప్రౌట్ చట్ పటా

Shutterstock

కావాల్సినవి
ఉడికించిన మొలకలు, చాట్ మసాలా, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కారం, ఉప్పు, కొత్తిమీర

తయారీ
టీతో పాటు తినడానికి ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది. దీనికోసం చేయాల్సిందల్లా.. మొలకలు ఉడికించి .. దాన్ని ఒక గిన్నెలో వేసుకొని.. అందులో చాట్ మసాలా, కారం, ఉప్పు, ఉల్లిపాయలు, కొత్తిమీర వంటివన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కావాలంటే టొమాటోలు కూడా వేసుకోవచ్చు. ఆఖరున కాస్త నిమ్మరసం వేసి కలిపి తింటే.. చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా మొలకలు ఉడికించి పెట్టుకుంటే చాలు.. స్టవ్ అవసరం కూడా ఉండదు కాబట్టి.. కేవలం ఇంట్లోనే కాదు.. ఆఫీస్, క్యాంపింగ్, టూర్స్ వంటివాటికి దీన్ని తీసుకెళ్లవచ్చు. 

హైదరాబాద్ ట్రెండ్స్: ఈ పక్కా హైదరాబాదీ వంటలు మీరు రుచి చూశారా?

2. స్ప్రౌట్ సలాడ్

Instagram

కావాల్సినవి
మొలకెత్తిన గింజలు, మయోనైజ్, చిల్లీ సాస్, ఉప్పు, కారం, ఉల్లిపాయలు, కీరా, క్యారట్, టొమాటో, కొత్తిమీర

తయారీ
ఒక పెద్ద గిన్నె తీసుకొని.. అందులో మొలకెత్తిన గింజలు వేసుకొని అందులోనే మళ్లీ ఉల్లిపాయలు, టొమాటోలు, కీరా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో మయోనైజ్, చిల్లీసాస్, ఉప్పు వేసి కలిపి పైన కొత్తిమీర జల్లితే సరిపోతుంది. రష్యన్ స్టైల్ స్ప్రౌట్ సలాడ్ సిద్ధం. కూరగాయలు, మొలకలు రెండింట్లో చాలా చాలా పోషకాలుంటాయి కాబట్టి ఇది చాలా ఆరోగ్యకరం. 

వైజాగ్ ట్రెండ్స్: ఈ ఫేమస్ వంటకాలను.. ఓసారి మీరూ రుచి చూడండి..!

3. స్ప్రౌట్ భేల్

Instagram

కావాల్సినవి
మొలకెత్తిన గింజలు, ఉడికించిన బంగాళాదుంపలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టొమాటోలు, సోర్ సాస్, సేవ్

తయారీ
ముందుగా ఉడికించిన మొలకెత్తిన గింజలు తీసుకొని.. అందులో బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయలు, టొమాటోలు వేసుకోవాలి. దానిపైన సేవ్ వేసుకోవాలి. కావాలంటే కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. కావాలంటే బొరుగులు కూడా కలుపుకోవచ్చు. కావాలంటే మీకు నచ్చిన కూరగాయలు, పాప్ డీ వంటివి కూడా చేర్చుకోవచ్చు. 

భోజ‌న‌ప్రియులైనా.. వంట రాక‌పోతే ఎలా ఉంటుందో మీకు తెలుసా?

4.స్ప్రౌట్ టిక్కీ

shutterstock

కావాల్సినవి
మెత్తగా ఉడికించిన మొలకలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, శనగపిండి, కారం

తయారీ
ముందుగా మెత్తగా ఉడికించిన మొలకలను బాగా మెదుపుకోవాలి. లేదంటే కచ్చాపచ్చాగా మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఆ తర్వాత.. అందులో సన్నగా తురిమిన ఉల్లిపాయలు, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా శనగపిండి కూడా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల టిక్కీ నిలిచి ఉంటుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని గుండ్రని ఉండల్లా చేసుకొని కొద్దిగా వత్తాలి. ఇలా చేయడం వల్ల టిక్కీలు తయారవుతాయి. వీటిని పెనంపై ఉంచి కొద్దిగా నూనె వేసుకొని కాల్చుకోవాలి. తక్కువ మంటపై ఉంచి కాల్చి.. బంగారు రంగు వచ్చేవరకూ అలాగే ఉంచాలి. 

5. స్ప్రౌట్స్ దోశ

Shutterstock

కావాల్సినవి
మొలకలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, శనగపిండి, బియ్యం పిండి, పసుపు, నూనె

తయారీ
ముందుగా మొలకలు మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమానికి అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు చేర్చుకోవాలి. ఈ మిశ్రమం లూజ్‌గా ఉంటే.. అందులో కాస్త బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా శనగపిండి వేసుకోవాలి. ఆపైన పెనంపై దోశల్లా పోసుకోవాలి. రెండు వైపులా కాల్చుకొని టొమాటో సాస్‌‌తో తింటే బాగుంటుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.