23 సెప్టెంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

23 సెప్టెంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (23 సెప్టెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు గతంలో వేధించిన సమస్యల నుండి బయటపడతారు. అలాగే కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగులకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. నిరుద్యోగులను అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. అవివాహితులు పలు శుభవార్తలను వింటారు.

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఉద్యోగుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి. కోర్టు వివాదాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఈ రాశి వ్యక్తులకు కొత్త స్నేహితులు పరిచయమయ్యే అవకాశం ఉంది. అలాగే మీ భాగస్వామితో బంధాలు బలంగా మారతాయి. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబంలో సరదా వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులు నూతన వాణిజ్య ఒప్పందాలు పొందే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే కొన్ని బహుమతులను కూడా గెలుచుకుంటారు. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు విద్యార్థుల నిర్లక్ష్యం.. వారి అధ్యయనాలకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు అనవసర విషయాలలో తలదూర్చకపోవడం మంచిది. అలాగే వివాహితులు దూర ప్రయాణాలు చేస్తారు. సోదరులు లేదా బంధు మిత్రులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలలో పురోగతి ఉంటుంది. 

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. రాజకీయ నాయకులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. అలాగే పాత స్నేహితులను కలవడం ఆనందంగా ఉంటుంది. వ్యాపారస్తులు దూర ప్రయాణాలు చేస్తారు. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు అవివాహితులకు సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగులకు తమ సహోద్యోగుల సహాయం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు మీ జీవితాన్ని మారుస్తాయి. విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తారు. వ్యాపారస్తుల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గానే ఉంటాయి. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడతాయి. 

తుల (Libra) – ఈ రోజు ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగులు ప్రత్యమ్నాయ కెరీర్స్ వైపు అడుగులు వేస్తారు. అలాగే రాజకీయాలలో ఆసక్తి పెరుగుతుంది. పలు సందర్భాలలో కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. పెండింగ్ పనులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ప్రేమికులు తమ బంధంలో నిజాయతీ ముఖ్యమనే విషయాన్ని నమ్మాలి.

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే కొన్ని విషయాలలో.. వివేకంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశం కూడా ఉంది. ఉద్యోగస్తులు ఆఫీసులో జరిగే.. కొన్ని వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే కొన్ని అత్యవసర పరిస్థితులలో.. మీకు మీ భాగస్వామి మద్దతు లభిస్తుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా పనిచేస్తారు. అయినా సరే.. చిన్న చిన్న ఇబ్బందులు మిమ్మల్ని చిరాకు పరచవచ్చు. అలాగే విద్యార్థులు క్రీడలు, కళల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగస్తులు పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి.  ఆడిట్ జరిగే అవకాశం ఉంది. అలాగే వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. 

మకరం (Capricorn) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు.. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.  అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే కొత్త ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. అలాగే వివాహితులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ భాగస్వామి నుండి ఎన్నడూ లేనంత ఆప్యాయతను, ప్రేమను పొందుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై.. ఆసక్తి పెరుగుతుంది. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అలాగే వ్యాపార కార్యకలాపాలు  కూడా వేగవంతం అవుతాయి. ఆఫీసులో మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన.. అధికారుల నుండి ప్రశంసలను పొందేలా చేస్తుంది. అలాగే మీకు పదోన్నతులు లభించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తులకు విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.