ఈ రోజు (20 సెప్టెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం
మేషం (Aries) – ఈ రోజు మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే పలు ఆర్థిక విషయాలలో వివేకంతో నిర్ణయాలు తీసుకోండి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. వారి పట్ల జాగ్రత్త వహించండి. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులను కుటుంబ సమస్యలు వేధించే అవకాశం ఉంది. అలాగే మనసులో ఏదో తెలియని భయం వెంటాడే అవకాశం ఉంది. వివాదాస్పదమైన పనులకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు వృత్తి భాగస్వామ్యం వల్ల ప్రయోజనం ఉంటుంది. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాల వ్యక్తులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి.
మిథునం (Gemini) – ఈ రోజు పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు. కుటుంబ వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యక్తిగత సంబంధాలకు సమయం కేటాయించండి. ఉద్యోగులకు ఆఫీసులో అధికారులతో సయోధ్య ఏర్పడుతుంది. నిరుద్యోగులు కొంచెం కష్టపడితే.. ఇంటర్వ్యూలలో విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
కర్కాటకం (Cancer) – ఈ రోజు నిరుద్యోగ యువతకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. ప్రత్యమ్నాయ రంగాలలో ఉపాధిని పొందే అవకాశం ఉంది. ఆఫీసులో ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. చట్టపరమైన వివాదాల నుండి వేగంగానే బయటపడతారు. ప్రేమికులు ఒకరితో మరొకరు నిజాయతీగా వ్యవహరించడం మంచిది.
సింహం (Leo) – ఈ రోజు వ్యాపారస్తులు లేదా ఉద్యోగులు కష్టపడి పనిచేసినప్పటికీ, ఫలితాలు ఆశాజనకంగా ఉండకపోవచ్చు. పలు కీలక ఒప్పందాలు రద్దు అయ్యే అవకాశం ఉంది. మహిళలు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. విద్యార్థులకు క్రీడలు, కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!
కన్య (Virgo) – ఈ రోజు నిరుద్యోగులకు శుభదినం. కొంచెం కష్టపడితే.. తాము కోరుకున్న రంగాలలో ఉద్యోగాలు పొందడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగే ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారుల మద్దతు ఉంటుంది. ప్రేమికులు తమ బంధం గురించి.. పెద్దలతో మాట్లాడడానికి ఇదే సరైన సమయం. కీలక ఒప్పందాలు చేసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని సంఘటనలను ఎదుర్కొంటారు. ఆయా సంఘటనలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. ఇలాంటప్పుడు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. కోపాన్ని నియంత్రించుకోండి. అలాగే ఆస్తి సంబంధిత లావాదేవీలు ఈ రోజు చర్చకు వస్తాయి. మీకు మీ భాగస్వామి మద్దతు ఉంటుంది.
వృశ్చికం (Scorpio) – ఈ రోజు ప్రేమికులకు, ఆలుమగలకు అనువైన దినం. మీరు సెలవు పెట్టి లేదా కాస్త వీలు చూసుకొని మీ భాగస్వామితో హాయిగా గడపండి. మీ మధ్య బంధం పటిష్టంగా మారడానికి ఇదే సరైన సమయం. అలాగే మీకు రాజకీయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో ఉద్యోగస్తులు అధికారుల మద్దతు కూడా పొందుతారు.
ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం
ధనుస్సు (Saggitarius) – ఈ రోజు పలు విషయాలు మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వేధించే అవకాశముంది. ఆఫీసులో ఉద్యోగులు వివాదాస్పద విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. వ్యాపారస్తులకు వృత్తి భాగస్వామ్యం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రేమికులు ఒకరి పట్ల మరొకరు నిజాయతీగా వ్యవహరించడం మంచిది.
మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు పాత బాకీలు వసూలవుతాయి. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. అదేవిధంగా సామాజిక కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం పెరుగుతుంది. మీ భాగస్వామితో సంబంధాలు కూడా పటిష్టంగా మారతాయి. అవివాహితులు శుభవార్తలు వింటారు.
ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి
కుంభం (Aquarius) – ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల కెరీర్‌కి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆఫీసులో ఉద్యోగస్తులు కొత్త టెక్నాలజీకి సంబంధించిన విషయాలు నేర్చుకుంటారు. పలు శిక్షణా కార్యక్రమాలకు హాజరవుతారు. అలాగే ఆర్థిక సమస్యలు కూడా వేగంగా పరిష్కారమవుతాయి. ప్రేమికులు తమ జీవితానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తుల కోసం కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. డబ్బుకు సంబంధించి ఓ మంచి శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులు కొత్త వృత్తిని స్వీకరిస్తారు. వ్యాపారస్తులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులలో పురోగతి ఉంటుంది
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.
అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.