18 సెప్టెంబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

18 సెప్టెంబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (18 సెప్టెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ప్రేమికుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులు ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకు వృత్తి భాగస్వామ్యం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే సామాజిక గౌరవం మరియు సంపద పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకు ఈ రోజు బాగా కలిసొస్తుంది.

వృషభం (Tarus) – నిరుద్యోగులు ఈ రోజు ఇంటర్వూలలో విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాల్లోని వ్యక్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు తమ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు.

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు అనుకోని నష్టాలు చవిచూస్తారు. వివాహితులకు ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు విమర్శలను పట్టించుకోకుండా.. తమ పనిని తాము సక్రమంగా చేసుకుంటూ వెళ్లడం మంచిది. ఆలుమగల సంబంధాలు బలంగా మారతాయి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు మానసిక ఒత్తిడికి దూరమై.. ప్రశాంతతతో గడుపుతారు. అలాగే కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. విద్యార్థులకు ప్రత్యమ్నాయ రంగాల వైపు ఆసక్తి పెరుగుతుంది. అలాగే వివాహితులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. 

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ప్రేమ ప్రతిపాదనలో విఫలమయ్యే అవకాశం ఉంది. అయినా నిరుత్సాహపడవద్దు. అలాగే ఆర్థికపరమైన లావాదేవీలకు దూరంగా ఉండండి. అలాగే మీ కుటుంబానికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించడానికి ప్రయత్నించండి.  దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. నిరుద్యోగులు ఇంకాస్త కష్టపడాలి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు మీరు తల్లిదండ్రులు లేదా భాగస్వామి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. కోర్టు తగాదాలు, ఆస్తికి సంబంధించిన లావాదేవీలలో మీరే విజయం పొందుతారు. ఉద్యోగుల పని తీరుతో అధికారులు సంతోషంగా ఉంటారు. అలాగే పదోన్నతులు పొందే అవకాశం ఉంది. 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు వ్యాపార ప్రయోజనాలతో పాటు.. ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంది. అలాగే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సామాజిక గౌరవం మరియు సంపద పెరుగుతాయి. కొన్ని సమస్యలను పరిష్కరించే దశలో మీకు.. మీ భాగస్వామి మద్దతు ఉంటుంది. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీకు కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో విద్యార్థులు విజయం సాధిస్తారు. లాభాపేక్ష లేని ఒప్పందాలను వ్యాపారంలో చూడవచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆస్తి సంబంధిత లావాదేవీలు వేగంగానే పరిష్కరించబడతాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రాశి వ్యక్తులు ప్రస్తుతానికి కొత్త పనులను వాయిదా వేయడం మంచిది. ఆఫీసులో విమర్శలకు భయపడి, మీరు మీ క్రియేటివిటీకి పదును పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. మీ మనసులో ఏదో ఒక విషయంలో నిరాశ ఆవరించే అవకాశం ఉంది. వాదోపవాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆసక్తి ఏర్పడుతుంది.

మకరం (Capricorn) –  ఈ రోజు మీకు అనుకోని అదృష్ట అవకాశాలు లభిస్తాయి. అలాగే ఆస్తి వివాదాలు పరిష్కరించబడతాయి. కొత్త పరిచయాలు వాణిజ్య ప్రయోజనాలను లాభసాటిగా మారుస్తాయి. అలాగే మీరు ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబం కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం సమయం కేటాయించడం అవసరం. అలాగే భాగస్వామితో మీ సంబంధాలు బలంగా మారతాయి. సృజనాత్మక పనులలో పురోగతి ఉంటుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) -  ఈ రోజు మీరు కొన్ని విషయాలలో అజాగ్రత్తగా ఉండకపోవడం మంచిది. అలాగే అనుకోకుండా వేరే ప్రాంతాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. పలు శుభవార్తలు కూడా వింటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే సంఘటనలు జరగవచ్చు. అయినా సరే..  పాజిటివ్‌గా ఆలోచిస్తూ ముందుకు వెళ్లండి. మీ లక్ష్యాలను చేరుకోండి. 

మీనం (Pisces) – ఈ రోజు మీరు మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తుల వాణిజ్య విస్తరణకు అవకాశం ఉంది. పాత వివాదాలు పరిష్కార దశకు వస్తాయి. అలాగే కొన్ని వివాదాలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులు కొంచెం కష్టపడితే.. తమ జీవితాన్ని మార్చే అవకాశాలను చేజిక్కించుకోగలరు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.