మీ జీవితంలో సెక్స్.. ఎలాంటి మార్పులను తీసుకొస్తుందో తెలుసా?

మీ జీవితంలో సెక్స్.. ఎలాంటి మార్పులను తీసుకొస్తుందో తెలుసా?

సెక్స్ (sex).. రోజంతా అలసిపోయిన శరీరానికి స్వాంతననిస్తుంది. అలసిన మనసుకు ఆనందాన్ని అందిస్తుంది. అయితే సెక్స్‌‌ని మీ రోజువారీ జీవితానికి జోడిస్తే ఎన్నో మార్పులు మీకు తెలియకుండానే జరిగిపోతాయి. పెళ్లి తర్వాత రోజూ (daily) సెక్స్‌లో పాల్గొనేవారిలో ఈ మార్పులు తప్పక కనిపిస్తాయి అంటున్నారు నిపుణులు. ఈ మార్పు కేవలం మీ ఇద్దరి మధ్యనున్న బంధంలోనే కాదు.. మీలోనూ కనిపిస్తుంది. మీరు లోపలి నుంచి ఆనందంగా, అందం‌గా కనిపించడం వల్ల మీ జీవితంలో ఆనందం పెరిగిపోతుంది. అసలు రోజూ సెక్స్‌లో పాల్గొనడం వల్ల మీ జీవితంలో వచ్చే మార్పులేంటంటే..

1. అవాంఛిత రోమాలా? ఎక్కడ?

giphy

రోజూ సెక్స్‌లో పాల్గొంటుంటే.. అందంగా కనిపించాలనే కోరికతో ఎప్పటికప్పుడు కాళ్లు, చేతులపైనే కాదు.. అన్ని భాగాల్లోనూ వ్యాక్సింగ్ చేయడం రొటీన్‌లో భాగంగా మారిపోతుంది. మీరు ఇంతక ముందు మిమ్మల్ని చూడనంత అందంగా మీరు రోజూ కనిపించేందుకు ప్రయత్నిస్తారు.

2. మీ కోసం సమయం

సెక్స్‌‌లో రోజూ పాల్గొనడం వల్ల మిమ్మల్ని మీరు అందంగా చూపించుకోవడం, చూసుకోవడం కోసం మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకుంటారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు కూడా. ఇంతకుముందెప్పుడూ మీ గురించి తీసుకోనంత శ్రద్ధ సెక్స్‌లో ఆనందంగా పాల్గొంటున్నప్పుడు మీకు కలుగుతుంది.

3. ఎంతో ప్రశాంతత..

giphy

సెక్స్‌లో రోజూ పాల్గొనడం వల్ల మీ అందం పెరుగుతుంది. దీని వల్ల చర్మం మెరిసిపోవడమే కాదు.. మీరు లోపలి నుంచి అందంగా కనిపిస్తారు. దీనివల్ల మీ ఆత్మవిశ్వాసం కూడా చాలా పెరుగుతుంది. ఒకవేళ మీ భాగస్వామి మిమ్మల్ని వదిలేసినా.. అందులో మీ కంటే వారికే ఎక్కువ నష్టం జరుగుతుందని మీరు నమ్ముతారు. ఎందుకంటే మీలాంటి అందమైన వ్యక్తికి వారి కంటే మంచి వ్యక్తి దొరుకుతాడు.

4. ఫిట్‌నెస్ పై శ్రద్ధ..

సెక్స్‌‌లో రోజూ పాల్గొనడం వల్ల మిమ్మల్ని మీరు అందంగా, ఆరోగ్యంగా చూడాలనుకుంటారు. అందుకే మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ సరైన సమయంలో తినడం, పడుకోవడం, వ్యాయామ సూత్రాలను పాటించడం వంటివి చేస్తూ ఫిట్‌గా తయారవుతారు. వీటన్నింటితో పాటు రెగ్యులర్‌‌గా సెక్స్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. ఎందుకంటే అది కూడా ఓ మంచి వ్యాయామం లాంటిదే కదా..

5. ఆనందం పెరుగుతుంది..

giphy

రోజూ ఇష్టంగా సెక్స్‌లో పాల్గొనేవారు చాలా ఆనందంగా ఉంటారని చాలా పరిశోధనల్లో తేలింది. పరిశోధనల వరకూ ఎందుకు.. మీకు ఇష్టమైన వారితో రోజూ రొమాన్స్ చేయడం వల్ల మీరే రిలాక్స్‌డ్‌గా ఫీలవుతారు. మీలో ఆనందం పెరుగుతుంది. దీనికి కారణం హ్యాపీ హార్మోన్లు. అవి మీరు ఆనందంగా ఉన్నప్పుడు విడుదలవుతాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

6. రెగ్యులర్ పిరియడ్స్..

మీరు పిరియడ్స్ గురించి చాలా శ్రద్ధ వహిస్తారు. అంతేకాదు.. మీ పిరియడ్స్ కూడా రెగ్యులర్‌గా రావడం ప్రారంభమవుతుంది. మీరు పిల్లలను కనాలనే ఆలోచన చేసే వరకూ.. మీ పిరియడ్స్ ప్రతి నెలా మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాయి.

7. లవ్ గురు అయిపోతారు..

giphy

మీరు మీ బంధంలో ఎంతో ఆనందంగా ఉంటారు. కాబట్టి మీ స్నేహితులు మిమ్మల్ని తమ జీవితంలోని వివిధ సమస్యలకు సంబంధించిన సలహాలు అడుగుతూ ఉంటారు. వారు చెప్పకపోయినా వారిని చూసి.. వారి జీవితంలో ఏదో సమస్య ఉందని మీరు చెప్పే వీలు కూడా ఉంటుంది.

8. బంధం బలపడుతుంది..

దంపతుల మధ్య రోజూ సెక్స్‌లో పాల్గొనేంత దగ్గరితనం ఉంటే.. వారు చాలా దగ్గరగా ఉన్నట్లే. అయితే ఇలా రోజూ సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఆ దంపతులు ఇద్దరూ మరింత దగ్గరవుతారు. సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఒకరి గురించి మరొకరు ఎక్కువగా తెలుసుకునే వీలుంటుంది. కాబట్టి సెక్స్ వల్ల బంధం కూడా బలంగా మారుతుంది.

9. పాజిటివిటీ పెరుగుతుంది..

giphy

సెక్స్‌లో పాల్గొనడానికి.. మీ అందం పెరగడానికి మధ్య బంధం ఏంటో అర్థం కావట్లేదా? సెక్స్‌లో పాల్గొనడం వల్ల మీరెప్పుడూ ఆనందంగా ఉంటారు. కాబట్టి మీ ఆనందం మీ ముఖంలోనూ ప్రతిబింబిస్తుంది. కాబట్టి మీరు ఆనందంగా, అందంగా ఉంటారు. అంతేకాదు.. సెక్స్‌‌లో ఆనందం పొందడం అనేది మీరు జీవితాన్ని చూసే పద్ధతిని కూడా మార్చేస్తుంది. మీ ఆలోచనలను పాజిటివ్‌గా మార్చేసి మీ జీవితంలో పాజిటివిటీని పెంచుతుంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ ఫుల్ గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.