ఉదయాన్నే సెక్స్ చేయడం ఎందుకు మంచిదో.. మీకు తెలుసా?

 ఉదయాన్నే సెక్స్ చేయడం ఎందుకు మంచిదో.. మీకు తెలుసా?

సెక్స్ (Sex).. మనల్ని ఆరోగ్యంగా.. ఆనందంగా ఉండేలా చేసే మంత్రం అది. మీ బంధాన్ని కూడా దగ్గర చేస్తుంది. సెక్స్‌లో ఎన్నో రకాలు.. ఎన్నో భంగిమలు ఉన్నాయి. అయితే సెక్స్ చేయడానికి సరైన సమయం అనేది ఒకటి ఉందంటే.. అది ఉదయమే అని చెప్పవచ్చు. ఉదయం పూట (Morning) చేసే సెక్స్ చాలా అద్భుతంగా ఉంటుందట.

ఉదయాన్నే మనం మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి పక్కన నిద్ర లేవడం.. రాత్రంతా కౌగిలించుకొని ఉన్న ఆ వ్యక్తితో ఆనందంగా సెక్స్‌లో పాల్గొనడం వల్ల.. ఆ  రోజంతా ఆనందంగా, ఉల్లాసంగా ఉంటుందట. అలాగే మనం ప్రతి ఛాలెంజ్‌కి సిద్ధం అయ్యేలా కూడా చేస్తుందట. ఇవే కాదు.. ఉదయాన్నే సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అవేంటంటే..

1. రోజును ఆనందంగా మారుస్తుంది.

ఉదయాన్నే సెక్స్ చేస్తూ రోజును ప్రారంభించడం వల్ల.. ఆ తర్వాత రోజంతా మీరు నవ్వుతూ ఉండిపోతారు. ఉదయాన్నే జరిగిన సెక్స్ గురించి ఆలోచిస్తూ ఆనందపడతారు. ఉదయాన్నే అద్భుతమైన సెషన్‌తో రోజును ప్రారంభిస్తే చాలు.. ఆ రోజు కూడా అంతే అద్భుతంగా గడుస్తుంది. 

2. హార్మోన్లు సూపర్..

సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఆక్సిటోసిన్, డోపమైన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఉదయాన్నే సెక్స్‌లో పాల్గొనడం వల్ల.. ఈ ఫీల్ గుడ్ హార్మోన్లు మరిన్ని విడుదలై మీరు రోజంతా ఆనందంగా ఉండేలా చేస్తాయి.

3. ఉదయాన్నే మంచి వర్కవుట్

చాలామందికి ఉదయాన్నే జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడం అలవాటు. ఇంకొందరు జాగింగ్‌కి వెళ్తుంటారు. కానీ వాటన్నింటి కంటే ముందే.. మీ వర్కవుట్ మీరు పూర్తి చేయవచ్చు. అదీ మీ బెడ్ రూంలోనే.. అవును.. సెక్స్ వల్ల కండలు పెరుగుతాయి. క్యాలరీలు కరుగుతాయి.

4. ఎక్కువ సమయం

ఉదయం లేవగానే మగాళ్ల శరీరంలో.. టెస్టోస్టిరాన్ స్థాయులు పెరుగుతాయి. ఆడవారికి మూడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇద్దరూ సెక్స్‌లో పాల్గొని.. అత్యంత ఆనందాన్ని పొందే వీలుంటుంది. సెక్స్ కూడా చాలా ఎక్కువ సేపు సాగుతుంది.

5. కాఫీ అవసరమే లేదు..

కొంత మంది నిద్రపోయి ఉదయాన్నే లేవగానే.. కడుపులో కాఫీ పడితే తప్ప ఆ మత్తు వదలదు. కానీ సెక్స్‌లో పాల్గొనడం వల్ల.. ఆ మత్తు వదలడంతో పాటు ఉదయాన్నే కావాల్సినంత శక్తి కూడా అందుతుంది.

6. కష్టం చాలా తక్కువ..

సాధారణంగా రాత్రి పూట సెక్స్‌‌లో పాల్గొనాలంటే.. ముందు ఫోర్ ప్లేతో ప్రారంభించాలి. కానీ ఉదయాన్నే సెక్స్‌లో పాల్గొంటే మాత్రం ఇవన్నీ ఏమీ ఉండవు.  ఉదయాన్నే ఇద్దరూ మూడ్‌లో ఉంటారు.. కాబట్టి చాలా వేగంగానే సెక్స్‌లో కూడా పాల్గొంటారు. 

7. స్నానం కూడా చేయచ్చు..

సాధారణంగా సెక్స్ తర్వాత.. స్నానం చేయడం చాలామందికి ఇష్టం. ఎందుకంటే సెక్స్‌లో భాగంగా చెమట, శరీర ద్రవాలు వంటివన్నీ స్రవిస్తాయి. కాబట్టి స్నానం చేసి.. మళ్లీ నీట్‌గా తయారవ్వాలని చాలామంది భావిస్తారు. ఉదయాన్నే సెక్స్ చేయడం వల్ల.. తర్వాత స్త్రీ, పురుషులిద్దరూ ఒకేసారి స్నానం చేసే వీలు కూడా ఉంటుంది.

8.అనుకోని అద్భుతం

చాలామంది ఉదయాన్నే సెక్స్‌లో పాల్గొనాలంటే.. శరీరం నుంచి వచ్చే చెమట వాసన, నోటి దుర్వాసన గురించి ఆలోచిస్తారు. కానీ ఉదయం లేవగానే.. అనుకోకుండా సెక్స్ చేయడంలోని మజా తెలిస్తే.. వారికి ఇవి చాలా చిన్న అంశాలుగా కనిపిస్తాయి.

9. ప్రేమను చాటేలా..

ఇద్దరూ మీ మధ్య ప్రేమ చిగురించాలనుకుంటే చాలు.. రాత్రి, పగలు, ఉదయం అన్న తేడా ఏమీ ఉండదు. ఎప్పుడు సెక్స్ చేసినా.. అది మీ బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది.

ఈ ఉదయం పూట సెక్స్ కేవలం కొత్తగా పెళ్లయిన వారికి మాత్రమే కాదు.. జీవితంలో అన్ని దశల్లో ఉన్న జంటలకూ పనికొస్తుంది. పిల్లలున్న జంటలకైతే మరీనూ. ఉదయాన్నే పిల్లలు గాఢ నిద్రలో ఉంటారు కాబట్టి.. ఏమాత్రం అంతరాయం లేకుండా మీరు సెక్స్ చేసే వీలుంటుంది.

ఉదయాన్నే పడే సన్నని సూర్యకిరణాల వెలుగులో ఒకరినొకరు చూసుకుంటూ.. ఆనందంగా సెక్స్‌లో పాల్గంటే ఆ థ్రిల్ వేరుగా ఉంటుంది. అందుకే మీకు  ఇప్పటివరకూ ఇది అలవాటు లేకపోతే.. ఓసారి ప్రయత్నించి చూడండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.