5 సెప్టెంబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

5 సెప్టెంబరు 2019 (గురువారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (సెప్టెంబరు 5, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశిఫలాలు (horoscope and astrology) మీకోసం..

మేషం (Aries) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు స్నేహితుల మద్దతు లభిస్తుంది. అలాగే ఆఫీసులో ఉద్యోగులకు అధికారుల సహకారం కూడా లభిస్తుంది. అదేవిధంగా వివాహితులు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.  ప్రేమికులు తమ జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు మొండి బాకీలు వసూలవుతాయి. అలాగే కొత్త రుణాలు లభిస్తాయి. 

వృషభం (Tarus) –  ఈ రోజు ఈ రాశి వ్యక్తులు అపరిచితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆఫీసులో ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని విషయాలలో లౌక్యంగా వ్యవహరించాలి. వ్యాపారస్తులు ఏజెంట్లు, బ్రోకర్లను నమ్మే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. రాజకీయల నాయకులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వివాహితులు ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

మిథునం (Gemini) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వాణిజ్యవేత్తలు.. కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అయితే ఒప్పందాలు చేసుకొనేటప్పుడు మాత్రం.. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు తమకు ఫలితాలు ప్రతికూలంగా వచ్చినా సరే.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

కర్కాటకం (Cancer) –   ఈ రోజు ఈ రాశి వ్యక్తులు కుటుంబ సమస్యలతో సతమతమవుతారు. అయినా సరే ఎటువంటి విషయానైనా.. శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. కోపాన్ని నియంత్రించుకోండి. వ్యాపారస్తులు అపరిచితులను నమ్మే విషయంలో.. జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రోజు మీ బాల్యమిత్రులు లేదా పాత స్నేహితులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంది.  

సింహం (Leo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు అనుకోని పోటీ ఎదురవుతుంది. ముఖ్యంగా నిరుద్యోగులు చాలా కఠినమైన ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం ఉంది. అయినా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. మీ శ్రమకు తగిన ఫలితం కచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేత్ర సంబంధిత సమస్యలను అశ్రద్ధ చేయవద్దు.  

క‌న్య (Virgo) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు ఆదాయం పెరుగుతుంది. అలాగే విలువైన బహుమతులు కూడా పొందే అవకాశం ఉంది.  ఉద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పలు అవార్డులు, రివార్డులు కూడా అందుకుంటారు. వ్యాపారస్తులు కొత్త పథకాలలో పెట్టుబడులు పెడతారు. అయితే తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

తుల (Libra) –   ఈ రోజు ఈ రాశి వ్యక్తులు రొమాంటిక్‌గా గడుపుతారు. ప్రేమికులు కూడా తమ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహితులు తమ భాగస్వామి నుండి అభిప్రాయ భేదాలను దూరం చేసుకొని.. ప్రేమతో తన నిర్ణయాలను స్వాగతిస్తారు. అలాగే ఈ రోజు ఈ రాశి వ్యక్తులు పలు సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు. ముఖ్యంగా మీరు మీడియా దృష్టిలో పడే అవకాశం ఉంది.   

వృశ్చికం (Scorpio) – ఈ రోజు ఈ రాశివ్యక్తులు విపరీతమైన శారీరక అలసటకు గురవుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వక పోవడం వల్ల.. అసహనానికి గురవుతారు. అయినా సరే.. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లండి. మీ ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులకు వేయండి. వివేకంతో నిర్ణయాాలు తీసుకోండి. అప్పుడు విజయం మీ సొంతమవుతుంది.  

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు (Saggitarius) –   ఈ రోజు ఈ రాశి వ్యక్తులు ఏ రంగానికి చెందిన వారైనా సరే.. విపరీతమైన పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. తమ జీవితానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వ్యాపారస్తులకు భాగస్వాములు ఎంతో సహాయం చేస్తారు. అలాగే ఆలుమగల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. అయినా సరే.. అటువంటి సమస్యలు వేగంగానే పరిష్కారమవుతాయి. 

మకరం (Capricorn) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి ఖర్చు పెట్టాలి. అలాగే  వ్యాపారస్తులు కొత్త ఆదాయ వనరులు సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తారు. వివాహితులు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సుల వైపు ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ రాశి వ్యక్తులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభం (Aquarius) -  ఈ రోజు ఈ రాశి వ్యక్తులను పలు ఆరోగ్య సమస్యలు అసహనానికి గురిచేసే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులకు అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆలుమగలు తమ జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. అలాగే ప్రేమికులు వివాదాస్పద నిర్ణయాలు తీసుకొనే ముందు.. నూటికి పదిసార్లు ఆలోచించండి.  

మీనం (Pisces) – ఈ రోజు ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. ఆలుమగలు ఒకరితో ఒకరు ప్రేమగా మసలుకుంటారు. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపిస్తారు. విద్యార్థులు కొన్ని వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. నిరుద్యోగులు నిరుత్సాహాన్ని వీడి ముందుకు వెళ్లి.. అనుకోని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.