ADVERTISEMENT
home / Astrology
01  నవంబరు 2019 (శుక్ర వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

01 నవంబరు 2019 (శుక్ర వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (01  నవంబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు మీరు ముందుగా పెండింగ్ లో ఉన్న పనిని పూర్తిచేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు కొత్త పనిని ప్రారంభించలేరు. ఈ రోజు ఓ కొత్త కాంట్రాక్ట్ పై సంతకాలు చేస్తారు. కండరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒంటరిగా సమయం గడిపేందుకు మీరు ప్రాధాన్యమిస్తారు. 

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు మీ పని చాలా నెమ్మదిగా సాగుతుంది. ఇతరులతో పని చేయించడం మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వారిని మీరు విమర్శిస్తారు కూడా. చేసిన పనిలో కొన్ని తప్పుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులు వేరే పనుల్లో బిజీగా ఉంటారు కాబట్టి వారిపై ఆధారపడడం మంచిది కాదు. మీ బాధలన్నీ స్నేహితులతో పంచుకోండి.

మిథున రాశి  (Gemini) – ఈ రోజు మీ పని చాలా ఎక్కువగా ఉన్నా ఫలితం మాత్రం పెద్దగా దక్కదు. నిర్ణయాలు తీసుకోవడంలో మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాల్లో మాత్రం ఇతరులు మీకు తోడ్పాటు సహకారం అందిస్తారు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇతరుల సమస్యలకు మిమ్మల్ని బాధ్యులుగా భావించి బాధపడకండి.

ADVERTISEMENT

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు మీరు మీ ఆలోచనల వేగాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దానివల్ల మీరు చేసే పని వేగం తగ్గిపోతుంది. పని ప్రదేశంలో ఇతరులతో గొడవలు పెట్టుకోకండి. మానసికంగా ఒత్తిడికి గురవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. 

సింహ రాశి  (Leo) – ఈ రోజు మీరు పని విషయంలో చిన్న అంశాలపైనా ఫోకస్ పెట్టండి. పని వేగంగా పూర్తి చేయాలని కంగారు పడినా.. చిన్న చిన్న విషయాల్లో తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీ ఆలోచనల్లో స్పష్టత వల్ల పని వేగంగా చేయగలుగుతారు. మీరు అనుకున్న రీతిగా పనులు సాగుతాయి. కడుపు నొప్పి వల్ల నిద్రలేమి, అలసట బాధిస్తాయి. కుటుంబ సభ్యులు వారి పనుల్లో బిజీగా ఉంటారు. స్నేహితులను కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. 

ADVERTISEMENT

తుల రాశి (Libra) – ఈ రోజు మీరు వేరే పనుల్లో బిజీగా ఉండడం వల్ల పనులు నెమ్మదిగా సాగుతాయి. పనిపై శ్రద్ధ పెట్టడానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది. అయితే మీకు మీరు కాస్త విశ్రాంతిని అందించుకొని తర్వాత ప్రయత్నించి చూడండి. ఈ రోజు ఒక బంధం తెగతెంపులు చేసుకోవాల్సి వస్తుంది. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీ పని ఆనందంగా సాగుతుంది. కొత్త ప్రాజెక్టులు, క్లైంట్లతో డీల్స్ మీ సొంతమవుతాయి. కొత్త ఉద్యోగాల కోసం వేచి చూసే వారికి ఈ రోజు కలిసొస్తుంది. కుటుంబంతో ఆఖరి నిమిషంలో వేసుకునే ప్లాన్లు మీకు ఆనందాన్ని అందిస్తాయి. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) – ఈ రోజు మీరు చాలా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. పని చాలా ఎక్కువగా ఉన్నా.. ఫోకస్ లేకపోవడం వల్ల కొత్త ఆలోచనలు రావు. ఇతరుల అభిప్రాయాలను తీసుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. చాలా ఎక్కువ పనుల వల్ల మీకు ఏం చేయాలో అర్థం కాదు. 

ADVERTISEMENT

మకర రాశి  (Capricorn) – ఈ రోజు మీరు చాలా బిజీగా ఉంటారు. మీ నైపుణ్యాలు బయట పెట్టే అవకాశం లభిస్తుంది. మీకు అన్నింటిపై క్లారిటీ ఉంటుంది కాబట్టి నిర్ణయాలు కూడా సులువుగా తీసుకోగలగుతారు. కుటుంబంలోని పెద్దలతో చిన్న తగాదా ఏర్పడవచ్చు. ఇతరుల సలహాలు కోరుకుంటారు.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) –  ఈ రోజు మీ పని నెమ్మదిగా సాగుతుంది. అయితే ఆగిపోయిన ప్రాజెక్టుల గురించి మీకు సమాచారం అందుతుంది. రాత్రికి రాత్రే పని పూర్తవ్వాలని భావించకండి. కుటుంబ సభ్యులతో సహనంతో వ్యవహరించండి. వారి మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తించండి. స్నేహితులు పని విషయంలో మీ సలహాలు కోరుకుంటారు.

మీన రాశి  (Pisces) – ఈ రోజు మీ పని ఇబ్బందిగా సాగుతుంది. మీ షెడ్యూల్ పై దాని ప్రభావం పడుతుంది. పెండింగ్ పనులు పూర్తిచేసేందుకు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. కుటుంబ సభ్యులతో ఏర్పడే ఇబ్బందులను తొలగించుకోవడానికి కుటుంబ సభ్యులతో ఓపెన్ గా మాట్లాడుకోవడం మంచిది. 

ADVERTISEMENT

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.

31 Oct 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT