వెండితెరపైనే కాదు.. వెబ్ సిరీస్‌లతోనూ ఆకట్టుకుంటున్నారీ హీరోయిన్లు..!

వెండితెరపైనే కాదు.. వెబ్ సిరీస్‌లతోనూ ఆకట్టుకుంటున్నారీ హీరోయిన్లు..!

గతంలో సినీ పరిశ్రమలో కొత్త కథానాయికలుగా (Heroines) పరిచయమయ్యే వారికి నటించే అవకాశం తక్కువగానే ఉండేది. కాలం మారుతున్న కొద్దీ వాళ్లు కూడా ఫైట్లు, స్టంట్లు చేయడం ప్రారంభించారు. నటనకు అవకాశం ఉన్న సినిమాలు, హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు రావడం కూడా ఎక్కువయ్యాయి. అయితే ఇప్పుడు హీరోయిన్లు కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. వెబ్ సిరీస్‌లలోనూ (Web series) నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ట్రెండ్‌కి తగ్గట్లుగా తామూ మారుతూ అభిమానులకు దగ్గరవుతున్నారు.

తాజాగా టాలీవుడ్ అందాల కథానాయిక సమంత నెట్ ఫ్లిక్స్‌‌లో ఓ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలొచ్చాయి. శర్వానంద్ చేతి గాయంతో '96' సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన సమంత ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో నటిస్తోందట. ఇందులో ఆమె తన పాత్ర కోసం ఫైట్లు, స్టంట్స్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫిట్ నెస్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది సమంత. అయితే ఇలా వెబ్ సిరీస్‌లో నటించిన కథానాయికల్లో సమంత మొదటి వ్యక్తి కాదు.. మరికొందరు హీరోయిన్లు కూడా తన దారిలో ఇంతకుముందే నడిచారు. వారి గురించి తెలుసుకుందాం రండి..

1. నీహారిక కొణిదెల

Facebook

తెలుగులో వెబ్ సిరీస్ ట్రెండ్ ప్రారంభమైందే నీహారిక కొణిదెల హీరోయిన్‌గా నటించిన "ముద్దపప్పు ఆవకాయ" సిరీస్తో. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌‌లో నటించిన తర్వాతే.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నీహారిక. 'ఒక మనసు' సినిమాలో నటించిన తర్వాత.. 'నాన్న కూచి' అంటూ మరో వెబ్ సిరీస్‌‌లో తండ్రి నాగ బాబుతో కలిసి కనిపించింది. దీనికి కూడా ప్రణీత్ దర్శకత్వం వహించడం విశేషం.

2. తేజస్వి

Facebook

తేజస్వి తెలుగు సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్, చెల్లెలు పాత్రల్లోనే కాకుం..డా ఐస్ క్రీం వంటి చిత్రాల్లో కథానాయికగా కూడా కనిపించింది. వీటన్నింటి కంటే "బిగ్ బాస్ 2"లో పార్టిసిపెంట్‌గా మంచి పేరు సాధించిందీ నాయిక. ప్రస్తుతం జీ హీరోస్‌లో పాల్గొంటున్న తేజస్వి కూడా.. 'మన ముగ్గురి లవ్ స్టోరీ' పేరుతో రూపొందిన ఓ వెబ్ సిరీస్‌‌లో నటించింది. ఇందులో నవదీప్, కేశవ్ దీపక్‌లు ఆమె బాయ్ ఫ్రెండ్స్‌గా నటించారు. ఇద్దరు అబ్బాయిలను ప్రేమించా..క తన గురించి తాను పూర్తిగా తెలుసుకునే ఓ కన్ఫ్యూజ్డ్ అమ్మాయి పాత్రలో తేజస్వి ఇందులో కనిపిస్తుంది. దీనికి స్వప్నా దత్ నిర్మాతగా వ్యవహరించగా.. శశాంక్ యేలేటి దర్శకత్వం వహించారు.

3. కియారా అద్వానీ

Facebook

'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ కియారా అద్వానీ. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోందీ భామ. గతంలో నెట్ ఫ్లిక్స్ షో 'లస్ట్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్‌లో నటించింది కియారా. మేఘ అనే అమ్మాయి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది ఆమె. 'లస్ట్ స్టోరీస్'లో కియారా నటించిన భాగానికి కరణ్ జోహర్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు 'గిల్టీ' అనే మరో వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది కియారా.

