ADVERTISEMENT
home / Astrology
25 సెప్టెంబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

25 సెప్టెంబరు 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (25 సెప్టెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఇలాంటి సమయాలలోనే వివేకంతో వ్యవహరించండి. సమయస్ఫూర్తితో సమస్యలను ఒక కొలిక్కి తీసుకురండి. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజు ఆర్థికంగా బలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు పెండింగ్ పనులను పూర్తి చేసుకోవడం బెటర్. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు మీ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త పథకాలను అమలు చేయగలుగుతారు. ఉద్యోగస్తులు మరింత కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులు తమ చదువులపై పూర్తి దృష్టి పెట్టాలి. రాజకీయాల్లో క్రియాశీలత పెరుగుతుంది. 

మిథునం (Gemini) – ఈ రోజు కొన్ని విషయాలలో మీరు భావోద్వేగానికి గురవుతారు. అలాగే ఉద్యోగస్తులు ఆడిట్‌ను ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనం పొందుతారు. అలాగే వివాదాస్పద విషయాల జోలికి వెళ్లవద్దు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వివాహితులకు సామాజిక గౌరవం మరియు సంపద పెరుగుతాయి.

ADVERTISEMENT

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మహిళలు ఖర్చులను తగ్గించుకోండి. వివాహితులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని విపత్కర పరిస్థితులలో మీకు.. మీ భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఆఫీసులో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు కొన్ని నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. 

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశివారు కొత్త వ్యక్తులను కలుస్తారు. అలాగే అవివాహితులకు.. తమ పెళ్లికి సంబంధించిన అవరోధాలు తొలగిపోతాయి. వివాహితులకు తమ భాగస్వామితో సంబంధాలు బలంగా మారతాయి. వ్యాపారస్తులకు వృత్తి భాగస్వామ్యం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రత్యర్థులు కూడా కొన్ని విషయాలలో మీకు సహాయం చేస్తారు. రాజకీయాల్లో బాధ్యతలు మరింత పెరుగుతాయి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఉద్యోగస్తులు ఆఫీసులో ఎట్టి పరిస్థితులలోనూ నిర్లక్ష్య ధోరణిని కనబరచవద్దు. నిరుద్యోగులకు విదేశాలలో జాబ్ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఇలాంటి సమయంలోనే ధైర్యంతో ముందుకు వెళ్లాలి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. 

ADVERTISEMENT

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు మానసిక ఒత్తిడిక గురవుతారు. అలాగే వ్యాపారంలో కూడా పలు ఇబ్బందులు తలెత్తుతాయి. కొన్ని సందర్భాలలో.. కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి.. పలు శుభవార్తలు వింటారు. రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. 

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు విదేశీ ప్రయాణయోగం ఉంది. అలాగే ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసే వ్యక్తులు.. మంచి లాభాలను చూస్తారు. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గరపడతాయి.  సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలలో పురోగతి ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆస్తి సంబంధిత లావాదేవీల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆఫీసులో ఉద్యోగులకు తమ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. విద్యార్థులకు క్రీడలు లేదా కళలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. స్థిరాస్తులు కొనడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 

ADVERTISEMENT

మకరం (Capricorn) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని విషయాలలో భావోద్వేగానికి గురయ్యే అవకాశం ఉంది. అలాగే వివాహితులు పలు విషయాలలో.. తమ భాగస్వామితో నిజాయతీగా వ్యవహరించడం మేలు. అలాగే పాత మిత్రులు మిమ్మల్ని ఈ రోజు కలిసే అవకాశం ఉంది.  అయితే వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) – ఈ రోజు వ్యాపారస్తులకు శుభదినం.  రాజకీయాల్లో కూడా క్రియాశీలత పెరుగుతుంది. ఆఫీసులో మీ మేధో సామర్థ్యానికి.. అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. అలాగే  స్నేహితుల నుండి కూడా మద్దతు లభిస్తుంది. నిరుద్యోగులకు కూడా అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి.

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు డబ్బు విషయంలో.. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రుణాలు ఇచ్చిపుచ్చుకొనే విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. అలాగే వ్యాపారంలో కష్టపడి పనిచేయడం వల్ల మీరు అదనపు ప్రయోజనాలు పొందుతారు.అలాగే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు. 

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

24 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT