4 సెప్టెంబర్ 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

4 సెప్టెంబర్ 2019 (బుధవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (సెప్టెంబరు 4, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా మహిళలు ఖర్చులను తగ్గించుకోవాలి. అలాగే వ్యాపారస్తులు ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. రాజకీయ నాయకులకు అనుకోని బాధ్యతలను స్వీకరించే అవకాశం లభిస్తుంది. 

వృషభం (Tarus) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు ప్రతికూల సంఘటనలను ఎదుర్కొంటారు. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అదేవిధంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఉద్యోగులకు ఆఫీసులో కొత్త బాధ్యతలు పెరగవచ్చు. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అస్థిరత ఉంటుంది. 

మిథునం (Gemini) – ఈ రోజు మీ ప్రవర్తన కొందరికి కోపాన్ని తెప్పించే అవకాశం ఉంది. అలాగే మీరు కొన్ని విషయాలలో మొండితనాన్ని వీడితే మంచిది. అలాగే కొత్త వ్యక్తులు ఈ రోజు మీకు పరిచయమవుతారు. అవివాహితులు ప్రేమలో పడే అవకాశం ఉంది. వివాహితులు కొన్ని విషయాలలో తమ భాగస్వామి సలహాలు స్వీకరించడం శ్రేయస్కరం. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలలో కోపాన్ని నియంత్రించుకోవడం బెటర్. అలాగే వ్యాపారస్తులకు ఈ రోజు సులభ ధన యోగం ఉంది. వివాహితులు తమ భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.   

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సంబంధించిన కోర్టు కేసులు.. ఆస్తి వివాదాలు ఒక పరిష్కారదశకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. తద్వారా పలు  రాజకీయ ప్రయోజనాలు కూడా పొందుతారు. ఈ రాశి వ్యక్తులకు ఈ రోజు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. 

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్లడం మంచిది. అలాగే కొందరు బాల్య మిత్రులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది.  అవివాహితులు తమకు బాగా పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. ఉద్యోగులకు అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. అలాగే వారి శ్రమకు తగిన ఫలితం కూడా లభిస్తుంది.  

తుల (Libra) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆఫీసులో కొన్ని వివాదాల బారిన పడే అవకాశం ఉంది. కనుక కొన్ని విషయాలలో లౌక్యంతో వ్యవహరించాలి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి. నిరుద్యోగులు కాస్త బద్ధకాన్ని వీడితే.. మంచి అవకాశాలు మీ తలుపు తట్టే అవకాశం ఉంది. వ్యాపారస్తులు దురాశను వీడాలి. లేదంటే మొదటికే మోసం రావచ్చు. ప్రత్యర్థులు ఈ రోజు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నించవచ్చు.  

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు మీరు కొత్త ప్రణాళికలు రచించే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభం చేకూరుస్తాయి. అదేవిధంగా వివాహితులకు కూడా ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కుటుంబంలో కూడా సరదా వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ప్రతికూల ఆలోచనలను వీడాలి. లేకపోతే అవి మీపై వ్యతిరేక ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ప్రేమికులు కూడా కొన్ని విషయాలలో నిజాయతీగా వ్యవహరించడానికి ప్రయత్నించాలి. అలాగే అక్కరకు రాని స్నేహాలకు స్వస్తి పలకాలి. ఉద్యోగస్తులు కూడా  ఆఫీసులో వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరిగినా.. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కోర్టు కేసులు మొదలైనవి తమకు అనుకూలమైన ఫలితాలను అందించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) -  ఈ రోజు మీరు మీ కుటుంబ సమస్యలకు సంబంధించి.. ఒక శాశ్వత పరిష్కారాన్ని పొందే అవకాశం ఉంది.  అలాగే ఆఫీసులో ఉద్యోగులకు అధికారుల మద్దతు లభిస్తుంది.  అలాగే వివాహితులకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అయితే రుణాలను తీసుకొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సానుకూల ఆలోచనలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగులు కూడా కొత్త అవకాశాలను పొందే క్రమంలో.. బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకోవాలి.  ప్రేమికులు కూడా తమ బంధం గురించి పెద్దలకు చెప్పడానికి ఇదే సరైన సమయం. వివాహితులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు.. భాగస్వామితో సంప్రదింపులు చేయడం మంచిది. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.