18 అక్టోబరు 2019 (శుక్ర వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

18 అక్టోబరు 2019 (శుక్ర వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (18 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు మీరు మీ ఆలోచనలను అమల్లో పెట్టి ఫలితాలను వెంటనే చూస్తారు. మీతో పాటు పనిచేసేవాళ్లు మీకు చాలా సహకారం అందిస్తారు. అయితే పని ప్రారంభించడం.. పూర్తి చేయడం రెండిట్లో బ్యాలన్స్ కొనసాగించండి. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు బాధలో ఉంటారు కాబట్టి కుటుంబంలో కాస్త ఒత్తిడి ఉంటుంది.

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు మీ లోపల ఉన్న శక్తిని బయటకు తీసేందుకు ప్రయత్నించండి. కొత్త పని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినా.. మీకున్న పనుల వల్ల దాన్ని చేయడానికి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఆఫీస్ పని చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీరు స్నేహితులతో గడిపే సమయాన్ని మరోరోజుకి మార్చుకోవాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులు మీ పరిస్థితి అర్థంచేసుకొని సపోర్ట్ చేస్తారు. 

మిథున రాశి  (Gemini) – ఈరోజు మీరు చేసే ఏ పనీ మీకు సత్పలితాలను అందించదు. పని ప్రదేశంలో అందరి పట్ల మీరు అసంతృప్తితో ఉంటారు. అయితే ఇతరుల తప్పులను ఎత్తిచూపడం ఆపేయండి. కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది. గతవారం మీరెంతో ఒత్తిడికి గురయ్యారు. ఆ తర్వాత మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం వల్ల ఆ ఒత్తిడి తగ్గిపోతుంది. 

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు మీ పని చాలా బ్యాలన్స్ డ్ గా సాగుతుంది. పని ప్రదేశంలో మీ కొలీగ్ తో కాస్త ఇబ్బంది మిమ్మల్ని బాధపెట్టినా.. మీ పనిని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు. కుటుంబ సభ్యులు మీకు సపోర్టివ్ గా ఉంటారు. స్నేహితులు మీకు బిజినెస్ ఐడియాలు చెప్పి మిమ్మల్ని విసిగిస్తారు. 

సింహ రాశి  (Leo) – ఈ రోజు మీరు కొత్త క్లైంట్స్ తో కొత్త ప్రాజెక్ట్ పై పనిచేస్తారు. మీరేం చేయాలనుకున్నా ముందు దానికోసం ఓ ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేసుకోవడం మంచిది.  వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత బాధపడే అవకాశాలుంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. బయటకు వెళ్లి ఇతరుల కోసం జీవించడం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. మీ కుటుంబ సభ్యులు వారితో మీ బంధం గురించి మాట్లాడతారు. కాస్త శ్రద్ధగా వినడం మంచిది. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మీలోని శక్తినంతా వ్యర్థం చేసే వ్యక్తుల నుంచి దూరంగా ఉండడం నేర్చుకుంటారు. కొత్త ప్రాజెక్టు గురించి ప్లానింగ్, తొలుత చేయాల్సిన పనులు చేయడం వంటివి ప్రారంభిస్తారు. ఇతరులిచ్చే సలహాలు తీసుకోవడం మంచిదే.. పని ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ గంటలు ఆఫీస్ లోనే ఉండిపోవాల్సి వస్తుంది. కుటుంబంతో సమయం గడపలేరు. 

తుల రాశి (Libra) – ఈ రోజు మీ ఆలోచనలను బయటకు చెప్పాల్సిన అవసరం వస్తుంది. మీ కమ్యునికేషన్ స్కిల్స్ పై మీరు కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు. కానీ ఈరోజు దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీ ఆలోచనల కంటే ఫలితాలు వేగంగా రావడమే మీ చుట్టూ ఉన్నవారికి అవసరం. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. ఇంటి సభ్యుల్లో అభిప్రాయ బేధాల వల్ల గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీ కొత్త ఐడియాలను కార్యరూపంలోకి తీసుకొస్తారు. కొత్తవారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. అయితే తలనొప్పులు, కండరాల నొప్పులు ఉండడం వల్ల ఆరోగ్యం గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆహారం సరిగ్గా తీసుకోండి. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. స్నేహితులు మీ సలహాల కోసం మీ దగ్గరికి వస్తారు. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు మీరు ఇతరులతో ఉన్న గొడవలను తగ్గించే దిశగా పనిచేయాల్సి ఉంటుంది. మీ గొడవలు పనిలో ఇబ్బందులు కలిగిస్తాయి. అందుకే గొడవ తగ్గించేందుకు మీ ప్రయత్నం మీరు చేయండి. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. అయితే దగ్గరి స్నేహితులతో గొడవ వల్ల మనసు బాధకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. 

మకర రాశి  (Capricorn) – ఈ రోజు మీరు మానసికంగా చాలా అలసిపోయినట్లుగా ఫీలవుతుంటారు. ఇది మీ కెరీర్, కుటుంబ జీవితం రెండింటి పై ప్రభావం చూపుతుంది. అయితే రోజు కొనసాగనివ్వండి. మీరు అన్ని సార్లు అన్నింటినీ కంట్రోల్ చేయలేరని గుర్తుంచుకోండి. ఇతరులను సంతోషపర్చేందుకు మిమ్మల్ని మీరు నిరాశపర్చుకోవడం సరికాదు. తగినంత విశ్రాంతి తీసుకోండి. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈ రోజు మీరు కొత్త ఆలోచనలతో నిండి ఉంటారు. అయితే పనిలో కాస్త ఇబ్బంది ఎదురవ్వచ్చు. ఈ రోజు మొత్తం పని ఉంటుంది కానీ అవన్నీ సజావుగా జరిగిపోతాయి. గతంలో చేసిన పనికి మీకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. పాత స్నేహితులను కలుస్తారు. 

మీన రాశి  (Pisces) – ఈ రోజు మీరు చేసే పనులు కొనసాగే తీరును బట్టి మీరు అసంతృప్తితో ఉంటారు. అయితే దీని కోసం బయట వాళ్లను తప్పబట్టడం వదిలేసి మీలో మీరు కారణం వెతుక్కోవడానికి ప్రయత్నించండి. మీరు పనిలో ఆర్గనైజ్డ్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. స్నేహితులతో గొడవలు పెట్టుకోకండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.