ADVERTISEMENT
home / Dad
‘డాటర్స్ డే’ సందర్భంగా.. మీ అమ్మాయికి ‘మంచి బహుమతి’ ఇవ్వాలనుకుంటున్నారా..?

‘డాటర్స్ డే’ సందర్భంగా.. మీ అమ్మాయికి ‘మంచి బహుమతి’ ఇవ్వాలనుకుంటున్నారా..?

సాధారణంగా ఏ అమ్మాయి జీవితంలోనైనా తన మొదటి హీరో తండ్రి.. మొదటి నేస్తం తల్లి అనడం రివాజుగా వస్తోంది. చాలావరకు అమ్మాయిలు ఇలాంటి భావంతోనే ఉంటారు. పైగా కూతురు పుట్టిందంటే చాలు.. వారింటికి లక్ష్మీ కళ వచ్చిందని భావించేవారూ లేకపోలేదు. అలా ప్రాణ ప్రదంగా చూసుకునే కూతురి పుట్టినరోజు, పెళ్లిరోజు లేదా ఇంకేదైనా విశేషమైన రోజు సందర్భంగా.. తనకో బహుమతి ఇవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి..?

మీకో విషయం తెలుసా..? గత అనేక సంవత్సరాలుగా.. కూతుళ్ల కోసం ప్రత్యేకంగా “డాటర్స్ డే”ని జరుపుకోవడం కూడా మన దేశంలో ఆనవాయతీగా వస్తోంది. మరి మనం కూడా.. ఈ “డాటర్స్ డే” (Daughters Day) సందర్భంగా.. తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఎలాంటి కానుకలు, బహుమతులు ఇస్తే బాగుంటుందో తెలుసుకుందాం. 

మీ ప్రియమైన వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలా చెప్పండి

ఈ కథనంలో మీ అమ్మాయి జీవితంలో జరిగే ముఖ్య ఘట్టాల సమయంలో.. మీరు ఎలాంటి బహుమతులు ఇస్తే బాగుంటుందో కూడా ప్రత్యేకంగా తెలియజేశాం.

ADVERTISEMENT

“డాటర్స్ డే” స్పెషల్ – ఈ బహుమతులు మీ అమ్మాయికి ప్రత్యేకం

సాధారణంగా తల్లిదండ్రులు తమ కూతుళ్లని మురిపెంగా చూసుకోవడం సహజం. అలాగే వారికి ఎప్పుడు ఏది కావాలో తెలుసుకుంటూ.. వాటిని సమకూర్చడాన్ని కూడా తమ బాధ్యతగా ఫీలవుతుంటారు. వారికి  స్నేహితులుగా మెదులుతూ జీవితంలో ఒక మంచి తోడుగా నిలబడుతుంటారు. అలాంటి తల్లిదండ్రులు తమ కుమార్తెలకు “డాటర్స్ డే” సందర్భంగా ఎలాంటి బహుమతులను అందిస్తే బాగుంటుందో.. మీరూ చూడండి

* పింక్ రోజెస్

అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే రంగు పింక్. వారు సహజంగా ఉపయోగించే వస్తువుల్లో కూడా పింక్ కలర్‌తో ఉన్నవే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకే ఈ డాటర్స్ డే నాడు.. మీ అమ్మాయికి గనుక పువ్వుల పైన ఆసక్తి ఉంటే.. వెంటనే పింక్ కలర్ రోజాపూలని బహుమతిగా ఇవ్వండి. ఈ బహుమతి ఆమె ముఖంలో చక్కటి చిరునవ్వుని చిగురింపజేస్తుంది.

* నెయిల్ పాలిష్

అమ్మాయిలు తమ  గోళ్లను సైతం చాలా అందంగా తీర్చిదిద్దుకుంటుంటారు.  ఎంతలా అంటే, ఏదైనా ఈవెంట్ లేదా పెళ్లికి వెళ్లాల్సి వస్తే తప్పకుండా.. వివిధ రకాల నెయిల్ పాలిష్‌లను తప్పక ఉపయోగిస్తారు. పైగా వారి శరీర రంగుని బట్టి.. ఏ రంగు నెయిల్ పాలిష్ అయితే బాగుంటుందో దానిని వెతికి మరి కొనుగోలు చేస్తుంటారు. అటువంటి వారికి మీరు బహుమతిగా అందించే.. ప్రత్యేకమైన నెయిల్ పాలిష్ తప్పకుండా ఆకట్టుకుంటుంది.

