ADVERTISEMENT
home / లైఫ్ స్టైల్
సెక్స్ గురించి ఈ అపోహలు, అభిప్రాయాలు.. ఇక పట్టించుకోవడం మానేయాల్సిందే..!

సెక్స్ గురించి ఈ అపోహలు, అభిప్రాయాలు.. ఇక పట్టించుకోవడం మానేయాల్సిందే..!

21వ శతాబ్దంలోనూ సెక్స్ (sex) అనే పదం ఇంకా బహిరంగంగా మాట్లాడలేని పదంగానే ఉంది. ఎంతగా అంటే మోడ్రన్ అని భావించేవాళ్లు కూడా కొన్ని అపోహలు (Myths), అభిప్రాయాలను నమ్మేంత.. సెక్సువల్లీ లిబరేటెడ్ అని చెప్పుకునేవాళ్లు కూడా కొన్ని మూస ధోరణులను పాటించేంత. ముఖ్యంగా మహిళల విషయంలో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. తమ కోరికల గురించి కూడా మాట్లాడలేని పరిస్థితి వారిది. అలా కాదని కాస్త స్వేచ్ఛ తీసుకుంటే.. వారిని వివిధ రకాల తప్పుడు పేర్లతో పిలుస్తారు. ఈ క్రమంలో మనం కూడా.. చిన్నప్పటి నుంచి వింటూ పెరుగుతున్న కొన్ని అభిప్రాయాలు, మూస ధోరణుల గురించి.. అందులోని అపోహల గురించి అసలు నిజం గురించి తెలుసుకుందాం..

1. సెక్స్ గురించి మాట్లాడితే తను చెడ్డది..

Giphy

చాలా సంవత్సరాల నుంచి ఈ మాట మనం వింటున్నాం. మగవాళ్లు సెక్స్ గురించి మాట్లాడచ్చు. కానీ మనం మాట్లాడితే.. మనం ఎందరితోనో సెక్స్‌లో పాల్గొనే చెడ్డ మహిళగా వారి కంటికి కనిపిస్తాం. కానీ మహిళలు సెక్స్ గురించి తప్పక మాట్లాడాలి. మగవాళ్లలా అలా మాట్లాడడం వల్లే మన గురించి సమాజానికి అర్థం అవుతుంది. మన మనసులోని భావాలు అవతలివారికి అర్థమవుతాయి.

ADVERTISEMENT

2. మహిళలు మాస్టర్బేట్ చేయరు…

Giphy

ఓ సినిమాలో మహిళ తన సెక్స్ అనుభవాలతో ఆనందం పొందలేక వైబ్రేటర్ ఉపయోగిస్తే దానికి ఎందరో ఎన్నో కామెంట్లు చేశారు. మహిళలు ఉన్నదే మగవాళ్లను ఆనందపర్చడానికి.. అన్న సమాజ ధోరణి దీనికి కారణం. సమాజం ఆడవారికి అస్సలు కోరికలు ఉండకూడదు అనుకుంటారు. కానీ యూకేకి చెందిన ఓ లగ్జరీ లోదుస్తుల సంస్థ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం.. 18 నుంచి 22 సంవత్సరాల మధ్యనున్న మహిళల్లో 92 శాతం మాస్టర్బేషన్ చేస్తారట. అంటే కేవలం దాన్ని బయటకు చెప్పరు అంతే.

3. మహిళలు పోర్న్ సినిమాలు చూడరు..

ADVERTISEMENT

Giphy

చాలామంది అబ్బాయిలు పోర్న్ సినిమాలు చూస్తే తప్పు లేదు. కానీ అమ్మాయిలు మాత్రం వాటిని చూడకూడదు అని భావిస్తుంటారు. ఎందుకంటే ఆడవారి విషయంలో సెక్స్ అనేది కేవలం మానసికమైనది. పోర్న్‌కి దానికి ఏమాత్రం సంబంధం ఉండదు.. అని అంతా అనుకుంటారు. కానీ ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు సెక్స్ వీడియోలు చూసినవారని సర్వేలు చెబుతున్నాయి. అందులో తప్పు కూడా ఏమీ లేదు. కాబట్టి మీరు కూడా అప్పుడప్పుడూ అలా చేయడం తప్పు కాదు.

4. కన్య కాకపోతే ఎవరూ పెళ్లి చేసుకోరు..

Giphy

ADVERTISEMENT

శోభనం రాత్రి నిర్వహించే కన్యత్వ పరీక్షలో ప్రతి అమ్మాయి పాసవ్వాల్సిందే. ఎందుకంటే ఒక అమ్మాయి కన్యత్వం అనేది ఆమె భర్తకు మాత్రమే దక్కాల్సిన వరం. అబ్బాయిలైతే పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొన్నా ఫర్వాలేదు. కానీ అమ్మాయిలకు అలా కాదు. అందుకే పెళ్లికి ముందు ప్రేమించకూడదు. ఒకవేళ అలా ప్రేమించినా.. ఆ విషయం కాబోయే భర్తతో పంచుకోకూడదు.. అని చెబుతుంటారు చాలామంది. కానీ మీ విలువ అనేది మీరు కన్య అవునా? కాదా? అన్న విషయం పై ఆధారపడి ఉండదు. మీ వర్జినిటీ గురించి ఆలోచించే వ్యక్తి కంటే బెటర్ వ్యక్తి మీకు దొరుకుతారు. కాబట్టి అలాంటి ప్రశ్నలు వేసే వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది.

5. మహిళలకు ఫీలింగ్స్ అవసరం లేదు..

