ఆలుమగలు రోజూ శృంగారంలో పాల్గొనడం.. ఎందుకు మంచిదో తెలుసా?

ఆలుమగలు రోజూ శృంగారంలో పాల్గొనడం.. ఎందుకు మంచిదో తెలుసా?

సెక్స్ (Sex).. మాటల్లో వర్ణించలేని ఒక అందమైన అనుభూతి. ఇది మనకు మంచి మూడ్‌ని అందించడమే కాదు.. మనలో కొత్త శక్తి వచ్చి చేరేలా కూడా చేస్తుంది. అయితే కొందరు ఆలుమగలు తరచూ సెక్స్‌లో పాల్గొంటే; ఇంకొన్ని జంటలు మాత్రం అప్పుడప్పుడూ మాత్రమే కలయికలో పాల్గొంటూ ఉంటాయి. పెళ్లైన కొత్తలో ఎంత తరచూ సెక్స్‌లో పాల్గొన్నప్పటి..కీ మారుతున్న జీవనశైలి, రోజువారీ పనులు.. మొదలైన అనేక కారణాల (reasons) వల్ల కలయికలో పాల్గొనాలనే ఆసక్తి కూడా క్రమంగా తగ్గుతూ వస్తుందనడంలో నిజం లేకపోలేదు.

అందుకే దంపతులు తమ మధ్య అన్యోన్యతను పెంచుకునేందుకు దీనిని కూడా ఓ మార్గంగా మలుచుకోవాలని సూచిస్తున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. ఇలా చేయడం ద్వారా కేవలం ఆలుమగల మధ్య బంధం బలపడడమే కాదు.. మనకు రకరకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయట. అందుకే రోజూ సెక్స్‌లో పాల్గొన్నా మంచిదే అని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఇంతకీ రోజూ సెక్స్‌లో పాల్గొనడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలేంటో మీకు తెలుసా?? అవి ఇవే..

shutterstock

మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది..

పని ప్రదేశంలో జరిగే చిన్న చిన్న గొడవలు, బస్సు మిస్ అవ్వడం, ఆలస్యం అయిన కారణంగా బాస్‌తో తిట్లు తినడం, ఆలస్యంగా నిద్ర లేవడం.. ఇలా ఎన్నో కారణాల వల్ల మన డైలీ రొటీన్ ప్రభావితమై సంతోషాన్ని కోల్పోయే అవకాశాలు చాలానే ఉంటాయి. ఇలాంటి కారణాలు ఎన్ని ఉన్నా సరే.. రోజుకు ఒక్కసారైనా సెక్స్‌లో పాల్గొనడం ద్వారా.. ఈ బాధలన్నీ పక్కనపెట్టి మనం సంతోషంగా ఉండచ్చట.

సెక్స్‌లో పాల్గొన్నప్పుడు విడుదలయ్యే డోపమైన్ అనే హార్మోన్ ఇందుకు కారణమవుతుంది. అందుకే రోజు ఎలా ఉన్నా.. దానిని ఆనందంగా మలుచుకోవడానికి ఒక్కసారైనా సెక్స్‌లో పాల్గొంటే మంచిది అంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.

ఆలుమగల మధ్య సఖ్యత పెరుగుతుంది..

తరచూ సెక్స్‌లో పాల్గొనే దంపతుల మధ్య అన్యోన్యత చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఒకరితో మరొకరు మరింత సఖ్యంగా మెలిగేలా వారిని దగ్గర కూడా చేస్తుంది. రోజూ కలయికలో పాల్గొనడం ద్వారా.. ఇద్దరి మనసుల మధ్యే కాదు.. శరీరాల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది. ఫలితంగా మరింత సౌకర్యవంతంగా సెక్స్‌లో పాల్గొంటారు.

సాధారణంగా చాలామంది మహిళలు తమ శరీరం గురించి ఏవేవో ఆలోచిస్తూ.. భాగస్వామితో కలయికలో పాల్గొనే క్రమంలో అన్యమనస్కంగా, అసౌకర్యంగా ఉంటూ ఉంటారు. కానీ రోజూ కలయికలో పాల్గొంటే.. ఈ ఆలోచనలన్నీ పోయి తమని తాము ప్రేమించుకోవడం మొదలుపెడతారు. క్రమంగా ఆలుమగలిద్దరూ సంతోషంగా, సఖ్యంగా మెలగవచ్చు. ఒకరిపై మరొకరికి ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అన్నింటినీ మించి ఒకరి ఇష్టాయిష్టాల గురించి మరొకరు పూర్తిగా తెలుసుకోవచ్చు.

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది..

ఎంత తరచుగా సెక్స్‌లో పాల్గొంటే హ్యాపీ హార్మోన్స్ (ఎండార్ఫిన్, డోపమైన్).. అంత ఎక్కువగా విడుదలవుతాయని మనం ముందే చెప్పుకున్నాం. ఇవి కేవలం మనల్ని సంతోషంగా ఉంచడమే కాదు.. మనలోని ఆత్మవిశ్వాస స్థాయులను కూడా పెంచుతాయి. అంటే వైవాహిక బంధాన్ని సంతోషంగా మార్చుకుంటూనే.. మెదడు, శరీరానికి మధ్య కో ఆర్డినేషన్ కూడా అద్భుతంగా ఉండేలా చేసుకోవచ్చన్నమాట.

shutterstock

బంధాన్ని బలపరుస్తుంది..

మీకు మీ జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా? మీ వైవాహిక బంధం రొటీన్‌గా మారిపోతోందా?? అయితే మీ పరిస్థితుల్లో మార్పు రావాలంటే అందుకు సెక్స్‌ని ఓ మార్గంగా ఎంచుకోవచ్చట. మీరు ఎంత తరచుగా మీ జీవిత భాగస్వామితో సెక్స్ లైఫ్‌ని ఆస్వాదిస్తే .. అంతే త్వరగా ఈ సమస్యలన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి.

