3 సెప్టెంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

3 సెప్టెంబరు 2019 (మంగళవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (సెప్టెంబరు 3, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) –  ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కొంతవరకు కుదుటపడుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఆఫీసులో ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా పనిచేస్తారు. తమ శ్రమకు తగ్గిన ఫలితం కూడా ఉంటుంది. ప్రమోషన్ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. వ్యాపారస్తులు కూడా కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. నిరుద్యోగులకు కూడా అనుకోని అవకాశాలు లభిస్తాయి. 

వృషభం (Tarus) –    ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు మానసిక ఒత్తిడి ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లల కారణంగా అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. మహిళలు అపరిచితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  వ్యాపారస్తులు అప్పులు ఇచ్చే విషయంలో లేదా తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండండి.  ఆఫీసులో ఉద్యోగులు కూడా సమన్వయలోపం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే వివాహితులకు తమ భాగస్వామి నుండి.. కొన్ని విషయాలలో మద్దతు లభిస్తుంది.  ఈ రాశి వ్యక్తులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు చాలా లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. వివాహితులకు బంధువులు లేదా స్నేహితుల నుండి ఖరీదైన బహుమతులు అందుతాయి.  అలాగే నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు వస్తాయి. అయితే తమ నిర్లక్ష్య ధోరణి వల్ల వాటిని పోగొట్టుకొనే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి.  

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలోనే కోపాన్ని నియంత్రించుకొని.. శాంతియుతంగా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. అలాగే వ్యాపారస్తులు కొత్త భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివేకంతో నిర్ణయాలు తీసుకోవాలి.  సృజనాత్మక రంగాలలో పనిచేసే వ్యక్తులకు కూడా ఈ రోజు విజయం సిద్ధిస్తుంది.  

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు కూడా కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వ్యక్తులు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే పాత మిత్రులను కలుస్తారు. వివాహితులు తమ భాగస్వామితో కలిసి రొమాంటిక్‌గా గడుపుతారు. 

తుల (Libra) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి అడగులు వేయాల్సిన అవసరం ఉంది. సృజనాత్మక, సినిమా రంగాలకు చెందిన వ్యక్తులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే..  ఆఫీసులో  ప్రత్యర్థుల వల్ల పలు ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయినా సరే.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి.  

వృశ్చికం (Scorpio) – ఈ రోజు మీకు ప్రయాణంలో అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులకు సంబంధించి పలు ఒప్పందాలు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆఫీసులో ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పెరుగుతాయి. అలాగే కోర్టు వివాదాలు, ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి.  వివాహితులకు కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు తల్లిదండ్రులు.. పిల్లల విషయంలో కాస్త ఆందోళనకు గురవుతారు. అలాగే వివాహితులు పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆఫీసులో ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు తమ కుటుంబ సభ్యుల నుండి నైతిక మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులు పలు శుభవార్తలు వింటారు. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తుల సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారులతో మేధోపరమైన చర్చ జరుగుతుంది. వ్యాపారస్తులకు ఏజెంట్లతో సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే వాహన వినియోగంలో జాగ్రత్త వహించడం మంచిది. వివాహితులు ఈ రోజు తమ భాగస్వామితో ఆహ్లాదంగా గడుపుతారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి..

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది. రాజకీయ రంగానికి చెందిన వ్యక్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారస్తులు  ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే పని ఒత్తిడిలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆర్థికపరమైన ఒత్తిడి ఉంటుంది. కొత్త పథకాలలో మూలధనాన్ని పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులు ఆఫీసులో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారస్తులు ఏజెంట్లు, బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహితులకు తమ భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. అయినా సరే శాంతియుతంగానే సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.