ఈ ఆహార పదార్థాలు.. మీలో లైంగిక శక్తిని మరింతగా పెంచుతాయి

ఈ ఆహార పదార్థాలు.. మీలో లైంగిక శక్తిని మరింతగా పెంచుతాయి

సాధారణంగా సెక్స్ (sex) సమయంలో.. కొన్ని రకాల ఆహార పదార్థాలు (foods) ఎక్కువగా తీసుకుంటే మూడ్ పెరుగుతుందని చెబుతుంటారు. కానీ మీరు రోజువారీ తినే కొన్ని ఆహార పదార్థాలు కూడా సెక్స్ కోరికలు పెరిగేందుకు తోడ్పడతాయని మీకు తెలుసా? ఆహారం అనేది మన శరీరం పనిచేయడానికి ఓ ఇంధనం లాంటిది. శరీరం ఏ పని చేయడానికైనా సరే.. ఈ ఇంధనం తప్పనిసరి. దీనికి సెక్స్ కూడా అతీతం కాదు. అందుకే ఒకవేళ మీకు సెక్స్ కోరికలు తగ్గాయని లేదా సెక్స్ సమయంలో ఆనందంగా అనిపించట్లేదని అనిపిస్తే.. వెంటనే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి. ఇవి మీ సెక్స్ కోరికలు పెంచడం మాత్రమే కాదు.. సెక్స్ సమయంలో మీ శక్తిని కూడా పెంచుతాయి. మీ శరీరానికి తగిన పోషకాలను కూడా అందిస్తాయి. అవేంటంటే..

1. బెర్రీస్

స్నాక్స్‌గా తీసుకోవడానికి ఉపయోగపడే.. పండ్లలో బెర్రీస్ చాలా ముఖ్యమైనవి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు సెక్స్ కోరికలు పెంచడంలోనూ తోడ్పడతాయి. అలాగే స్ట్రాబెర్రీలు, రాస్బెర్రీల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇవి స్త్రీ, పురుషులు ఇద్దరికీ లైంగిక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. ఇందులో లభించే విటమిన్ సి, ఇ మొదలైనవి ఆరోగ్యకరమైన సెక్స్ జీవితానికి ఎంతో అవసరం.

2. అవకాడో

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం పొందాలంటే.. అది అవకాడోలతోనే సాధ్యం. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బీ6 మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. ఇవి లైంగిక శక్తిని పెంచడంతో పాటు హార్మోన్లు సరైన స్థాయిలో ఉండేలా చూస్తాయి. రోజూ ఒక్క అవకాడో తీసుకున్నా చాలు.. మీ ఆరోగ్యం పచ్చగా ఉంటుంది. 

3. సెలరీ

కొత్తిమీరలా కనిపించే సెలరీ తీసుకోవడం.. చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ మీ లైంగిక శక్తిని పెంచడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులోని అమైనో యాసిడ్‌లు రక్తనాళాలను వెడల్పుగా మారేలా చేస్తాయి.  దాదాపు వయాగ్రా అందించే ప్రయోజనాలను.. ఇది మనకు అందిస్తూ సెక్స్ కోరికలను పెంచుతుంది.

4. గుమ్మడి గింజలు

గుమ్మడి గింజలు టెస్టోస్టిరాన్ స్థాయులను పెంచుతాయి. ఇవి కేవలం మగవారిలో మాత్రమే కాదు.. ఆడవారిలో కూడా లైంగిక శక్తిని పెంచుతాయి

5. మాంసం

మీకు మాంసాహారం అంటే ఇష్టమా? అందులో చికెన్ అంటే మరీ ఇష్టమా..? అయితే మీకు నచ్చిన చికెన్ వంటకాలను తినడానికి ఇప్పుడు మరో కారణం కూడా దొరికింది. అవును.. చికెన్ మీ రక్త ప్రసరణను పెంచుతుంది. దీనివల్ల మీ లైంగిక శక్తి కూడా పెరుగుతుంది. అంగస్థంభన సమస్యతో బాధపడే మగవారికి ఇది చక్కటి మందు.

6. ఆయిస్టర్స్

ఆయిస్టర్స్ నేచురల్ ఆఫ్రొడిసియాక్‌గా (సెక్స్ కోరికలు పెంచేది)  పనిచేస్తుంది. ఆయిస్టర్స్‌తో పాటు క్లామ్స్, స్కాలప్స్ వంటి రకాలను కూడా తీసుకోవచ్చట. వీటిలో టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ అనే హార్మోన్లను సహజంగా పెంచే గుణాలుంటాయి. అందుకే చాలామందికి వీటిని తీసుకుంటే సెక్స్ కోరికలతో పాటు లైంగిక శక్తి కూడా పెరుగుతుంది.

7. యాపిల్స్

సాధారణంగా రోజుకో యాపిల్ తింటే.. డాక్టర్‌కి దూరంగా ఉండచ్చని అంటుంటారు. కానీ రోజుకో యాపిల్ తినడం వల్ల.. మీ భాగస్వామికి మరింత దగ్గరగా ఉండచ్చు. ఇందులో క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ వల్ల సెక్స్ కోరికలు పెరగడంతో పాటు.. మరెన్నో ప్రయోజనాలుంటాయి.

8. అరటి పండ్లు

అరటి పండ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల కదలికకు ఎంతో ముఖ్యం. అందుకే ఇది సెక్స్ జీవితం ఆనందంగా సాగేలా చేస్తుంది. సెక్స్ కోరికలు పెంచుతుంది. లైంగిక శక్తి పెరిగేలా చేయడంతో పాటు సెక్స్ సంబంధిత సమస్యలు తగ్గేలా చేస్తుంది.

9. క్యాప్సికం

ఒక క్యాప్సికంలో.. మనకు రోజువారీ కావాల్సిన 'విటమిన్ సి' చాలా ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది రక్త ప్రసరణ సజావుగా సాగేలా చేయడంతో పాటు.. సెక్స్ కోరికలు పెరిగేలా చేస్తుంది.

10. కాఫీ

సాధారణంగా కాఫీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని అంటారు. కానీ కొంత మోతాదులో తాగితే మాత్రం.. ఇందులోని స్టిమ్యులెంట్ సెక్స్ కోరికలను పెంచుతుంది. కాఫీ మీ మూడ్‌ని పెంచడంతో పాటు.. లైంగిక శక్తిని కూడా పెంచి.. మీ బెడ్ రూంలో మీ సామర్థ్యాన్ని చాటేలా చేస్తుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.