ఆలుమగల ప్రవర్తనలో వచ్చే మార్పులే పరిస్థితులు సర్దుకునేలా చేస్తాయట. అలాగే మీ జీవిత భాగస్వామి మీ గురించి శ్రద్ధ వహించడం పెరుగుతుంది. మీరు కోరుకున్న విధంగా వారు.. మరింత ఎక్కువ ప్రేమను కూడా మీకు అందిస్తారు. తద్వారా మీ వైవాహిక బంధం మరింత బలపడుతుంది.

మిమ్మల్ని మెరిపిస్తుంది..

అమ్మాయిలూ.. హైలైటర్ పక్కన పెట్టి.. ముందు మీ భర్తతో గడిపేందుకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇది మీ గుండె పనితీరుని మరింత మెరుగుపరచడమే కాదు.. శరీరంలోని కొన్ని క్యాలరీలను కరిగించి, చెమట రూపంలో వాటిని బయటకు పంపించి చర్మాన్ని మెరిసేలా కూడా చేస్తుంది. పరిశుభ్రమైన పోషకాహారం తీసుకుంటూ ముఖాన్ని ప్రకాశవంతంగా మెరిపించుకునే వారి ముఖంలో కనిపించే మెరుపు, తరచూ సెక్స్‌లో పాల్గొనే వారి ముఖంలో కూడా కనిపిస్తుందట.

దూరం తగ్గిస్తుంది..

ఈ రోజుల్లో చాలా బంధాలలో.. పలు కారణాల వల్ల తెలియకుండానే దూరం పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆలుమగల విషయంలో కలిసి మాట్లాడుకునే సమయమే అంతంతమాత్రంగా ఉంటోంది. ఇక సెక్స్‌కి సమయం ఎక్కడిది అంటారా?? కారణాలు ఏవైనా.. ఆలుమగల మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించడానికి ఉపయోగపడే తారకమంత్రం సెక్స్. దీనికి రోజూ కాస్త సమయం కేటాయించి చూడండి. వైవాహిక బంధం తప్పకుండా సంతోషంగా మారుతుంది.

shutterstock

కలిసి గడిపే సమయం పెరుగుతుంది..

అధిక పనిగంటలు వర్క్ చేసి.. ఆలుమగలిద్దరూ విడివిడిగా కష్టపడి ఇంటికి చేరిన తర్వాత.. ఇద్దరూ కలిపి గడిపే సమయం ఎంత ఉంటుంది?? మహా అయితే భోజనం చేసి, కాసేపు కబుర్లు చెప్పుకొని నిద్రపోతారు. అంతేనా?? కానీ మీ రొటీన్‌లో సెక్స్‌ని కూడా భాగం చేసుకుని చూడండి. ఆ మార్పు వల్ల కలిగే ప్రయోజనం ఏంటో మీకే స్పష్టంగా తెలుస్తుంది.

ఇద్దరూ కలిసి సరదాగా సమయం గడుపుతూ సెక్స్‌లో పాల్గొనడానికి ప్రాధాన్యం ఇవ్వండి. అయితే ఆ సమయంలో ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా ముందుగానే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి సుమా.. అలాగే భార్యాభర్తలిరువురూ మాట్లాడుకునే విషయాలు కూడా వివాదాలకు తెరతీయకుండా ఉండాలని గుర్తుంచుకోండి.

చక్కని నిద్ర..

రోజూ సెక్స్‌లో పాల్గొనడం ద్వారా.. చక్కని నిద్ర కూడా మనకు సొంతమవుతుంది. ఇది మనల్ని అందంగా కనిపించేలా కూడా చేస్తుంది. అంతేకాదు.. శరీరానికి చక్కని విశ్రాంతి లభించి, తాజాగా నిద్ర లేచిన అనుభూతి కూడా మనకు కలుగుతుంది. ఫలితంగా రోజంతా సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో గడపచ్చు.

లైంగికపరమైన కోరికలేంటో తెలుస్తాయి..

ప్రతిఒక్కరికీ లైంగికపరంగా కొన్ని కోరికలు ఉండడం సహజమే. కొందరు వీటి గురించి ముందే తెలుసుకుంటే.. ఇంకొందరు సెక్స్‌లో పాల్గొనే క్రమంలో వారికి ఉన్న ఈ కోరికల గురించి తెలుసుకుంటారట. ఈ క్రమంలోనే కొత్త కొత్త భంగిమలు ప్రయత్నించడం, భాగస్వామిని తృప్తి పరచడానికి ప్రయత్నించడం.. వంటివి చేస్తారట. తద్వారా సెక్స్ లైఫ్ రోజూ ఎంజాయ్ చేయడమే కాదు.. కొత్త కొత్త అనుభూతులు మిగుల్చుకుంటూ స్వర్గపు అంచులను తాకుతారట.

చూశారుగా.. రోజూ సెక్స్‌లో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో.. వీటిని మీరూ గుర్తుపెట్టుకోండి. చక్కని దాంపత్య జీవితంతో మీ వైవాహిక బంధాన్ని మరింత బలంగా మార్చుకోండి.

ఇవి కూడా చదవండి

సెక్స్టింగ్ చేసేటప్పుడు.. ఈ నియమాలు పాటించాల్సిందే..!

ఈ ఏడు శరీర భాగాల్లో టచ్ చేస్తే.. పురుషులకు చాలా ఇష్టమట..!

పెళ్లైన కొన్నేళ్ల తర్వాత.. సెక్స్ జీవితం ఎలా ఉంటుందంటే..!