14 సెప్టెంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

14 సెప్టెంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (సెప్టెంబరు 14, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) –  ఈ రోజు మీ ప్రవర్తన మీ కుటుంబ సభ్యులను బాధపెట్టే అవకాశం ఉంది. కనుక కోపాన్ని నియంత్రించుకోండి. ఆఫీసులో వివాదాలు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి అవకాశాలను పొందేందుకు సరైన సమయం కోసం వేచి చూడండి. స్నేహితులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే క్రమంలో.. మీరు ఇరకాటంలో పడచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

వృషభం (Tarus) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు  పాత సంబంధాలను మెరుగుపరుచుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల విషయంలో పిల్లల బాధ్యతలు నెరవేరుతాయి. సాంప్రదాయ, ఆధ్యాత్మిక విషయాలపై విశ్వాసం పెరుగుతుంది. అధికారులతో సంబంధాల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి.

మిథునం (Gemini) – ఈ రోజు కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్య.. మిమ్మల్ని ఆందోళనకు గురి చేయవచ్చు. ఆఫీసులో మీకు అధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారస్తులు ఇతర ఆదాయ వనరులు పొందుతారు. విద్యార్థులు అవసరమైన పనులలో తప్ప.. మిగతా సమయం వృథా చేయకూడదు. మీకు పాత స్నేహితులను కలవడం ఆనందాన్ని కలిగిస్తుంది. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధన యోగం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులలో పురోగతి ఉంటుంది. సామాజిక గౌరవం మరియు సంపద పెరుగుతాయి. స్నేహితులతో కలిసి దూర ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రేమికుల సమస్యలు తీరుతాయి.

సింహం (Leo) – ఈ రోజు నిరుద్యోగులు నూతన అవకాశాల కోసం ప్రయత్నిస్తారు. అలాగే భాగస్వామితో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  ముఖ్యమైన పనులు పూర్తయ్యే సమయంలో కొన్ని అంతరాయాలు ఏర్పడవచ్చు. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి.  ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. ప్రేమికులు నిజాయతీగా వ్యవహరించడం మంచిది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అలాగే స్థిరమైన ఆస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపార విధుల్లో నిబద్దత పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి

తుల (Libra) – ఈ రోజు మీరు సోమరితనం వల్ల మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. రాజకీయ రంగంలోని వ్యక్తులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. వ్యాపారస్తులు ఆదాయ, వ్యయాల మధ్య సమతుల్యతను పాటించండి. ఆఫీసు పనుల్లో పొరపాట్లు దొర్లవచ్చు. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. మీ పై అధికారులు సిఫార్సులను తిరస్కరించవచ్చు.

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీకు  ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. అలాగే కుటుంబ బాధ్యతలను నెరవేర్చే  క్రమంలో రుణాలు తీసుకుంటారు. ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. అవివాహితులు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు ఇంకొంచెం కష్టపడాలి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) –  ఈ రోజు సినిమా రంగంలో ప్రయత్నం చేసే వ్యక్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అలాగే ఈ రోజు నుండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. దీని వల్ల మీకు భవిష్యత్తులో ఓ లాభం చేకూరనుంది. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. ఆఫీసులో ఉద్యోగస్తులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. 

మకరం (Capricorn) –   ఈ రోజు వ్యాపారస్తులకు అన్ని విధాలుగా శుభదినం. మీ ప్రణాళికలు పూర్తవుతాయి. రాజకీయ రంగంలో క్రియాశీలత పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు లభిస్తాయి. క్రీడాకారులు పోటీలో గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలు వేగంగా పరిష్కరించబడతాయి. వివాహితులు ఓ శుభవార్తను వింటారు.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు రాశి వ్యక్తులు అనుకోకుండా చేసే దుబారా ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. వ్యాాపారస్తులు కొత్త పథకాలలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ముందు.. సన్నిహితులు, కుటుంబీకులు లేదా నిపుణులను సంప్రదించండి.  కొన్ని విషయాలలో భాగస్వామి మీకు పూర్తి మద్దతును అందిస్తారు. ప్రేమికులు ఒకరి పట్ల ఒకరు నిజాయతీగా వ్యవహరిస్తేనే.. తమ బంధాన్ని ఆనందంగా కొనసాగించగలరు.

మీనం (Pisces) – ఈ రోజు సినిమా, రచనా రంగం, క్రియేటీవ్ ఫీల్డులో పనిచేసే వ్యక్తులకు.. అనుకోని అవకాశాలు లభిస్తాయి. బీపీఓ, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులు ప్రత్యమ్నాయ రంగాలలో అవకాశాల కోసం ప్రయత్నిస్తారు. వివాహితులు అనుకోని శుభవార్తలు వింటారు. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని ఈరోజు కలిసే అవకాశం ఉంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.