7 సెప్టెంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

7 సెప్టెంబరు 2019 (శనివారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (సెప్టెంబరు 7, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం

మేషం (Aries) – ఈ రోజు వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులతో డీల్ చేసే విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. అలాగే ప్రేమికులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వివాహితులు ప్రతికూల ఆలోచనల నుండి బయటపడాలి. ఉద్యోగులు పెండింగ్ పనులను పూర్తి చేస్తే మంచిది. లేకపోతే చిక్కుల్లో పడతారు. నిరుద్యోగులు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేయాలి.  

వృషభం (Tarus) –  ఈ రోజు తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు రవాణా మార్గాలు ఇబ్బందిని కలిగిస్తాయి. ఆలుమగలు తమ వైవాహిక బంధాన్ని మెరుగుపరుచుకుంటారు. ప్రేమికుల అభిమతాన్ని పెద్దలు గౌరవిస్తారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. 

మిథునం (Gemini) –  ఈ రోజు ప్రత్యర్థులు మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి.  అలాగే వ్యాపారస్తులు రాజకీయ రంగం వైపు మొగ్గు చూపిస్తారు.  ఉద్యోగస్తులకు సులభ ధన యోగం ఉంది. వివాహితులు శుభవార్తలు వింటారు. ప్రేమికులు తమ వివాహానికి సంబంధించిన అవరోధాలను తొలిగించుకుంటారు. 

కర్కాటకం (Cancer) –  ఈ రోజు నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. తాము కోరుకున్న రంగంలో కెరీర్ ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తులు కొత్త టాస్క్‌లతో బిజీగా ఉంటారు. వివాహితులు తమ కుటుంబంలో సరదా వాతావరణాన్ని చూస్తారు. ప్రేమికులు తమ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు.. మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా స్వయంగా ఆలోచించడం మంచిది.  

సింహం (Leo) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అపరిచితులు, ఏజెంట్లు, బ్రోకర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  వ్యాపారస్తులు తమ నిర్లక్ష్యం కారణంగా.. మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. వివాహితులు ఆర్థిక సంక్షోభంతో ఇబ్భంది పడే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ప్రేమికులు ఒకరితో ఒకరు నిజాయతీగా వ్యవహరించడం మంచిది.   

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు తమ తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖర్చులను తగ్గించుకోవాలి. ఉద్యోగస్తులు ఆఫీసులో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అలాగే వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులను టేకప్ చేసే విషయంలో.. ఆచితూచి అడుగులు వేయాలి.  నిరుద్యోగులు ఫేక్ జాబ్ ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

తుల (Libra) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు పలు నిర్ణయాలను తీసుకొనే సమయంలో.. సంబంధిత నిపుణుల సూచనలను పాటించడం మంచిది. ప్రేమికులు ఊహాజనితమైన ఆలోచనలకు స్వస్తి పలికి.. వాస్తవాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. నిరుద్యోగులు తాము ఇష్టపడే రంగంలోనే ప్రయత్నాలు ప్రారంభిస్తే బెటర్. 

వృశ్చికం (Scorpio) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు సోమరితనాన్ని వీడాలి. అలాగే కారణం లేకుండా.. మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తే వారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. అక్కరకు రాని స్నేహాలకు స్వస్తి పలకండి. ఆలుమగలు తొలుత గొడవలు పడినా.. ఆ తర్వాత సయోధ్యను పెంచుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోండి.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న పనులు మళ్లీ ఊపందుకుంటాయి.  వివాహితులు తమ భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సృజనాత్మక, సినిమా, మార్కెటింగ్ రంగాలకు చెందిన వ్యక్తులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు పార్ట్ టైమ్ ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సోదరులు లేదా మిత్రుల నుండి సహకారం అందుతుంది. అలాగే వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆలుమగలు కొన్ని విషయాలలో.. ఒకరితో ఒకరు నిజాయతీగా వ్యవహరించడం చాలా ముఖ్యం. లేదా మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది.  

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) -  ఈ రాశి వ్యక్తులు ఈ రోజును బ్రహ్మాండంగా మొదలుపెట్టినా.. అనుకోకుండా తలెత్తే సమస్యలు మిమ్మల్ని మానసికంగా వేధించే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు కొందరు ప్రయత్నించవచ్చు. అయినా మనోధైర్యంతో ముందుకు వెళ్లండి. మిమ్మల్ని శాసించే అధికారం ఎవ్వరికీ లేదనే విషయాన్ని నమ్మండి.  

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు సులభ ధనయోగం ఉంటుంది. అలాగే శత్రువులు కూాడా మిత్రులుగా మారే అవకాశాలున్నాయి. అదేవిధంగా వివాహితులకు విదేశీ ప్రయాణ యోగం ఉంది.  నిరుద్యోగులకు కూడా కెరీర్ పరంగా అనుకోని అవకాశాలు లభిస్తాయి. ప్రేమికుల సమస్యలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడతారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.