* టెడ్డి & చాకోలెట్ బాస్కెట్

సాధారణంగా అమ్మాయిలు ఇష్టపడే వాటిలో టెడ్డి, చాకోలెట్స్ ఉంటాయి. అలాంటిది ఈ రెండింటిని కలిపి ఒక బహుమతిగా ఇస్తే.. అమ్మాయిలు కచ్చితంగా ఇష్టపడతారు. అసలు అమ్మాయిలకి ఈ బొమ్మలు, చాకోలెట్స్ అంటే ప్రీతీ ఎక్కువ. అటువంటిది ఈ రెండు కలిపి ఒక బహుమతిగా అందిస్తే చాలా ఖుషీగా తీసుకుంటారు.

ADVERTISEMENT

* రిస్ట్ వాచ్

ఈమధ్య కాలంలో మొబైల్ ఫోన్స్ వాడకం ఎక్కువ కావడంతో..  సమయం కోసం ఇంట్లో గోడ గడియారం వైపుకి చూడడం లేదా చేతికి ఉండే రిస్ట్ వాచ్‌ని అప్పుడప్పుడు చూసే అవకాశం పెద్దగా కనపడడం లేదు.

 

* స్మైలింగ్ కేక్

కేక్ కోసి ఏదైనా సందర్భాన్ని పండగలా జరుపుకోవడం అనేది సర్వసాధారణం. అందులోనూ ఇంకేదైనా విశేషముంటే, ఆ ఉత్సాహం అనేది పదింతలవ్వడం ఖాయం. ఎందుకే నేడు ఏ పార్టీ, ఫంక్షన్‌లోనైనా.. కేక్ కోస్తూ సెలబ్రేట్ చేసుకోవడం ఒక ఆనవాయతీగా వస్తోంది. నేడు కేక్స్ అనేవి స్మైలీస్ స్టైల్‌లో కూడా రూపొందుతున్నాయి. ప్రధానంగా ఈ కేక్ పై.. రకరకాల ఎమోజీస్‌ని ఏర్పాటు చేయడంతో వీటికంటూ ఒక ప్రత్యేకత అనేది ఏర్పడింది. 

* మెటల్ కీ-చెయిన్

వివిధ డిజైన్లతో కీ చెయిన్స్ చేయించి బహుమతిగా ఇవ్వడం చాలా అరుదు. కానీ ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలైంది. మనం కూడా మనకు నచ్చిన వ్యక్తులకు వారికి నచ్చే చిత్రాలు, కొటేషన్స్ మొదలైనవి కీ చెయిన్స్ పై.. డిజైన్ రూపంలో చేయించి.. గిఫ్ట్‌గా ఇవ్వచ్చు.  

ADVERTISEMENT

* డైరీ మిల్క్ చాకోలెట్ కలెక్షన్

మీ అమ్మాయి ‘చాకోలెట్స్’ చూస్తే.. మూడ్ ఆఫ్ నుండి బయటికొచ్చేస్తుంది అనే నమ్మకం మీకు ఉందా? అదే గనుక నిజమైతే.. ఈ డాటర్స్ డే సందర్భంగా.. ఆమెకిష్టమైన డైరీ మిల్క్ చాకోలెట్స్‌ని ఇచ్చి ఖుషి చేయండి.

* లిప్ స్టిక్

లిప్ స్టిక్ అనేది అమ్మాయిలు చాలా ఇష్టంగా కొనుక్కునే వస్తువులలో ఒకటి. అయితే రకరకాలైన బ్రాండ్స్, కలర్స్‌లో ఈ లిప్ స్టిక్స్ అనేవి మార్కెట్‌లో లభ్యమవుతాయి. అందుకే.. మీ అమ్మాయి అభిరుచిని బట్టి ఆమె మెచ్చే లిప్ స్టిక్‌ని బహుమతిగా ఇవ్వండి.