4. రాధికా ఆప్టే

Facebook

అటు తెలుగు, ఇటు హిందీ చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోన్న.. రాధిక ఆప్టేను నెట్ ఫ్లిక్స్ క్వీన్ అని పిలుస్తారు అభిమానులు. సినిమాల్లాగే వరుసగా వెబ్ సిరీస్‌లు చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకోవడం దీనికి కారణం. 'లస్ట్ స్టోరీస్'లో  కాళింది అనే స్త్రీ పాత్రలో కనిపించిన.. ఆమె ఎక్స్ పాస్ట్ ఈజ్ ప్రజెంట్, మ్యాడ్లీ, ఘౌల్ వంటి వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. ఇప్పుడు సేక్రెడ్ గేమ్స్ సిరీస్‌‌లోనూ నటిస్తోందీ బ్యూటీ. ఇవే గాక.. ఎన్నో యూట్యూబ్ వీడియోల్లోనూ నటించి ఆకట్టుకుంది.

5. శాన్వి

Facebook

ఎన్నో తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో నటించి అలరించిన లవ్లీ హీరోయిన్ శాన్వి చైనీస్ వెబ్ సిరీస్‌లో ఓ ప్రధాన పాత్రలో కనిపించింది. పదకొండు ఎపిసోడ్ల 'డార్క్ లార్డ్' అనే వెబ్ సిరీస్‌లో ఏడు ఎపిసోడ్లలో శాన్వి కనిపించింది. చైనాలో ఎంతో పేరు సాధించిన షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ టోంపెల్ దర్శకత్వంలో.. ఈ వెబ్ సిరీస్ రూపొందింది. చైనీస్ చక్రవర్తితో ప్రేమలో పడిన భారతీయ యువరాణిగా శాన్వి కనిపించింది. ముందు ఈ పాత్ర కోసం సన్నీ లియోనీని తీసుకుందామనుకున్నా.. శాన్వి ముఖంలో పలికే భావాలను గమనించి ఆమెను ఎంపిక చేశారట.

6. దియా మీర్జా

Facebook

జీ 5 వెబ్ సిరీస్‌లో పాకిస్థానీ మహిళగా కనిపిస్తోంది హైదరాబాదీ భామ దియా మీర్జా. కాఫిర్ అనే పేరుతో కొనసాగుతోన్న.. ఈ వెబ్ సిరీస్‌లో అనుకోని పరిస్థితుల్లో భారత్‌కి చేరుకొని.. ఇక్కడి నుంచి తిరిగి వెళ్లడానికి అవకాశం లేని ఓ తల్లిగా ఆమె కనిపిస్తుంది. మిలిటెంట్‌‌గా పేరు పడిన ఓ మహిళ.. ఆమె కోసం లాయర్‌గా మారిన ఓ జర్నలిస్ట్ మధ్య సాగే కథ ఇది.

7. వైష్ణవి సౌందరాజన్

Facebook

సుమంత్ హీరోగా 'నరుడా డోనరుడా' సినిమాకి దర్శకత్వం వహించిన మాలిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరీస్ పెళ్లి గోల. ఇది రెండు సిరీస్‌లుగా విడుదలైంది. ఇందులో వైష్ణవి సౌందరాజన్ హీరోయిన్‌గా నటించి అందరినీ ఆకట్టుకుంది. ఒక పల్లెటూరి బ్యాక్ గ్రౌండ్‌లో నడిచే కథ ఇది. తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి తప్పించుకోవాలని ప్లాన్ చేసే అబ్బాయి, అమ్మాయి.. ఈ క్రమంలో ఎలా ప్రేమలో పడ్డారు అన్నదే ఈ వెబ్ సిరీస్ కథ. వియు ఒరిజినల్స్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ అద్భుతమైన వ్యూస్‌ను సంపాదించుకుంది.

వీరిలో పాటు నటి ధన్యా బాలక్రిష్ణన్ 'పిల్లా' అనే వెబ్ సిరీస్లో, బాలీవుడ్ బ్యూటీలు నేహా ధూపియా, మనీషా కోయిరాలా, భూమి పెడ్నేకర్‌లు నెట్ ఫ్లిక్స్‌లోని లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకున్నారు. మరో కథానాయిక ఫ్లోరా సైనీ కూడా ఎన్నో హిందీ, ఇంగ్లిష్ వెబ్ సిరీస్‌లలో నటించి పేరు సాధించింది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగుఇంగ్లీషుహిందీమరాఠీతమిళంబెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.