21 అక్టోబరు 2019 (సోమ వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

21 అక్టోబరు 2019 (సోమ వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (21 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు పనిలో ఆలస్యం మీ షెడ్యూల్ ని తారుమారు చేస్తుంది. పని ఒత్తిడి ఎక్కువవుతుంది. కుటుంబానికి కూడా సమయం కేటాయించాల్సి రావడం వల్ల గొడవలు తలెత్తుతాయి. అభిప్రాయ బేధాలున్నప్పుడు పరుషమైన పదాలు ఉపయోగించకండి. తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీ స్నేహితుల ఆరోగ్యం గురించి కంగారు పడతారు. 

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు అనుకోకుండా మీకు అందిన ఓ బాధ్యత మిమ్మల్ని మరింత ఆత్మవిశ్వాసంతో నిండేలా చేస్తుంది. అయితే అందరి శ్రేయస్సు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది.

మిథున రాశి  (Gemini) – ఈ రోజు మీ జీవితంలోకి ఏదో కొత్త శక్తి వచ్చినట్లుగా ఆనందంగా ఫీలవుతుంటారు. ఓ కొత్త ఉద్యోగం లేదా ప్రాజెక్ట్ కి ఈరోజు పునాది పడుతుంది. కానీ టైమింగ్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో జాగ్రత్త. కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయండి. బయటకు వెళ్లేందుకు అలసటగా ఉంటుంది. 

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు మీ ఆలోచనలకు, చేతలకు సంబంధం ఉండేలా చూసుకోండి. కానీ మీతో పాటు పనిచేసేవారు మీ నిర్ణయాలను అనుమానిస్తారు. కానీ మీరు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. కుటుంబ సభ్యులు మీతో మాట్లాడేందుకు ఆసక్తి చూపిస్తారు. దీని వల్ల ఎప్పటినుంచో మీ మధ్య ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఓ పాత స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.

సింహ రాశి  (Leo) – ఈ రోజు పని సజావుగా సాగుతుంది. పాత క్లైంట్ల నుంచి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. మీ మార్కెటింగ్ స్కిల్స్ గురించి మీరు పనిచేయాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో అందరితో ఓపెన్ గా ఉండండి. కుటుంబ జీవితం బాగా సాగుతుంది. అయితే మీ పనుల వల్ల వారితో ఎక్కువ సమయం గడపలేరు. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు మీరు ప్రస్తుతం చేస్తున్న పనికి సంబంధించి క్లియరెన్స్ సర్టిఫికెట్, క్లారిటీ రావడం వల్ల పని సజావుగా సాగుతుంది. కొత్త వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. పెండిగ్ బిల్లులు క్లియర్ అవుతాయి. పని ఎక్కువగా ఉండడం వల్ల ఆహారం సమయానికి తీసుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. కుటుంబం, స్నేహితులతో సమయం గడపండి. 

తుల రాశి (Libra) – ఈ రోజు మీ పని చాలా నెమ్మదిగా ప్రారంభమైనా ఆ తర్వాత వేగం పుంజుకుంటుంది. ఇతరులు పని చేసే విధానాన్ని మార్చే ఆలోచనలు మీరు చేస్తారు. అయితే దాన్ని వారితో చెప్పడం వల్ల మీకు మంచి జరుగుతుంది. కుటుంబ జీవితం ఒత్తిడితో కూడి ఉంటుంది. మీలోపల మీరు చెక్ చేసుకొని ఇతరులను క్షమించడం.. పాత విషయాలు వదిలేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. స్నేహితులతో సాయంత్రం ఎంజాయ్ చేస్తారు. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీ పని సజావుగా సాగుతుంది. అయితే అనుకున్నవి అనుకున్నట్లుగా సాగకపోవడం వల్ల మీరు చిరాగ్గా ఉంటారు. ఇతరులు మీ ఆలోచనలను ప్రశ్నిస్తారు. కానీ వాటిని వ్యక్తిగతంగా తీసుకోకండి. కుటుంబ సభ్యులు మీ నుంచి స్పష్టత కోరుకుంటారు కాబట్టి వారితో సమయం గడపండి. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులతో సమయం గడుపుతారు. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు మీరు పనిలో చాలా బిజీగా గడుపుతారు. మీరు చేసే పని కంటే చాలా ఎక్కువగా చేయాల్సి రావచ్చు. డెడ్ లైన్స్ వల్ల ఒత్తిడి ఎక్కువవుతుంది. కానీ ఆఖరులో అది మీకే మంచి చేస్తుంది. కుటుంబ సభ్యులతో సమయం గడపండి. వారి పట్ల మీ కోపాన్ని అలాగే ఉంచుకోవడం కంటే వారి గురించి మంచి విషయాలు ఆలోచించి వదిలేయడం మంచిది. 

మకర రాశి  (Capricorn) – ఈ రోజు పని విషయంలో మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ చుట్టూ ఉన్నవారికి మీరు చేసే పని అర్థం కాకపోవచ్చు. కానీ వారిని కూడా మీరే మోటివేట్ చేయాల్సి ఉంటుంది. మీ పనులకు సంబంధించి స్పష్టత లభిస్తుంది. సమయానికి తినండి. అందరి నుంచి దూరంగా ఉండాలనుకోవడం వల్ల కుటుంబం, స్నేహితులతో సమయం గడపలేరు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈ రోజు మీ పని వేగాన్ని తగ్గించుకోవడం మీ మానసిక ఆనందానికి ఎంతో మంచిది. క్రియేటివ్ గా మీరు ఎక్కువగా ఆలోచించలేరు. ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించి ఒత్తిడికి గురవడం వల్ల ఇలా జరుగుతుంది. సరైన సమయానికి తినడం, విశ్రాంతి తీసుకోవడం అవసరం. మీరొక్కరే సమయం గడపాలనుకుంటారు కాబట్టి కుటుంబం నుంచి దూరంగా గడుపుతారు.

మీన రాశి  (Pisces) – ఈ రోజు ఉదయం మీ పని చాలా ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నానికి కాస్త తగ్గుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆఖరి నిమిషంలో తీసుకునే నిర్ణయాలు మీకు ఆనందాన్ని అందిస్తాయి. మీ కుటుంబ సభ్యులతో సమయం గడుపుతున్నప్పుడు వేరే పనులు చేయకండి. మసాలా ఫుడ్ కి దూరంగా ఉండండి. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.