* ఐ షాడో పెన్సిల్

మన ముఖంలో బాగా ఆకర్షించేవి నయనాలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి నయనాలని ఇంకాస్త అందంగా తీర్చిదిద్దడానికి.. ఐ షాడో పెన్సిల్‌ని ఉపయోగిస్తుంటారు. అందంగా ఉన్న కళ్ళని మరింత అందంగా చూపించే ఈ ఐ షాడో పెన్సిల్‌ని కూడా బహుమతిగా ఇవ్వచ్చు.

* బార్బీ కేక్

బార్బీ డాల్ అంటే ఇష్టపడనివారుండరు. అటువంటిది ఆ బార్బీ డాల్ రూపంలోనే తయారుచేసిన కేక్‌ని కూడా అదే స్థాయిలో ఇష్టపడతారు. మీ అమ్మాయి గనుక బార్బీ డాల్ ఫ్యాన్ అయితే.. ఈ బార్బీ డాల్ కేక్‌ని గిఫ్ట్ గా ఇవ్వండి.

ADVERTISEMENT

* డైరీ

డైరీ… ఇది మనకి ఒక రిఫరెన్స్ బుక్‌లా పనిచేస్తుంది. ఎందుకంటే మన జీవితంలో జరిగిన సంఘటనలని ఒక చోట రాసుకుని.. మళ్ళీ తరువాత ఎప్పుడైనా నెమరువేసుకోవడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగా  చుట్టూ ఉన్నవారితో కలవలేని వారికి.. ఈ డైరీ ఓ చక్కటి నేస్తంలా పనికొస్తుంది.

* టెడ్డి బేర్ బొకే

అమ్మాయిలు అమితంగా ఇష్టపడే వాటిలో టెడ్డి బేర్ కూడా ఒకటి. అటువంటి టెడ్డి బేర్‌ని ఒక బొకే రూపంలో మీ అమ్మాయికి బహుమతిగా ఇస్తే.. ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇవండీ.. డాటర్స్ డే సందర్భంగా మీ ముద్దుల కూతుళ్లకి.. మీరు ఇవ్వగలిగే బహుమతులు.

బెస్ట్ స్లీపింగ్ పొజిషన్స్ & వాటి వల్ల కలిగే ప్రయోజనాలు..!

ADVERTISEMENT

ఓ అమ్మగా.. కూతురి మనుసులో ఏముందో తెలుసా..? అయితే ఈ కానుకలు ఇచ్చేయండి

ఒక తల్లికి కూతురు పుట్టిందంటే ఒక స్నేహితురాలు పుట్టినట్టే అని అంటారు. ఎందుకంటే కూతురికి ఒక వయసు వచ్చాక.. తన మొదటి స్నేహితురాలు అమ్మే అవుతుంది. అమ్మ చేతిలోనే కూతురు జీవితం ఉంటుంది. అంతలా ప్రతీ కూతురి జీవితంపై తల్లి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఇక డాటర్స్ డే సందర్భంగా.. ఒక తల్లి తన కూతురికి ఇవ్వగలిగే బహుమతులు ఏమిటో మనమూ తెలుసుకుందామా..!

* ఫోటో ఫ్రేమ్

తల్లీకూతుళ్ళ అనుబంధానికి గుర్తుగా.. వారు దిగిన ఫోటోలలో.. ఒక దానిని చక్కగా  ఫోటో ఫ్రేమ్‌లో కట్టించుకొని.. వారి ఇంటిలో ఎప్పటికి చెరిగిపోని ఒక జ్ఞాపకంగా మలచుకోవచ్చు. ఈ డాటర్స్ డే సందర్భంగా ఈ బహుమతి చాలా బాగుంటుంది.

 

* ఫ్లేమ్ లెస్ క్యాండిల్స్

అందమైన క్యాండిల్స్‌ని బహుమతిగా ఇస్తే.. దానిని వెలిగించడం ద్వారా ఆ క్యాండిల్ కరిగిపోతుంది. అయితే అదే ఫ్లేమ్ లెస్ క్యాండిల్స్ ఇస్తే.. అది ఒక ఎలక్ట్రానిక్ క్యాండిల్ కాబట్టి ఎప్పటికి మనతోనే ఉంటుంది. ఇది కూడా మీ కూతురికి ఇవ్వగలిగే బహుమతి.

ADVERTISEMENT

* వుడ్ ఫ్రేమ్

రకరకాల కొటేషన్స్‌తో.. మీ కూతురికి మంచి వుడ్ ఫ్రేమ్‌ని గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. అదే సమయంలో ఇది ఒకవేళ పొరపాటున కిందపడినా ఇబ్బందేమీ లేదు. చెక్కుచెదరకుండా ఉంటుంది. మంచి మంచి కొటేషన్స్‌ని ఈ వుడ్ ఫ్రేమ్ పై డిజైన్ చేయించి.. మీరు మీ అమ్మాయికి బహుమతిగా ఇవ్వచ్చు.

* జ్యూవెలరీ బాక్స్

ఆడవాళ్లు తాము బాగా ఇష్టపడే జ్యువెలరీని ఒక చోట భద్రంగా పెట్టుకోవడానికి.. ఈ జ్యువెలరీ బాక్స్ ఉపయోగపడనుంది. దీనిని మీరు మీ అమ్మాయికి కానుకగా ఇవ్వచ్చు. మరి ముఖ్యంగా చదువుకునే వారికి, ఉద్యోగం చేస్తూ వేరే చోట్ల ఉన్న వారికి.. ఈ బహుమతి చాలా బాగా ఉపయోగపడుతుంది.

* మేకప్ బ్రష్ సెట్

ఏదైనా ఫంక్షన్‌‌కి వెళ్లాలంటే తమ మనసుకి నచ్చే విధంగా సిద్దమవ్వాల్సిందే. అలా సిద్ధమవ్వాలి అంటే – సరైన మేకప్ సామాన్లు అందుబాటులో ఉండాలి. మరి ముఖ్యంగా మేకప్ వేసుకోవడానికి ఉపయోగించే మేకప్ బ్రషెస్ తప్పనిసరి. మేకప్‌ని ఆ బ్రష్‌తో వేస్తేనే, ముఖం పైన అనుకున్న విధంగా లేయర్ వస్తుంది. మేకప్ బ్రష్ సెట్‌ను చాలా మంచి బహుమతిగా పరిగణించవచ్చు.

* లిప్ గ్లాస్ సెట్

ముఖంలో కళ్ళతో పాటుగా.. ఎదుటివారిని ఆకర్షించే మరో భాగం పెదాలు. ఆ పెదాలు ఇంకాస్త మెరుస్తూ ఉంటే మన ముఖం కూడా వెలిగిపోతుంటుంది అని అంటారు. అందుకనే చాలామంది అమ్మాయిలు లిప్ గ్లాస్‌ని వాడడం జరుగుతుంది. ఈ క్రమంలో లిప్ గ్లాస్‌ను కూడా.. ఒక మంచి బహుమతిగా చూడవచ్చు.

ADVERTISEMENT

* ఐ పెన్సిల్

కను రెప్పల అందాన్ని పదింతలు చేయడానికి ఉపయోగపడే ‘ఐ పెన్సిల్’ కూడా అమ్మాయిలకి ఇవ్వదగిన బహుమతే! ఎందుకంటే ఈ కాస్మెటిక్ ద్వారా.. మన కనురెప్పలని షార్ప్‌గా కనిపించేలా చేయవచ్చు. అలాగే ముఖంలో అందరికి బాగా కనిపించే కళ్ళని మరికాస్త అందంగా చూపెట్టవచ్చు.

* జార్ కేక్

మీ అమ్మాయికి ఇష్టమైన కేక్‌ని రెండు జార్స్‌లో (గాజు గ్లాసెస్)  వేసి ఇస్తే.. వారి ఆనందానికి అడ్డుండదు. ఎందుకంటే ఒక పక్కన వారికి నచ్చిన ఫ్లేవర్ కేక్.. మరోపక్క చూడచక్కని జార్స్ ఒకే బహుమతితో లభిస్తాయి. ఈ బహుమతిని.. మీరు మీ అమ్మాయికిస్తే వారు కచ్చితంగా ఇష్టపడే అవకాశముంది.

* హ్యాండ్ మేడ్ చాకోలెట్ విషెస్

చాకోలెట్స్‌ని ఇష్టపడని వారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. మీ అమ్మాయి గనుక చాకోలెట్స్ ఇష్టపడే ఎక్కువశాతం మందిలో ఉంటే.. మీరు బయట దొరికే చాకోలెట్స్ కాకుండా.. స్వయంగా మీ చేతితో చాకోలెట్స్‌ని చేసి వాటిని కూడా బహుమతిగా ఇవ్వచ్చు. ఎందుకంటే, ఎప్పుడు చూసినా కూడా బయట దొరికే చాకోలెట్స్ కొనుక్కోవడం కన్నా కూడా.. మనం సొంతంగా తయారు చేసుకున్న చాకోలెట్స్ చాలా రుచిగా కూడా ఉంటాయి.

* కాఫీ మగ్

ప్రతిరోజు ఉదయం లేవగానే  మీరు తాగే కాఫీ.. మీకు ఆ రోజంతా శక్తినిస్తుంది. అదే సమయంలో మీ అమ్మాయి మీరు బహుమతిగా ఇచ్చిన కాఫీ మగ్‌లో రోజూ కాఫీ తాగితే.. తనకు లభించే ఆ మజాయే వేరు కదా.  మీ అమ్మాయి ప్రతి రోజును  మీతోనే మొదలు పెట్టినట్లు ఉంటుంది. తనకు ఒక ఇమోషనల్ ఫీలింగ్‌ను కూడా కలిగిస్తుంది. 

ADVERTISEMENT

* పట్టీలు

పట్టీలు ఒక ఆడపిల్లకి ఎంతో అందాన్నిస్తాయి. తన కాళ్ళ అందాన్ని రెట్టింపు చేస్తాయి. నడుస్తుంటే ఘల్లు ఘల్లుమంటూ శబ్దం చేస్తూ.. ఒక తెలుగింటి ఆడపడుచు వస్తుందనే భావాన్ని కలిగిస్తాయి. అతి తక్కువ బరువు‌తో లభించే పట్టీలు అమ్మాయిల కాళ్ళ అందాన్ని మరింత పెంచుతాయి.

* పర్సనలైజ్డ్ పిల్లో (or) కుషన్

మన బెడ్‌రూంలో ఉండే ప్రతి వస్తువు శుభ్రంగా, ఆకట్టుకునే విధంగా, ప్రశాంతత భావన కలిగే విధంగా ఉంటే.. మనకి చాలా హాయిగా నిద్రపడుతుంది. అలా మనం నిద్రకి ఉపక్రమించే ముందు.. మన పక్కనే ఉండే పిల్లో లేదా కుషన్ కూడా చాలా అందంగా ఉన్నట్లయితే ప్రశాంతంగా నిద్ర పోవచ్చు. మన నిద్రకి సంబంధించి అంతగా ప్రభావం చూపే పిల్లో లేదా కుషన్ పై.. మీ అమ్మాయి బొమ్మ కనుక LED లైట్ ప్రింట్‌తో వేయించి ఇస్తే.. అది వారికి ప్రతిరోజు గుర్తొచ్చే బహుమతిగా ఉంటుంది.

