ఈ రోజు (సెప్టెంబరు 10, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ జీవితానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆలుమగలు సంసార బంధంలోని మాధుర్యాన్ని చూస్తారు. ప్రేమికులు ఒక పాజిటివ్ ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఉద్యోగులు క్లిష్టమైన సమయంలో.. ఫలితాలను సాధించి అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు కాంట్రాక్టుల విషయంలో వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి.
వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా మీ నిర్లక్ష్యం వల్ల ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉంది. ఆలుమగలు కష్ట సమయాలలో ఒకరికి ఒకరు తోడుగా నిలిచి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. అలాగే ప్రేమికులు కూడా.. ప్రాక్టికల్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఈ రాశి వ్యక్తులకు ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా మక్కువ పెరుగుతుంది.
మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు లాభసాటిగా గడుస్తుంది. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. ఉద్యోగస్తులు ఆఫీసులో అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ.. మీరు లౌక్యంతో, సమయస్ఫూర్తితో విజయం సాధిస్తారు.
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆఫీసులో పనిఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయినా ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. నిరుద్యోగులు ఫేక్ జాబ్ ఆఫర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారస్తులు కూడా ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు ఈ రోజు లాభసాటిగా ఉంటుంది.
సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు చాలా బిజీగా ఉంటారు. క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. ఆలుమగలు కొన్ని విషయాలలో అభిప్రాయ భేదాలు వచ్చినా.. ఆఖరి నిముషంలో రాజీపడతారు. ప్రేమికులు తమ బంధం విషయంలో నిజాయతీగా వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులు తమకు ఇష్టమైన రంగంలో ప్రయత్నాలు ప్రారంభించడం మంచిది.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కన్య (Virgo) – ఈ రోజు మీ కుటుంబ సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సందర్భంగా జరిగే సమావేశాలలో మీరు కూడా కీలక భూమిక పోషిస్తారు. ఆలుమగలు కొన్ని విషయాలలో దాపరికం లేకుండా వ్యవహరించడం మంచిది. ప్రేమికులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అందులో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా జాగ్రత్త పడాలి. అక్కరకు రాని స్నేహాలకు స్వస్తి పలకాలి.
తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని అదృష్టం కలిసొస్తుంది. వ్యాపారస్తులు కాంట్రాక్టులకు సంబంధించి కొత్త ప్రణాళికలు రచిస్తారు. ఉద్యోగస్తులు కొంత మానసిక ఒత్తిడికి గురైనా.. తర్వాత అనుకున్న పనులను ఎటువంటి అవాంతరాలు లేకుండా పూర్తిచచేస్తారు. అలాగే కొత్త పరిచయాలు మీ జీవితాన్ని మార్చేసే అవకాశం కూడా ఉంది.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. డెబిట్, క్రెడిట్ కార్డులను వాడే ముందు అప్రమత్తంగా వ్యవహరించాలి. అపరిచితులను నమ్మవద్దు. ఉద్యోగులు లేదా వ్యాపారస్తులు అప్పులు ఇచ్చే విషయంలో లేదా తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. ఉద్యోగస్తులు ఆఫీసు వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కోర్టు కేసులు మొదలైనవి ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు ఏదైనా ఉద్యోగంలో చేరిన సమయంలో.. బాండ్ పై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఏదైనా నిర్ణయం తీసుకొనేటప్పుడు పూర్తి ఆలోచించి.. వివేకంతో వ్యవహరించాలి. మీ సన్నిహితులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలున్నాయి. అలాగని అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకొనేటప్పుడు లౌక్యంతో వ్యవహరించాలి. సమయస్ఫూర్తితో సమస్యలను చక్కదిద్దాలి.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభం (Aquarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా సంభాషించే సందర్భంలో.. ఆచితూచి మాట్లాడాలి. ఆలుమగలు డబ్బుకు సంబంధించిన విషయాలలో.. దాపరికం లేకుండా వ్యవహరించడం మంచిది. ప్రేమికులు తమ బంధం గురించి పెద్దలతో చెప్పడానికి ఇదే సరైన సమయం.
మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు సంబంధించి వాణిజ్య విస్తరణకు కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులు ప్రత్యమ్నాయ రంగాల వైపు కూడా మొగ్గుచూపడం మంచిది. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.