Giphy

చాలామంది మహిళలకు సెక్స్ ఆనందాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఆలోచిస్తుంటారు. మహిళలకు ఆనందాన్ని తీసుకురావాలంటే ఎంతో కష్టమైన పని. అందుకే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటుంటారు. కానీ సెక్స్‌లో ఆనందం అనేది పురుషులకు ఎంత ముఖ్యమో.. ఆడవారికి కూడా అంతే ముఖ్యం. ఒకవేళ మీకు ఆనందం లేకపోయినా.. ఉన్నట్లు నటిస్తుంటే.. మీరు వెంటనే మీ భాగస్వామితో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోవాలి.

ADVERTISEMENT

6. బర్త్ కంట్రోల్ మహిళల అవసరం..

Giphy

బర్త్ కంట్రోల్ అన్నది కేవలం అమ్మాయిల అవసరం. ప్రొటెక్షన్ ఉపయోగించమని చెబితే చాలు.. కండోమ్ ఉపయోగించడం వల్ల ఆ ఫీలింగ్ రాదు అంటూ తప్పించుకుంటారు. గర్భం దాల్చడం అనేది మహిళల సమస్య కాబట్టి.. అలా కాకుండా మాత్రలు వాడాల్సిన అవసరం కూడా వారిదేనని భర్తల ఫీలింగ్. సెక్స్‌లో ఆనందం పొందడంతో పాటు లైంగిక ఆనందం, పిల్లలను కనడం అనేది ఇద్దరి బాధ్యత. కాబట్టి దీని గురించి మీ భాగస్వామితో మాట్లాడడం మంచిది.

7. చెడ్డవాళ్లే సెక్స్ ఎంజాయ్ చేస్తారు..

ADVERTISEMENT

Giphy

మహిళలు మరోసారి సెక్స్ కావాలని కోరుకోవడం తప్పని సమాజం భావన. సెక్స్ కావాలని కోరుకునే అమ్మాయిలను చూసి అబ్బాయిలు ఇష్టపడరు. దీనికి కారణం కూడా లేకపోలేదు. అబ్బాయిలకు అమ్మాయిల కంటే సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి అని అంతా అనుకుంటారు. అందుకే అమ్మాయిలు దాన్ని ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదని వారి భావన. కానీ ఒక మహిళ సెక్స్‌ని ఎంజాయ్ చేస్తోందంటే.. తను ఎంతో కాన్ఫిడెంట్ అని అర్థం. తను ఇతరుల కోసం కాకుండా.. తన కోసం సెక్స్‌లో పాల్గొంటుందని అర్థం. మంచి సెక్స్ వారిని ఆనందంగా ఉంచుతుంది. కాబట్టి వారి దగ్గర కూడా.. సెక్స్‌ని కోరుకోవడానికి ఎంజాయ్ చేయడానికి తగిన కారణాలున్నట్లే..

8. మహిళలు సెక్స్ కావాలని అడగకూడదు..

Giphy

ADVERTISEMENT

బెడ్రూంలో ఎప్పుడూ భర్త సెక్స్ కావాలని అడిగిన తర్వాతే.. అమ్మాయి సరే అనాలి కానీ తను మొదట అలా అడగకూడదు. అదే సరైన పని. మీకు సెక్స్ కావాలన్న సిగ్నల్ తనకు పంపడం సరికాదు అని చాలామంది భావిస్తుంటారు. కానీ అది తప్పు. మీరు సెక్స్ కావాలని అవతలి వ్యక్తికి సిగ్నల్ ఇవ్వడం వల్ల.. వారి పట్ల మీరు ఆకర్షితులయ్యారని వారికి తెలిపినట్లు అవుతుంది. ఇలా సెక్స్‌లో మీరు ముందడుగు వేయడం వల్ల.. ఇద్దరి సెక్స్ లైఫ్ చాలా ఆనందంగా ఉంటుందట.

9. భాగస్వామికి అనుమతితో అవసరం లేదు..

Giphy

పెళ్లి చేసుకున్న తర్వాత మీ భార్య మీకు సొంతం. అందుకే ప్రతి సారి సెక్స్‌కి ముందు తనని పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు అని చాలామంది అనుకుంటారు. పెళ్లయితే శరీరం, మనసుపై అధికారం వచ్చేస్తుందని వారి భావన. కానీ ఎవరి శరీరం వారికి తప్ప మరో వ్యక్తికి సొంతం కాదు. మీరు నో చెబితే దాన్ని వినాల్సిన అవసరం అవతలి వ్యక్తికి ఎంతైనా ఉంటుంది.

ADVERTISEMENT

10. పొట్టి దుస్తులు వేసుకుంటే కావాలని అడిగినట్లే..

Giphy

పొట్టి దుస్తులు వేసుకుంటే మీరు ఎవరితోనైనా సెక్స్‌లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థం. అవతలి వ్యక్తులు మిమ్మల్ని చూడాలని.. ముట్టుకోవాలని మీరు అలాంటి దుస్తులు వేసుకుంటారు. ఇలాంటి దుస్తులు వేసుకున్న మహిళలు సీరియస్ రిలేషన్స్ షిప్స్ పెట్టుకోరు అని అందరి భావన. కానీ ఎలాంటి దుస్తులు వేసుకున్నా అది అవతలి వ్యక్తికి మిమ్మల్ని చూసేందుకు ముట్టుకోవడానికి, సెక్సువల్‌గా ఆసక్తి చూపించడానికి అది పర్మిషన్ కాదు. మీ దుస్తులు అవతలి వ్యక్తికి సంబంధం లేని విషయం.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

ADVERTISEMENT

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.

04 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT