'న్యాచురల్ స్టార్ నాని - అంజన'ల.. న్యాచురల్ ప్రేమకథ మీకు తెలుసా!!

'న్యాచురల్ స్టార్ నాని - అంజన'ల.. న్యాచురల్ ప్రేమకథ మీకు తెలుసా!!

న్యాచురల్ స్టార్ నాని (Nani).. కెరీర్ ప్రారంభించిన అనతి కాలంలోనే పెద్ద హీరోలతో సమానంగా రాణించిన నటుడు. వయసు భేదం లేకుండా చిన్నపిల్లాడి దగ్గర నుండి ముసలివాళ్ళ వరకు తనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే అతని యాక్టింగ్ చూస్తుంటే.. మన పక్కింటి కుర్రాడు లేదా మన ఇంటి అబ్బాయిలాగే వెండితెర పై కనిపిస్తుంటాడు. ఇదీ పబ్లిక్ టాక్. అందుకే అతనికి అన్ని తరాల వారి నుండి ఆదరణ లభిస్తోంది. ఆ ఆదరణకు ప్రతిరూపమే నానికి న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్ రావడం.

ఒక సాధారణ రేడియో జాకీగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని... ఆ తరువాత కాలంలో ప్రముఖ దర్శకులు బాపు, రాఘవేంద్ర‌రావు మొదలైనవారి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. కానీ అనుకోకుండా హీరోగా అవకాశం రావడంతో.. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ క్రమంలో "అష్టాచెమ్మా" చిత్రం ద్వారా వచ్చిన అదృష్టాన్ని అవకాశంగా మార్చుకుని.. అందరిచేత న్యాచురల్ స్టార్ నాని అనిపించుకున్నాడు.

దర్శక ధీరుడు రాజమౌళి - రమా రాజమౌళిల ఆదర్శ ప్రేమకథ మీకు తెలుసా?

ఈయన జీవితంలో కూడా ఒక న్యాచురల్ స్టైల్ లవ్ స్టోరీ ఉంది. ఆయన మనకి వెండితెర పై ఎంత సహజంగా అయితే కనిపిస్తాడో.. అంతే సహజంగా ఆయన ప్రేమకథ కూడా సాగిందట. నాని ప్రేమకథ గురించి సంక్షిప్తంగా మనం కూడా తెలుసుకుందామా..

హీరోగా నాని నిలదొక్కుకున్న తొలిరోజుల్లో.. తన స్నేహితుడికి కజిన్ వరసైన అంజనా యలవర్తితో స్నేహం ఏర్పడింది. అయితే వారిద్దరూ పరిచయమైన తొలిరోజుల్లో.. ఒకరంటే ఒకరికి ఇష్టమున్నప్పటికీ ఆ ప్రస్తావనను ఎప్పుడూ తీసుకురాలేదట. 

అయితే కొన్నాళ్ళకి నాని తన న్యాచురల్ స్టైల్‌లో అంజనాకి (Anjana) ప్రపోజ్ చేయడం.. ఆమె వెంటనే ఒప్పుకోవడం జరిగిపోయాయి. కానీ తొలినాళ్లలో మాత్రం హీరోగా ఎదుగుతున్న నాని... తన ప్రేమ విషయాన్ని బయటకి చెప్పుకోలేకపోయాడు. చిత్రమేంటంటే.. తొలిసారిగా ఆయన ప్రేమ వ్యవహారం ప్రజలకి తెలిసింది ఒక టాక్ షో ద్వారా. సదరు టాక్ షో వ్యాఖ్యాత మంచు లక్ష్మి ఈ విషయాన్ని ప్రస్తావించడమే కాకుండా ఆ ఫోటోని సైతం బయటపెడతాను అని కొంచెం సేపు కంగారు పెట్టగా.. నాని రిక్వెస్ట్ చేయడంతో ఆ పని చేయలేదామె.

ఇక వీరి ప్రేమకథ గురించి చెప్పుకోవాలంటే చాలానే ఉంది. ఎవ్వరికి తెలియకుండా హైదరాబాద్‌‌లో ఈ ఇద్దరు చక్కర్లు కొట్టేవారట. అలాగే ఒక ప్రముఖ ఎఫ్ఏం ఛానల్‌‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్న తరుణంలో అంజనాని పిక్ చేసుకోవడానికి.. నాని ఆ ఎఫ్ఏం ఛానల్ బయట పడిగాపులు కాసేవావడట. ఈ  విషయాన్ని కూడా వారిద్దరి సన్నిహితులు ఆ తరువాత తెలపడం జరిగింది. వెండితెర పై ఎన్ని హీరో పాత్రలు చేసినా... నిజ జీవితంలో మాత్రం.. ఒక సహజమైన రీతిలోనే వీరి ప్రేమ వ్యవహారం సాగింది అని చెప్పక తప్పదు.

కృష్ణవంశీ - రమ్యకృష్ణల ప్రేమ చిగురించడానికి.. కారణమైన పాటేమిటో మీకు తెలుసా?

ఎవరి జీవితంలోనైనా పరిచయం, స్నేహం, ప్రేమ అనే చాఫ్టర్లు ముగిశాక వచ్చే అధ్యాయం పెళ్లి. వీరి పెళ్లి ఇరు పెద్దల సమక్షంలో కన్నులపండుగగా జరగడం విశేషం. ఒక సాధారణ స్థాయి నుండి హీరోగా ఎదిగిన క్రమంలో నాని.. తన స్నేహశీలతతో ఇండస్ట్రీలో ఎందరో మిత్రులను సంపాదించుకున్నారు. ఆయన వివాహానికి చిత్రపరిశ్రమ నుండి ఎందరో హాజరయ్యారు. ఇక నాని - అంజనాల నిశ్చితార్ధం వీడియోకి.. అప్పట్లో చాలా పెద్ద క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే అలాంటి ఎంగేజ్‌మెంట్ వీడియోల కల్చర్ అంత పాపులర్ అవ్వలేదు. అందుకనే 2012లో ఆ  వీడియో టాక్ అఫ్ ది టౌన్‌గా మారింది.

ఇక నాని - అంజనల వివాహం 2012లో జరిగింది. వీరి ప్రేమకథను (Love Story) చూస్తే... ఎక్కడా కూడా ఛేజింగులు,  ఫైటింగులు & పెద్ద ట్విస్టులు కనపడవు. మనం చాలా వరకు బయట చూసే సహజమైన ప్రేమకథల మాదిరిగానే న్యాచురల్ స్టార్ నాని & అంజనాల ప్రేమకథ ఉందనిపిస్తుంది.

ఏదేమైనా... వీరి ప్రేమకి కానుకగా అర్జున్ 2017లో జన్మించడం జరిగింది. ఇక ఈమధ్యనే నాని నటించిన జెర్సీ చిత్రంలో అతను పోషించిన పాత్రకి అర్జున్ అనే పేరునే పెట్టడం కొసమెరుపు.

'మిస్ ఇండియా'ను ప్రేమించిన 'మిస్టర్ పర్ఫెక్ట్'.. మహేష్, నమ్రతల అద్భుత ప్రేమకథ మీకు తెలుసా?