26 సెప్టెంబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు మీకోసం)

26 సెప్టెంబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు మీకోసం)

ఈ రోజు (26 సెప్టెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబం నుండి ఒత్తిడి ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో ఉద్యోగస్తుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారంలో విజయం అనేది.. మీ తెలివితేటలు, సమయస్ఫూర్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. 

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడతారు. మీరు తీసుకొనే కొన్ని నిర్ణయాలు.. మీ కుటుంబ ఖ్యాతిని పెంచే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. అవివాహితులకు కళ్యాణ ఘడియలు దగ్గర పడతాయి. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు స్థిరాస్తులు కొనడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. పాత మిత్రులను కలవడం ఆనందంగా ఉంటుంది. ప్రేమికులు కొన్ని విషయాలలో.. తమ భాగస్వామితో నిజాయతీగా ఉండడం మేలు. వివాహితులు దూర ప్రయాణాలు చేస్తారు.

కర్కాటకం (Cancer) – ఈ రోజు  తోబుట్టువుల మధ్య అపార్థాలు తొలిగిపోతాయి. అలాగే ప్రయాణాలలో మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అవివాహితులు పలు శుభవార్తలు వింటారు. కోర్టు సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాల్లోని వ్యక్తులకు పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సిన సమయమిది. 

సింహం (Leo) –  ఈ రోజు ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకొనే సమయంలో.. నూటికి పదిసార్లు ఆలోచించండి. వ్యాపారస్తులు క్లారిటీ లేకుండా.. కొత్త బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. విద్యార్థులు చదువులపై మరింత దృష్టి పెట్టాలి. ఆఫీసులో ఉద్యోగులు కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. వివాహితులకు కొన్ని విషయాలలో భాగస్వామి మద్దతు, భరోసా లభిస్తాయి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులు పదోన్నతులు పొందే అవకాశం కూడా ఉంది. అలాగే వ్యాపారస్తులు దూర ప్రయాణాలు చేస్తారు. వివాహితులకు భాగస్వామి సహాయ, సహకారాలు లభిస్తాయి. అలాగే మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. 

తుల (Libra) – ఈ రోజు ఆఫీసు విషయాలు.. మిమ్మల్ని స్థిమితంగా ఉండనీయకపోవచ్చు. అయితే మీరు అనవసర వివాదాలలో తలదూర్చకపోవడం మంచిది. విద్యార్థులు షార్ట్ కట్ పద్దతులకు స్వస్తి పలకాలి. నిరుద్యోగులు ఫేక్ జాబ్ ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులు ఒకరి పట్ల మరొకరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. పెద్దలు లేదా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. వ్యాపారస్తులు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే.. వాణిజ్య ఒప్పందాలు రద్దయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆఫీసులో ఉద్యోగులు కొత్త సవాళ్లను ఎదుర్కొంటారు. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ప్రేమికుల సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. అలాగే కొందరు వ్యక్తులు మిమ్మల్ని ప్రభావితం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికల గురించి ఆందోళన చెందవద్దు. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించి.. వారే నవ్వులపాలవుతారు. మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వివాహితులు కోపతాపాలను తగ్గించుకోవడం మంచిది. 

మకరం (Capricorn) – ఈ రోజు నిరుద్యోగులు నూతన అవకాశాలను పొందుతారు.  విద్యార్థులకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు సంబంధించి వాణిజ్య విస్తరణకు అవకాశం ఉంది. అలాగే పలు బహుమతులు, కానుకలు అందుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా మీకు ఆసక్తి పెరుగుతుంది. అవివాహితులు శుభవార్తలు వింటారు

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్రమత్తతతో లేకపోతే.. కొన్ని విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. రాజకీయాల్లో నూతన బాధ్యతలు పెరుగుతాయి. మహిళలు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. అలాగే తమ జీవితానికి సంబంధించి నూతన ప్రణాళికలు రచిస్తారు. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. వివాహితులు తమ భాగస్వామితో కలిసి రొమాంటిక్‌గా గడుపుతారు. అలాగే కోర్టు కేసులు, ఆస్తి లావాదేవీలలో ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.