17 సెప్టెంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

17 సెప్టెంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (17 సెప్టెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) –  ఈ రోజు మీరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సహంగా గడుపుతారు. ఆఫీసులో ఉద్యోగులకు తమ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వ్యక్తులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ప్రేమికులు కొన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి. మిమ్మల్ని మోసం చేసే యోచనతో కొందరు మీ దగ్గరకు రావచ్చు. ఆలుమగలు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకొనేటప్పుడు.. జాగ్రత్తగా ఉండాలి. 

మిథునం (Gemini) – ఈ రోజు మీరు మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో.. కాస్త శ్రద్ధ చూపించండి. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. మీ స్నేహితురాలి నుండి ప్రేమ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. మహిళలు షాపింగ్ చేయడానికి  ఈ రోజు అనువైనది. ప్రత్యేక డిస్కౌంట్లు, రిబేట్లు లభిస్తాయి. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు కుటుంబ సభ్యులతో మీకు విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటప్పుడే సామరస్యంగా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. కోపాన్ని నియంత్రించుకోండి. ఆఫీసులో కూడా పని ఒత్తిడి పెరుగుతుంది. అయితే.. కొన్ని సందర్భాలలో ప్రత్యర్థులే మీకు సహాయం చేస్తారు. అలాగే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించండి.

సింహం (Leo) –  ఈ రోజు మీరు మీ ఆరోగ్యానికి సంబంధించి.. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. జిమ్ లేదా యోగా సెంటర్స్‌లో చేరడానికి ఇదే సరైన సమయం. అలాగే ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. మీ స్నేహితుల సహాయంతో.. మీరు ఓ పథకాన్ని రచిస్తారు. అలాగే ఆఫీసులో ఉద్యోగులు నూతన సవాళ్లను ఎదుర్కొంటారు. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు స్థిరాస్తులను కొనే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు కూడా పదోన్నతులు లభిస్తాయి. విద్యార్థులు ఎంతో కష్టపడి... ప్రత్యమ్నాయ రంగాలలో అవకాశాలను సాధిస్తారు.  నిరుద్యోగుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబ బాధ్యతలు అన్ని నెరవేరుతాయి. అలాగే సామాజిక జీవితం కూడా బిజీగా గడుస్తుంది. వ్యాపారస్తులు కొన్ని కీలక సమావేశాలు లేదా సెమినార్లలో పాలు పంచుకుంటారు. పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి. అయితే కోర్టు వివాదాలు, ఆస్తి లావాదేవీలు మొదలైన విషయాలలో... చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.  

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆఫీసులో ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. రాజకీయ రంగంలోని వ్యక్తులకు కొన్ని కీలక బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు కూడా అనుకోని అవకాశాలు లభిస్తాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) –   ఈ రోజు ఈ రాశి వ్యక్తులు స్నేహితుల నుండి బహుమతులు లేదా కానుకలను పొందుతారు. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. ఉద్యోగస్తులకు కూడా అదనపు ఆదాయ వనరులు పెరుగుతాయి. పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయం సాధిస్తారు. నిరుద్యోగుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. కొన్ని వివాదాలను సామరస్యంతో పరిష్కరించుకోవడం మంచిది. అలాగే కోపాన్ని నియంత్రించుకోండి.

మకరం (Capricorn) – ఈ రోజు ఉద్యోగస్తులు నిర్లక్ష్యాన్ని వీడి పనిచేయాలి. లేకపోతే పెద్ద చిక్కులలో పడతారు. రాజకీయ రంగంలో పని చేసే వ్యక్తులకు.. ప్రత్యర్థుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఆఫీసులో ఉద్రిక్త పరిస్థితులను చూస్తారు. వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసేటప్పుడు పారాహుషార్.  

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు. అలాగే ముఖ్యమైన పనులు కూడా వాయిదా పడతాయి. కొన్ని విషయాలలో మీకు భాగస్వామి నుండి నైతిక మద్దతు ఉంటుంది. వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులకు సమయం తమకు అనుకూలంగా ఉంటుంది. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు.. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి.  వ్యాపారవేత్తలు కొత్త భాగస్వాములతో చర్చలు, సమావేశాలలో పాల్గొంటారు. మీ శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారి.. సహాయం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు ఫేక్ జాబ్ ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.