28 సెప్టెంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

28 సెప్టెంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (28 సెప్టెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ధన సహాయం కోసం ప్రయత్నిస్తారు. అయితే చేసే ప్రయత్నాన్ని నిజాయతీగా చేయండి. పరుల సొమ్ముకు ఆశపడవద్దు. అలాగే అప్పులు తీసుకొనే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. వివాదాల జోలికి వెళ్లకండి. విద్యార్థులు తమను తప్పుదోవ పట్టించే స్నేహితులకు దూరంగా ఉండడం మంచిది.  

వృషభం (Tarus) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు వ్యాయామం చేయాలనే కోరిక పుడుతుంది. అయితే ఇలాంటి ఆలోచనలకు మధ్యలోనే స్వస్తి చెప్పేయకండి. మీ ఆరోగ్యం కోసం మంచి జిమ్ లేదా వ్యాయామశాలకు వెళ్లండి. అలాగే ఈ రోజు మీరు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే నిరుద్యోగులు ఫేక్ జాబ్ ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.  

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అయితే అక్కరకు రాని స్నేహాలకు స్వస్తి పలకడమే మంచిది. అలాగే కోపాన్ని నియంత్రించుకోండి. మిమ్మల్ని ప్రేమించే వారికి, మిమ్మల్ని ఆపదల్లో ఆదుకున్న వారికి బాసటగా నిలవండి.  ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా.. నిజాయతీని వీడకండి. మీ గుణగణాలే మీకు శ్రీరామరక్ష. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రత్యర్థులపై ఒక కన్నేసి ఉంచండి. ఆఫీసులో ఉద్యోగులు ఎంత ఒత్తిడిలో పనిచేయాల్సి ఉన్నా... కొన్ని విషయాలలో శాంతంగానే ఉండండి. వ్యాపారస్తులు కీలక ఒప్పందాలు చేసుకొనేటప్పుడు.. నూటికి పదిసార్లు ఆలోచించడం మంచిది.  

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది. కనుక వీలుంటే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. అలాగే విద్యార్థులకు రాజకీయాలలో ఆసక్తి పెరుగుతుంది.  అదేవిధంగా కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆలుమగలు ఒకరిపై మరొకరు ప్రేమాభిమానాలను పెంచుకుంటారు. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేస్తారు. అలాగే సెలబ్రిటీలను కలుస్తారు. అవివాహితులు ప్రేమలో పడతారు. ప్రత్యర్థులకు సవాళ్లు కూడా విసురుతారు. వ్యాపారస్తులు ఆర్థిక విషయాలలో.. చాలా పకడ్బందీగా వ్యవహరిస్తారు.  అయితే కొన్ని ప్రమాదకరమైన పనులకు మాత్రం దూరంగా ఉండడం మంచిది. రిస్క్ అన్ని వేళలా చేయకూడదు. 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఎంత ఒత్తిడిలో పనిచేస్తున్నప్పటికీ.. చివరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించకపోయినా.. బాధపడవద్దు.  ఆత్మ స్థైర్యంతో ముందుకు వెళ్లండి. మిమ్మల్ని ఖాతరు చేయని వారికి.. త్వరలోనే మీ విలువ తెలుస్తుంది. ఆలుమగలు కొన్ని విషయాలలో దాపరికాలు లేకుండా వ్యవహరించడం మంచిది. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీరు జాగ్రత్తగా లేకపోతే.. విచ్చలవిడిగా డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండండి. పాత మిత్రులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది. అలాగే వివాహితులు కొన్ని శుభకార్యాలకు హాజరవుతారు. తాగుడు, జూదం లాంటి వ్యసనాలకు ఈ రోజు దూరంగా ఉండండి. ఆఫీసులో ఉద్యోగులు వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు సినీ రంగంలో అవకాశాల కోసం వెతికే వారికి.. బాగా కలిసొస్తుంది. కొంచెం కష్టపడితే అనుకోని అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. అలాగే ప్రేమికులు తమ బంధం గురించి ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. అదేవిధంగా వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నిరుద్యోగులకు కూడా ప్రత్యమ్నాయ రంగాలలో అవకాశాలు లభిస్తాయి.  

మకరం (Capricorn) – ఈ రోజు ప్రేమికుల సమస్యలు అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అయితే మీ మధ్య తలెత్తే విభేదాలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పరిష్కరించుకోవడం ముఖ్యం. అలాగే ఒకరి పట్ల మరొకరికి నమ్మకమనేది చాలా ముఖ్యం. అలాగే ఉద్యోగస్తులకు ఈ రోజు తమ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆలుమగలు అహాన్ని వీడాలి. ఒకరి అభిమానం పొందాలంటే.. కొన్ని విషయాలలో మూర్ఖత్వాన్ని వీడాలి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు అవివాహితులు పలు శుభవార్తలను వింటారు. కళ్యాణ ఘడియలు దగ్గరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమికులు కూడా కొంచెం కష్టపడితే.. పెద్దలను ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగే ఆలుమగల సాన్నిహిత్యాన్ని మరింత పెంచే సంఘటనలు జరుగుతాయి. అదేవిధంగా కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని విషయాలలో స్వార్థపూరితంగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనే మీ మనస్సాక్షిని నమ్మండి. న్యాయబద్ధమైన నిర్ణయాలను తీసుకోండి. లేకపోతే కొన్ని సంఘటనలు మిమ్మల్ని జీవితాంతం వెంటాడతాయి. అలాగే విద్యార్థులు, నిరుద్యోగులు ఓటమి భయాన్ని వీడాలి.  కష్టపడితే ఏదైనా సాధించవచ్చనే సూత్రాన్ని నమ్మండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.