ఇవండీ.. ఒక తల్లి తన కూతురికి.. డాటర్స్ డే సందర్భంగా ఇవ్వగలిగే బహుమతులు, వాటి వివరాలు

తన బంగారు తల్లికి.. డాడీ ఇచ్చే బహుమతులు చాలా స్పెషల్

ఒక కూతురు పుట్టగానే ఒక తండ్రి కూడా పుడతాడు. అలాగే ఆ కూతురి బాగోగులు చూస్తూ.. జీవితంలో ఎటువంటి కష్టం రాకుండా, చక్కటి దారిలో నడిపించే గైడ్‌గా తనకు ఆ తండ్రి అండగా నిలుస్తాడు. అటువంటి తండ్రి .. డాటర్స్ డే సందర్భంగా తన కూతురికి ఇవ్వదగిన బహుమతుల గురించి మనమూ తెలుసుకుందామా

ADVERTISEMENT

* కొటేషన్ బుక్

జీవితంలో మనం ముందుకి సాగాలంటే.. కొన్ని తప్పకుండా పాటించాల్సిన విషయాలు ఉంటాయి. వాటిని సవివరంగా రాసి.. ఆ కొటేషన్ పుస్తకాన్ని మీ అమ్మాయికి బహుకరించవచ్చు. ఎందుకంటే ఆమెకి జీవితంలో ఏదైనా ఎదురుదెబ్బ తగిలితే.. అప్పుడు ఎలా ఆ పరిస్థితిని అదుపు చేయాలి..? అనేది ఈ కొటేషన్స్ బుక్ ద్వారా తెలుసుకోవచ్చు.

* బ్రేస్ లెట్

మగవారికి ఉండే పెద్ద బ్రేస్ లెట్స్ కాకుండా.. కేవలం మహిళలు లేదా అమ్మాయిల చేతికి సరిపోయేలా ఈ వస్తువులని తయారు చేయడం విశేషం. ఈ బ్రేస్ లెట్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉండడంతో పాటుగా.. తేలిక బరువుతో ఉంటున్న కారణంగా వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. 

* పూలకుండీ లేదా పూల మొక్కలు

చాలామంది అమ్మాయిలకి మొక్కలు అంటే ఇష్టం. అందులోనూ పూలు పూసే మొక్కలు అంటే మరీ ఇష్టం. ఇక ఈ డాటర్స్ డే సందర్భంగా మీ గారాల పట్టికి ఒక మంచి పూలకుండీని లేదా పూలమొక్కను బహుమతిగా ఇవ్వండి.

* గ్రీటింగ్ కార్డ్

గ్రీటింగ్ కార్డ్ చాలా సాధారణమైన బహుమతి అనుకుంటారు. కానీ ఆ గ్రీటింగ్ కార్డులో ఉండే భావం సరిగ్గా ఒక తండ్రి తన కూతురుకి ఏం చెప్పాలనుకున్నాడో.. దాన్ని ప్రతిఫలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది.  ఐడియా కొంచెం పాతదే అయినా.. ఇది మీకు  కచ్చితంగా పనికొస్తుంది.

ADVERTISEMENT

* సాఫ్ట్ టాయ్ (పాండా)

సాఫ్ట్ టాయ్స్‌కి ఈ మధ్య కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. మరి ముఖ్యంగా టెడ్డి బేర్, పాండా టాయ్స్‌కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ పాండా టాయ్‌కి ఆడపిల్లల్లో మంచి క్రేజ్ కూడా ఉంది. మీ అమ్మాయి కూడా ఈ పాండాకి ఫ్యాన్ అయితే.. మీరు కచ్చితంగా ఓ పాండా బొమ్మ కొనివ్వండి.

* చాకొలేట్ బాక్స్

ఏదైనా సంతోషకర విషయాన్ని నలుగురితో పంచుకునే సమయంలో.. వారి నోరు తీపి చేయడమనేది జరుగుతుంటుంది. అలానే మీ గారాలపట్టి చిన్నారి తల్లికి.. డాటర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ చాకొలేట్ బాక్స్‌ని బహుమతిగా ఇస్తే.. తను కూడా చాలా సంతోషిస్తుంది కదా.

* వెండి పట్టీలు

సిల్వర్ యాంక్ లెట్స్‌ని (వెండి పట్టీలు) అమ్మాయిలు సహజంగానే ఇష్టపడతారు. ఒకప్పుడు ఈ వెండి పట్టీలకి మంచి క్రేజ్ ఉండేది. కానీ తరువాతి కాలంలో వీటికి బాగా ఆదరణ తగ్గింది. ఏమైందో ఏమో తెలియదు కాని.. మరోసారి ఈ వెండి పట్టీలకి ఆదరణ లభిస్తోంది. వీటిని మీ అమ్మాయికి బహుమతిగా ఇస్తే.. ఇక వారు ఆ విషయాన్ని ఎప్పటికి మరిచిపోరు.

