సెక్స్‌కి సంబంధించిన ఈ విషయాలు.. స్త్రీలు తప్పనిసరిగా తెలుసుకోవాలి..!

సెక్స్‌కి సంబంధించిన ఈ విషయాలు.. స్త్రీలు తప్పనిసరిగా తెలుసుకోవాలి..!

(Surprising Sex Facts related to Women)

సెక్స్ విషయంలో.. పురుషులు వ్యక్తం చేసినట్లు స్త్రీలు తమ కోరికలను బయటకు వెల్లడించలేరు. వారిలా ఓపెన్‌గా మాట్లాడలేరు కూడా. అయితే దీని అర్థం వారు సెక్స్ రహస్యాలను, సూత్రాలను తెలుసుకోకూడదని మాత్రం కాదు. మన జీవితం ఆనందంగా ఉండాలంటే.. మన సెక్స్ జీవితం కూడా ఆనందంగా ఉండాలి. సైకాలజిస్టులు ఎవరికైనా ఇదే విషయాన్ని చెబుతారు.

అయితే సెక్స్ జీవితం ఆనందంగా ఉండాలంటే.. దాని గురించి పూర్తిగా తెలుసుకొని తీరాలి. అందుకే ప్రతి మహిళ పెళ్లయ్యాక.. సెక్స్‌కి ముందు తెలుసుకోవాల్సిన విషయాలను గురించి చర్చిద్దాం. వీటిని తెలుసుకోవడం వల్ల.. మీరు ఇంతకుముందు కంటే మీ భాగస్వామికి మరింత దగ్గరవుతారు. ఈ విషయాలలో చాలావరకూ మన గురించి.. అదేనండీ స్త్రీలు సెక్సువల్‌గా ఎంజాయ్ చేయడం గురించే ప్రస్తావించాం.  మరి స్త్రీలకు సెక్స్ పట్ల ఆసక్తిని పెంచే.. ఈ వివరాలను మీరు కూడా సరదాగా చదివేయండి.

1. ముద్దులు పెట్టాలనే కోరిక

Giphy

సాధారణంగా సెక్స్ పూర్తి కాగానే మగవారు నిద్రపోవడానికి ఆసక్తి చూపిస్తే.. స్త్రీలు మాత్రం తమ భాగస్వామికి దగ్గరగా ఉండాలనుకుంటారట. మగవారితో పోల్చితే స్త్రీలు ఎక్కువ ఎమోషనల్ కాబట్టి.. సెక్స్ తర్వాత తమ భాగస్వామిని కౌగిలించుకోవడానికి.. ముద్దు పెట్టడానికి ప్రయత్నిస్తారట. అలా తమ ప్రేమను చాటుతారన్నమాట.

2. అందంగా కనిపించాలని..

Giphy

సాధారణంగా అందంగా కనిపించాలని కోరుకోని అమ్మాయిలు ఎవరూ ఉండరు. కానీ సెక్స్ సమయంలో మాత్రం వారు ఎలా కనిపిస్తున్నారు.. సెక్సీగా ఉన్నారా? లేదా? భాగస్వామికి తాము నచ్చుతామా? లేదా? అని చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటారట.

అందుకే సెక్సీగా కనిపించడం కోసం.. వివిధ రకాల ఇన్నర్ వేర్‌లు వేసుకోవడంతో పాటు.. రకరకాల పోజులివ్వడం చేస్తుంటారు. నెర్వస్‌గా ఫీలైనప్పుడు తమ జుట్టును వేళ్లతో దువ్వుతుంటారు. అంతేకాదు.. చాలామంది సెక్స్ సమయంలో తాము ఎలా కనిపిస్తున్నామన్నది తెలుసుకునేందుకు.. అద్దంలో తమని తాము చూసుకుంటూ ఉంటారు. 

3. పిరియడ్ సెక్స్ అంటే ఇష్టం..

Giphy

దాదాపు 90 శాతం మంది స్త్రీలు పీరియడ్స్ సమయంలో.. సెక్స్ చేయడానికి ఇష్టపడుతుంటారట. దీనికి కారణం ఆ సమయంలో మహిళల శరీరంలో విడుదలయ్యే హార్మోన్లే. అంతే కాదు.. ఈ సమయంలో సెక్స్ వల్ల నొప్పి దూరమై ఆనందాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు కాబట్టి.. చాలామంది దాన్ని కోరుకుంటారట. అయితే అనేకమంది ఇలా చేయడాన్ని తప్పుగా భావిస్తారు. అలా తప్పుగా భావించి కోరికను అణచివేసుకుంటే.. కొంతమంది మాత్రం భాగస్వామితో మాట్లాడి తమకు నచ్చిన విధంగా జీవిస్తారట.

