ఈ రోజు (సెప్టెంబరు 11, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు తల్లిదండ్రులు తమ పిల్లలకు సంబంధించి.. కొన్ని కీలక విషయాలు తెలుసుకుంటారు. అలాగే నిరుద్యోగులు తమ నిర్లక్ష్యాన్ని వీడాలి. లేదా మంచి అవకాశాలను కోల్పోతారు. అలాగే కుటుంబంలో కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి చర్చలు, సమావేశాలు జరుగుతాయి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగంలోని వ్యక్తులకు మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.
వృషభం (Tarus) – ఈ రోజు వ్యాపారస్తులు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహితులకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. మహిళలకు రాజకీయాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. ఆలుమగలు ప్రేమ యాత్రలు చేస్తారు. విద్యార్థులకు స్కాలర్ షిప్ రూపంలో లేదా మరో విధంగా ధన సహాయం అందుతుంది.
మిథునం (Gemini) – ఈ రోజు ఉద్యోగస్తులకు ఆఫీసులో కాస్త ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త వహించండి. ప్రేమికులు తమ వ్యక్తిత్వంతో ఒకరిని మరొకరు ఆకట్టుకుంటారు. కుటుంబంలో మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేసే సంఘటనలు జరగుతాయి.
కర్కాటకం (Cancer) – ఈ రోజు మీరు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు ఆఫీసు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వివాహితులకు కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండండి. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రేమికులు కూడా తమ బంధంలో నిజాయతీ ముఖ్యమని నమ్మండి.
సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు ఒప్పందాలు చేసుకుంటారు. లేదా కొన్ని ముఖ్యమైన చర్చలు, సమావేశాలకు హాజరవుతారు. ఉద్యోగస్తులకు తమ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వివాహితులు తమ సంసారిక సమస్యలకు సంబంధించి నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రేమికులు కూడా తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే అనువైన రోజు
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కన్య (Virgo) – ఈ రోజు విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి రోజు. అనుకోని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే యువతీ, యువకులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు తమ ప్రాజెక్టుల విషయంలో పురోగమనం కనిపిస్తుంది. అలాగే ఈ రోజు పలు సత్కారాలు పొందడం లేదా బహుమానాలను స్వీకరించే అవకాశం ఉంది.
తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ప్రాక్టికల్‌గా ఆలోచించక పోవడం వల్ల.. కొన్ని నష్టాలను చూస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం లేదా కష్టపడకుండా సులువుగా ఫలితాలు పొందడం ఎలా..? లాంటి విషయాలను ఆలోచించకండి. మీ శ్రమను నమ్ముకోండి. నిరుద్యోగులు ఫేక్ జాబ్ ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. పెండింగ్ పనులు కూడా వేగంగానే పూర్తవుతాయి. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి పలు శుభవార్తలు వింటారు. ఈ రాశి వ్యక్తులు ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ప్రేమికులు కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వివేకంతో ఆలోచించాలి. అలాగే వ్యాపారస్తులు ప్రత్యర్థులతో కొన్ని సమస్యలను స్నేహ పూర్వకంగా సెటిల్ చేసుకోవడం శ్రేయస్కరం. అలాగే ఉద్యోగస్తులు ఆఫీసుల వివాదాలలో తలదూర్చకుండా ఉంటే మంచిది. అదేవిధంగా వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి.
మకరం (Capricorn) – ఈ రోజు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారస్తులు బ్రోకర్లను, ఏజెంట్లను నమ్మే విషయంలో అప్రమత్తంగా ఉండండి. వివాహితులకు తమ భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చినా.. మళ్లీ అవి సమసిపోతాయి.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభం (Aquarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధన యోగం ఉంది. అలాగే సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు వాణిజ్య విస్తరణకు అవకాశం ఉంది. వివాహితులు తమ భాగస్వామితో కలిసి ఈ రోజు రొమాంటిక్‌గా గడుపుతారు. అలాగే వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. అలాగే ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించండి.
మీనం (Pisces) – ఈ రోజు ప్రేమికులు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అవివాహితులకు వివాహానికి సంబంధించిన అవరోధాలు తొలగిపోతాయి. ఆఫీసులో ఉద్యోగస్తులు అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు కొన్ని కీలక అగ్రిమెంట్లు చేసుకొనే సమయంలో.. ఆచితూచి వ్యవహరించాలి. అలాగే రాజకీయ రంగ వ్యక్తులకు అనుకోకుండా కొత్త అవకాశాలు లభిస్తాయి.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.