* హ్యాండ్ బ్యాగ్

హ్యాండ్ బ్యాగ్స్‌‌కి & ఆడవారికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే తమవద్ద ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నప్పటికి కూడా.. మరొకటి కొత్తది కొనుక్కుంటే బాగుంటుందనే ఆలోచన సహజంగానే ఉంటుంది. అందుకనే తమ కూతురికి నచ్చిన హ్యాండ్ బ్యాగ్‌ని బహుమతిగా ఇస్తామంటే.. వెంటనే ‘ఐ లవ్ యు డ్యాడీ’ అంటూ అరిచి గోల చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.

ADVERTISEMENT

* చెవి పోగులు

స్టడ్స్ లేదా చెవి పోగులు కూడా రకరకాలైన రంగుల్లో, ఆకారాల్లో మార్కెట్‌లో విరివిగా లభిస్తున్నాయి. ఇంతకముందు ఒక స్టడ్స్ పెయిర్ పెట్టుకుంటే.. అది ఎన్నో రోజులకు గాని తీసేవారు కాదు. కాని ఇప్పుడు  సందర్భానికి తగ్గట్టుగా.. స్టడ్స్ పెట్టుకోవడం వంటివి చూస్తున్నాం. అందుకే మీ అమ్మాయి అభిరుచికి తగ్గట్టుగా స్టడ్స్ బహుమతిగా ఇస్తే.. వారు ఎంతగానో ఆనందపడతారు.

* సిప్పర్

ఆఫీస్‌లో తీవ్రమైన పని ఒత్తిడిలో ఉన్న సమయంలో.. కాస్త బ్రేక్ తీసుకున్నప్పుడు టీ లేదా కాఫీ తాగాలని అనిపించడం సహజం. మన వద్ద ఉన్న సిప్పర్ సహాయంతో మనకి కావాల్సినంత మొత్తంలో టీ లేదా కాఫీ ని తీసుకోవచ్చు. ఈ సిప్పర్‌ని గనుక మీ అమ్మాయికి ఇస్తే, తనకి ఉపశమనం కలిగించే ఈ సిప్పర్‌ని చూసినప్పుడల్లా మీరే గుర్తుకు వస్తారు.

* షూస్

లైఫ్‌లో ఫిట్‌గా ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. శరీరం ఫిట్‌గా ఉంటే ఆలోచనలు సైతం ఆరోగ్యకరంగా ఉంటాయి. వాటితో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే మీ అమ్మాయి ఫిట్‌గా ఉండేందుకు కసరత్తులు చేస్తుంటే.. అందుకు ఉపయోగపడే మంచి షూస్‌ని బహుమతిగా ఇవ్వండి. ఈ బహుమతి ద్వారా.. మీ అమ్మాయి ఫిట్‌గా ఉండేందుకు కూడా మీ బహుమతి ఉపయోగపడుతుంది.

* హెడ్ సెట్

మీ అమ్మాయి సంగీతం వినడానికి ఆసక్తి చూపుతుందా? అయితే మీ అమ్మాయి హాయిగా ఎక్కడైనా సంగీతం వినగలిగేలా.. ఒక మంచి హెడ్ సెట్‌ని బహుమతిగా ఇస్తే.. అది ఆమె అభిరుచిని గౌరవించినట్టు అవుతుంది. అదే సమయంలో ఆమెకి ఒక మంచి బహుమతి ఇచ్చినవారవుతారు కూడా.

ADVERTISEMENT

డాటర్స్ డే సందర్భంగా తల్లిదండ్రులందరూ.. తమ కుమార్తెలకు ఎలాంటి బహుమతులు ఇస్తే బాగుంటుందో తెలుసుకున్నాం కదా. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఈ బహుమతుల పై ఓ లుక్కేయండి మరి..! 

ఈ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. సందేశాలు.. మీ కోసమే..

05 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT