30 సెప్టెంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు మీరూ చదివేయండి)

30 సెప్టెంబరు 2019 (సోమవారం, ఈ రోజు రాశిఫలాలు మీరూ చదివేయండి)

ఈ రోజు (30 సెప్టెంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు అవివాహితులు శుభవార్తలు వింటారు. అలాగే కళ్యాణ ఘడియలు దగ్గరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రోజు మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు వస్తారు. ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మంచిది. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి.

వృషభం (Tarus) – ఈ రోజు నిరుద్యోగుల సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త ఉపాధి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం.. విదేశీ వీసాకి అప్లై చేసుకొనే అవకాశం ఉంది. బిపీఓ, సాఫ్ట్‌వేర్ రంగాలలో పనిచేసే వ్యక్తులకు పురోగతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

మిథునం (Gemini) – ఈ రోజు అక్కరకు రాని స్నేహాలను దూరం పెట్టండి. లేదంటే మీకే నష్టం. అలాగే వాతావరణ మార్పులను గమనించండి. దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకొని.. అనుకోని చిక్కులలో పడకండి. అలాగే వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులు బ్రోకర్లు, ఏజెంట్లను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది. అలాగే డైట్ విషయంలో మార్పులు చేసుకోవడానికి.. ఈ రోజు నుండి ఓ చక్కటి ప్లాన్ రూపొందించండి. ఆఫీసులో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయాలపై కూడా ఆసక్తి పెరుగుతుంది. అలాగే పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.

సింహం (Leo) – ఈ రోజు మీ భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అయినా సరే కుటుంబ సమస్యలను సామరస్యంగానే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీ ప్రవర్తన పిల్లలను ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడండి. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై కూడా ఆసక్తి పెంచుకుంటారు. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం మంచిది. అలాగే వీలుంటే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవడం కూడా బెటర్. ఇక ఉద్యోగస్తులు ఆఫీసులో వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. కోర్టు కేసులు లేదా ఆస్తి వివాదాల పరిష్కారానికి.. ఇంకా సమయం పడుతుంది. వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అన్ని విషయాలలోనూ పురోగతి సాధిస్తారు. పలు శుభవార్తలు కూడా వింటారు. ప్రేమికులు తమ బంధం గురించి.. ఇంట్లో చెప్పడానికి ఇదే సరైన సమయం. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు మెండుగా ఉంటాయి. విద్యార్థులకు క్రీడలు, కళల పట్ల ప్రత్యేక ఆసక్తి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు తమ బిడ్డలకు సంబంధించి మంచి విషయాలు వింటారు. 

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ కుటుంబానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఆస్తి పంపకాలు లాంటి విషయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తారు.తల్లిదండ్రులు పిల్లలకు తమ బాధ్యతలను గుర్తు చేయడం మంచిది. వ్యాపారంగంలోని వ్యక్తులు కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తారు. విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు.. పనిలో అజాగ్రత్త వల్ల అనుకోని నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. కనుక అప్రమత్తంగా ఉండండి. అలాగే ఆఫీసులో ఉద్యోగులకు పనిఒత్తిడి పెరుగుతుంది. రాజకీయాల్లో అదనపు బాధ్యతలు కూడా పెరుగుతాయి. వివాహితులు తమ సమస్యలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పరిష్కరించుకోవడం మంచిది.

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు.. ముఖ్యంగా మహిళలు షాపింగ్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో రిబేట్లు, డిస్కౌంట్లు పొందుతారు. ఉద్యోగులు కూడా శుభవార్తలు వింటారు. తమ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. అధికారుల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి. వ్యాపారస్తులు నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) - ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కొన్ని విషయాలలో మీ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అయినప్పటికీ అధైర్యపడకండి. కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లండి. ఓటమి నుండి గెలుపు పాఠాలు నేర్చుకోండి. ముఖ్యంగా అక్కరకు రాని స్నేహాలకు దూరంగా ఉండండి. వివాదాస్పద నిర్ణయాలు తీసుకొనేటప్పుడు బాగా ఆలోచించి.. ముందడుగు వేయండి. 

మీనం (Pisces) – ఈ రోజు మీ భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.  అలాగే కొన్ని విషయాలలో భావోద్వేగానికి గురవుతారు. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే సామాజిక గౌరవం పెరుగుతుంది. కాకపోతే వాహన వినియోగంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.