4. సమ్మర్ సెక్స్ సూపర్ జోడీ

Giphy

ఓ పరిశోధన ప్రకారం స్త్రీలు శీతాకాలం, వర్షాకాలం కంటే.. వేసవి కాలంలోనే ఎక్కువగా సెక్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారట. వేసవిలో చెమటతో పాటు.. భాగస్వామిని నగ్నంగా చూడడం వంటివన్నీ వారిని సెక్స్‌లో పాల్గొనేందుకు ప్రోత్సహిస్తాయట.

5. ప్రతి ఒక్కరివీ వేరు..

Giphy

ప్రతి మహిళ వక్షోజాల షేప్, సైజ్ రెండూ.. మిగిలిన స్త్రీలతో పోల్చితే వేరుగా ఉంటాయట. అందుకే మగవాళ్లు వాటిని ముట్టుకోవడం వల్ల కలిగే ఫీలింగ్స్ కూడా వేరుగా ఉంటాయి. కొందరికి ముట్టుకుంటే నొప్పిగా అనిపిస్తే.. మరికొందరు సంతోషంగా ఫీలవుతారు.

6. దాని పని అంతవరకే..

Giphy

మహిళల్లో యోని ముఖద్వారం వద్ద క్లిటోరిస్ అనే భాగం ఉంటుంది. వారు సెక్స్ సమయంలో ఆనందం పొందేందుకు.. అది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ భాగం పని కేవలం ఆనందాన్ని అందించడం మాత్రమే.

7. సైజ్ ముఖ్యం కాదు..

Giphy

సాధారణంగా ఎంతో మంది పురుషులు.. తమ పురుషాంగం సైజ్ తక్కువగా ఉందని బాధపడుతుంటారు. కానీ సైజ్ అన్నది పెద్ద విషయం కాదని చాలా పరిశోధనల్లో తేలింది. చాలామంది స్త్రీలు సెక్స్‌కి ముందు ఫోర్ ప్లే, సెక్స్ సమయంలో భాగస్వామి వ్యవహార శైలిని బట్టి వారిని ఇష్టపడతారే కానీ.. సైజును బట్టి కాదట.

8. నిద్రలోనూ ఫీలవుతారు..

Giphy

చాలామంది స్త్రీలు ఒకవేళ కలలో సెక్స్‌లో పాల్గొన్నట్లు ఫీలైతే.. నిద్రలోనూ వారు ఆర్గాజమ్ పొందే వీలుంటుందట. ఈ సమయంలో యోని కండరాలు బిగుసుకుపోవడం, వదులుగా మారడం వంటివి జరగడం వల్ల.. వారు కూడా ఆనందాన్ని పొందుతారట.

9. ఆర్గాజమ్ వారికే ఎక్కువ..

Giphy

సాధారణంగా సెక్స్‌లో పాల్గొన్నప్పుడు.. పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువగా ఆర్గాజమ్ వస్తుంటుందట. ఓ సర్వే ప్రకారం ఆడవారిలో ఆర్గాజమ్ పది నుంచి పదిహేను సెకన్ల పాటు ఉంటే.. మగవారిలో అది కేవలం ఆరు సెకన్లు మాత్రమే ఉంటోందట. అయితే చాలామంది మహిళలకు తాము ఆర్గాజమ్ ఫీలవుతున్నామంటే.. అది సెక్స్‌లో పొందే ఆనందమే అన్న విషయం కూడా అర్థం కాదట.

10. వయసుతో పాటు పెరుగుతుంది..

Giphy

వయసు పెరుగుతూ ఉంటే సెక్స్ కోరికలు తగ్గుతాయన్నది అబద్ధం. నిపుణులు చెప్పేదాన్ని బట్టి చూస్తే.. దీనికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగే అవకాశాలూ ఉన్నాయి. సెక్స్‌లో కలిగే ఆనందం.. వయసును బట్టి పెరుగుతూ ఉంటుందట. నలభై ఏళ్లకు పైబడిన వారు.. తమ కంటే తక్కువ వయసున్న వారితో పోల్చితే ఎక్కువగా.. వేగంగా ఆర్గజమ్ స్థాయికి చేరుకుంటారట.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.