27 సెప్టెంబరు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

27 సెప్టెంబరు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (27 సెప్టెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే అనుకోకుండా కొన్ని ఫంక్షన్లకు కూడా హాజరవుతారు. వివాహితులు కొన్ని విషయాలలో తమ భాగస్వామి మద్దతు పొందుతారు. ఆఫీసులో ఉద్యోగులు శిక్షణా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు కొంచెం కష్టపడితే.. కోరుకున్న రంగంలో ఉద్యోగం పొందుతారు.

వృషభం (Tarus) – ఈ రోజు ప్రేమికులు అనుకోని చిక్కులలో పడతారు. అలాగే మీకు నచ్చని వ్యక్తులతో కలిసి ప్రయాణించాల్సి ఉంటుంది. కొన్ని విషయాలలో మీ  కోపాన్ని కూడా నియంత్రించుకోండి.  అలాగే ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంది. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది.

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు రక్తదానం చేసే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు క్రీడలు లేదా కళలపై ఆసక్తి పెరుగుతుంది. కొన్ని విపత్కర పరిస్థితులలో.. కుటుంబ సభ్యుల సహకారం పొందుతారు. వ్యాపారస్తులకు ఆర్థికంగా బాగానే ఉంటుంది. ప్రేమికులు తమ బంధంలో నిజాయతీ ముఖ్యమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఖరీదైన బహుమతులు పొందుతారు. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. అయితే మళ్లీ రుణాలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే బాల్య మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. నిరుద్యోగులకు ఈ రోజు బాగా కలిసొస్తుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అలాగే సినిమా రంగంలో ప్రయత్నాలు చేసేవారికి కూడా.. ఈ రోజు లాభసాటిగా ఉంటుంది. 

సింహం (Leo) – ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆలుమగల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అదనపు ప్రయోజనాలు సమకూరుతాయి. అలాగే ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయినా వారి ప్రయత్నాలను మీరు దీటుగా ఎదుర్కొంటారు.  అలాగే కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఉద్యోగస్తులు ఆఫీసులో ఉద్రిక్త పరిస్థితులను చూస్తారు. కొన్ని వివాదాలలో  కూడా చిక్కుకోవచ్చు. కనుక జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులు అప్రమత్తంగా లేకపోతే.. ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి పలు శుభవార్తలు వింటారు. ఆలుమగలు కూడా ఒకరిపట్ల మరొకరు ప్రేమాభిమానాలను పెంచుకుంటారు. 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు వాహనయోగం ఉంది. అలాగే సినీ రంగంలో ప్రయత్నాలు చేసే ఔత్సాహికులకు.. అనుకోని అవకాశాలు తలుపు తడతాయి. వ్యాపారస్తులు కీలక ఒప్పందాలు చేసుకునే సమయంలో.. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆలుమగలు పలు శుభకార్యాలు లేదా వ్రతాలలో పాల్గొంటారు. విద్యార్థులకు కళలు, క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఫిర్యాదుల విషయంలో... తలనొప్పులు ఎదురుకావచ్చు. అలాగే ఆఫీసులో ఉద్యోగులకు కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని విషయాలలో అబద్దాలు చెప్పకపోవడం మంచిది. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆలుమగలు తమ విషయాలలో నిజాయతీగా వ్యవహరించడం మేలు.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో.. జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే వాతావరణ మార్పులు... మీ రాకపోకలకు అడ్డం కలిగించవచ్చు. కాబట్టి దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే స్థిరాస్తులకు సంబంధించి.. మీరు కీలక ఒప్పందాలు చేసుకుంటారు.  అలాగే పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. 

మకరం (Capricorn) – ఈ రోజు నిరుద్యోగులు నూతన అవకాశాలను పొందుతారు. అదేవిధంగా  విద్యార్థులకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు కీలక ఒప్పందాలు చేసుకుంటారు. వారి వాణిజ్య విస్తరణకు కూడా అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు పోటీలలో బహుమతులు గెలుపొందుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా మీకు ఆసక్తి పెరుగుతుంది. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు ప్రేమికుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే అప్రమత్తతతో లేకపోతే.. కొన్ని విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. రాజకీయాల్లో నూతన బాధ్యతలు పెరుగుతాయి. సినిమా రంగంలో ప్రయత్నాలు చేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు బాగా కష్టపడి పనిచేస్తారు. కొన్ని అదనపు బాధ్యతలను భుజాలపై వేసుకుంటారు. అలాగే వ్యాపారస్తులు నూతన ప్రణాళికలు రచిస్తారు. విద్యార్థులు ఇంకా బాగాా కష్టపడాలి. వివాహితులు తమ భాగస్వామితో కలిసి రొమాంటిక్‌గా గడుపుతారు. అలాగే కోర్టు కేసులు, ఆస్తి లావాదేవీలలో ఫలితాలు మీకు అనుకూలంగా వస్తాయి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.