చిలుకూరు బాలాజీ గుడి ఆధ్వర్యంలో.. అమ్మాయిల భద్రత కోసం "జటాయువు ఆర్మీ"

చిలుకూరు బాలాజీ గుడి ఆధ్వర్యంలో.. అమ్మాయిల భద్రత కోసం "జటాయువు ఆర్మీ"

రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ (chilukuru balaji temple) ఆలయ పాలక వర్గం ఒక వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఆలయ ప్రాంగణంలో ఈవ్ టీజింగ్‌కు  అడ్డుకట్ట వేసేందుకు "జటాయువు ఆర్మీ"ని ప్రారంభించింది. రామాయణంలో రావణుడి నుండి సీతాదేవిని రక్షించే క్రమంలో.. జటాయువు పక్షి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ జటాయువు పేరు మీదుగా.. ఆలయ ప్రాంగణంలో ఆడపిల్లలను ఏడిపించడానికి ప్రయత్నించే ఆకతాయిలను కట్టడి చేసేందుకు ఈ ఆర్మీని ప్రారంభించామని తెలిపారు ఆలయ నిర్వాహకులు సీఎస్ రంగరాజన్.

ఆలయానికి సంబంధించిన వ్యక్తులతో పాటు పలువురు ట్రస్టీలను, భక్తులను కూడా ఈ ఆర్మీలో భాగస్వాములను చేశారు. ఈ జటాయువు ఆర్మీ సభ్యులు బయట కూడా క్రియాశీలకంగా పనిచేస్తారని.. మహిళల భద్రత కోసం పాటుపడతారని.. ఎవరైనా ఆకతాయిలు అమ్మాయిలను వేధిస్తున్నట్లు తెలిస్తే.. వారిని ఈ ఆర్మీ కట్టడి చేస్తుందని తెలిపారు. ఈ సమాజంలో రోజు రోజుకీ మహిళల పై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోతున్న క్రమంలో ఇలాంటి ఆర్మీలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రంగరాజన్ తెలిపారు. 

మహిళలకు కోపం తెప్పించిన మ్యానిఫెస్టో.. వ్యాకరణ దోషాలతో వచ్చిన చిక్కు..!

ఈ జటాయువు ఆర్మీని ప్రారంభించిన సందర్భంగా.. ఆలయ పాలక వర్గం నదీమ్ అనే ముస్లింను సత్కరించింది. ఇటీవలే నదీమ్ కిడ్నాప్‌కు గురవబోతున్న ఓ మైనర్ బాలికను కాపాడి.. వార్తలలో నిలిచారు. ఉస్మాన్ సాగర్ ప్రాంతంలో ఉండే ప్రఖ్యాత చిలుకూరు బాలాజీ ఆలయం.. "వీసా బాలాజీ టెంపుల్"గా ప్రసిద్ధి గాంచింది. ప్రతీ రోజు వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

ఇంతమంది భక్తులను కంట్రోల్ చేయడం కూడా ఓ పెద్ద టాస్క్ అని.. ఆలయ ప్రాంగణంలో కూడా ఈవ్ టీజింగ్ జరిగిన సందర్భాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. అందుకే ఆకతాయిలను కట్టడి చేయడానికి.. మొదటి ప్రయత్నంగా ఈ జటాయువు ఆర్మీని ప్రారంభించడం మంచి నిర్ణయమని పలువురు భక్తులు పేర్కొంటున్నారు.

తెలంగాణలో తొలి విమెన్ క‌మాండో టీంని ప్రారంభించిన క‌రీంన‌గ‌ర్ అధికారులు..!

జటాయువు రామాయణ గాధలోని ఓ అద్భుతమైన పాత్ర. శ్రీరాముడికి జటాయువు పక్షి మంచి స్నేహితుడు. రావణుడు సీతాదేవిని అపహరించి తీసుకెళ్తున్న సమయంలో.. అతనితో వీరోచితంగా పోరాడి ఆఖరికి గాయాలతో నేలకొరిగిపోతాడు. రాముడు తనకు కనిపించే వరకు ప్రాణాలను బిగబట్టుకొని.. అతని చెవిలో సీతను అపహరించింది ఎవరో తెలిపి కన్ను మూస్తాడు. శ్రీరాముడే దగ్గరుండి.. జటాయువు దహన సంస్కారాలు జరిపించాడని అంటారు.

ఆ జటాయువు వీరోచిత గాథనే ప్రేరణగా తీసుకొని.. మహిళల రక్షణ కోసం తన పేరు మీద ఆర్మీని ప్రారంభించామని అంటున్నారు చిలూకూరి బాలాజీ ఆలయ కమిటీ సభ్యులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో నెలకొల్పబడిన చిలుకూరి బాలాజీ గుడికి.. చాలా పురాతన చరిత్ర ఉంది. ఓ బాలాజీ భక్తునిచే ఈ ఆలయం నిర్మించబడింది.                                                                         

Featured Image: Wikimedia Commons

తన నిఖా జరిపించే మహిళ కోసం.. ఎనిమిది నెలలు వెతికిందట ఈ అమ్మాయి..!

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.