ఈ రోజు (సెప్టెంబరు 12, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ప్రతికూల ఆలోచనలను వీడి.. ప్రతి విషయంలోనూ సానుకూలంగా వ్యవహరించాలి. కోర్టు విషయాలు, చట్ట సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే పాత స్నేహితులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. అలాగే అనుకోని బహుమతులు, కానుకలు పొందుతారు. అయితే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి.
వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు భాగస్వామితో గొడవ పడే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక కాస్త సహనంగా ఉండండి. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలనే విషయాన్ని నమ్మండి. ముఖ్యంగా లౌక్యంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించడం మేలు.
మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఒకరి నుండి సిఫార్సులు పొందడం లేదా ఒకరికి సిఫార్సులు చేయడం చేస్తారు. అలాగే అనుకోని సందర్భాలలో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. చట్టపరమైన విషయాలలో అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నించండి. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు వ్యాపారంలో అనుకోని లాభాలు పొందే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులకు తమ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పదోన్నతులు కూడా దక్కే అవకాశముంది. నిరుద్యోగులు కూడా శుభవార్తలు వింటారు. విద్యార్థులకు కళలు, సంగీతం, క్రీడలు మొదలైనవాటిపై ఆసక్తి పెరుగుతుంది.
సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ప్రతికూల ఆలోచనలను వీడాలి. ఎన్ని అవంతరాలు ఎదురైనా.. పాజిటివ్ థింకింగ్‌తో, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి. ఉద్యోగులు ఆఫీసులో ఉద్రిక్త వాతావరణం చూస్తారు. ఇలాంటి సమయంలోనే సహనంతో ఉండాలి. ప్రేమికులు కూడా తమ బంధం గురించి పెద్దలతో చెప్పడానికి ఇదే సరైన రోజు.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కన్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పెండింగ్ పనులను ముందు పూర్తి చేయడం మంచిది. ఆడిట్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వాహనాలను నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగంలోని వ్యక్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.
తుల (Libra) – ఈ రోజు అవివాహితులు శుభవార్తలు వింటారు. అలాగే విద్యార్థులకు, నిరుద్యోగులకు తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆఫీసులో కూడా ఉద్యోగులు అధికారుల ప్రశంసలను అందుకుంటారు. ప్రత్యర్థులను కూడా కట్టడి చేస్తారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది
వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు విద్య పరంగా అత్యున్నత ఫలితాలను సాధించే అవకాశముంది. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు కూడా పెండింగ్ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి కితాబునందుకుంటారు. అలాగే పాత స్నేహితులు, దూరపు బంధువులు మిమ్మల్ని ఈ రోజు కలుసుకొనే అవకాశం ఉంది.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మహిళలు బంగారం లేదా వెండి ఆభరణాలు ధరించి బయట తిరగ్గపోవడం మంచిది. అలాగే వాణిజ్యవేత్తలు.. వ్యాపారం మందగించడం వల్ల ఆర్థిక సంక్షోభం బారిన పడే అవకాశం ఉంది. అలాగే దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.
మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశివ్యక్తులను కొందరు తప్పుదోవ పట్టించే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయాల్లోనే వివేకంతో నిర్ణణం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆఫీసులో పరిస్థితులు ఉద్యోగులకు అనుకూలంగా ఉంటాయి. ఇంటర్వ్యూలలో యువతకు విజయం సిద్ధిస్తుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభం (Aquarius) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు సంసార బంధంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే వాటిని ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా.. శాంతియుతంగా పరిష్కరించుకోవడం మంచిది. అలాగే ఉద్యోగులకు ఆఫీసులో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు కూడా ఈ రోజు బాగా కలిసొస్తుంది.
మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ తల్లిదండ్రల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించడం మంచిది. వివాహితులకు తమ భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాల వ్యక్తులకు ఈ రోజు శుభదినం. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై కూడా మీకు ఆసక్తి పెరుగుతుంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.