ADVERTISEMENT
home / Astrology
6 సెప్టెంబరు 2019 (శుక్రవారం,  ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

6 సెప్టెంబరు 2019 (శుక్రవారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (సెప్టెంబరు 6, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు కుటుంబ సమస్యలతో సతమతమవుతారు. అయితే పెద్దల జోక్యంతో ఆ వివాదాలు సమసిపోతాయి. అలాగే ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఒత్తిడి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి ఓ శుభవార్తను వింటారు. వ్యాపారస్తులు ఆగిపోయిన ప్రాజెక్టులను మళ్లీ ప్రారంభిస్తారు. ఆలుమగలు తమ మధ్య భేదాభిప్రాయాలను తొలిగించుకుంటారు. 

వృషభం (Tarus) –  ఈ రోజు నిరుద్యోగులకు, ఉద్యోగార్థులకు శుభదినం. కొంచెం కష్టపడి.. లౌక్యంగా వ్యవహరిస్తే అనుకోని అవకాశాలు మీ తలుపు తడతాయి. అలాగే  ఉద్యోగస్తులకు ఆఫీసులో వాతావరణం తమకు అనుకూలంగా ఉంటుంది. అధికారుల నుండి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. అదేవిధంగా వివాహితులకు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

మిథునం (Gemini) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అపరిచితులను నమ్మే విషయంలో నూటికి పదిసార్లు ఆలోచించాలి. వ్యాపారస్తులు కూడా ఏజెంట్లు లేదా బ్రోకర్లను నమ్మే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. వివాహితులు తమ భాగస్వామితో ఏర్పడిన సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి.  

ADVERTISEMENT

కర్కాటకం (Cancer) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అంతా శుభప్రదంగా గడుస్తుంది.  ఉద్యోగస్తులు కూడా  ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు.  అలాగే కొన్ని ముఖ్యమైన పార్టీలు, ఫంక్షన్లకు హాజరవుతారు.  అదేవిధంగా.. వ్యాపారస్తులకు సులభ ధనయోగం ఉంటుంది. కోర్టు వివాదాలు, ఆస్తి తగాదాలు కూడా ఈ రోజు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.  

సింహం (Leo) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే స్నేహితులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో అధికారుల నుండి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులు కొన్ని విషయాలలో వివేకంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టుల వైపు మొగ్గు చూపుతారు. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. వీలైతే కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. అలాగే ఉద్యోగస్తులు పెండింగ్ పనులు పూర్తి చేయడం మంచిది. ఎందుకంటే ఆడిట్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వ్యక్తులకు విదేశీ ప్రయాణ యోగం ఉంది. వ్యాపారస్తులు అనుకోని ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. 

ADVERTISEMENT

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధన యోగం ఉంది.  అలాగే ప్రేమికులు తమ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహితులు తమ సమస్యలను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పరిష్కరించుకోవడం మంచిది.  అలాగే తల్లిదండ్రులు తమ బిడ్డల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి.    

వృశ్చికం (Scorpio) –    ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని విధంగా అదృష్టం కలిసొస్తుంది. అలాగే కుటుంబ బంధాలు కూడా పటిష్టమవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. వివాహితులకు సామాజిక గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు తమ సంపద రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్‌‌లో పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) –   ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు ఆర్థిక సమస్యలలో చిక్కుకునే అవకాశం ఉంది. అందుకే కొన్ని సందర్భాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వ్యాపారస్తులు ఏజెంట్లు లేదా బ్రోకర్లను నమ్మే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వివాహితులు కోపాన్ని నియంత్రించుకోండి. అక్కరకు రాని స్నేహాలకు స్వస్తి పలకండి.  

ADVERTISEMENT

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అనుకోని సమస్యల వలయంలో చిక్కుకున్నా.. ధైర్యంగానే వాటిని ఎదుర్కొంటారు.  ఉద్యోగస్తులు తమ శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. యువతకు క్రీడలపై ఆసక్తి పెరుగుతుంది. వివాహితులు పలు ఆఫర్లు, బహుమతులు కూడా పొందుతారు. అలాగే ఈ రాశి వ్యక్తులు దూర ప్రయాణాలు చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.  

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొన్ని వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే ఉద్యోగస్తులు అధికారులతో మాట్లాడేటప్పుడు.. కొంత సహనాన్ని పాటించాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. వ్యాపారస్తులు కూడా వివేకంతో ఆలోచించాలి. ఎదుటి వారు చెప్పిన మాటలు విని.. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు.  

మీనం (Pisces) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సాధ్యమైనంత వరకూ.. తమలో పాజిటివ్ ఎనర్జీని నింపుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఆఫీసులో ఉద్యోగస్తులకు ప్రత్యర్థుల నుండి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. వివాహితులకు తమ భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే వాహన వినియోగంలో ఈ రాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండడం మంచిది.  

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

05 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT