23 అక్టోబరు 2019 (బుధ వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

23 అక్టోబరు 2019 (బుధ వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (23 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు మీ కుటుంబానికి సంబంధించిన ఒత్తిడి వల్ల పనిలో పెద్దగా శ్రద్ధ పెట్టలేరు. అయితే ఆగిపోయిన పేమెంట్స్ గురించి ఓ సమాచారం మీకు అందుతుంది. ఎక్కువ ఖర్చులు అవడం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో గొడవలు పెట్టుకోకండి. వారు చెప్పిన విషయాలను ఎక్కువగా ఆలోచించి పర్సనల్ గా తీసుకోకండి. స్నేహితులతో సమయం గడపడం వల్ల వారు మిమ్మల్ని తిరిగి సంతోషంగా మార్చేందుకు ప్రయత్నిస్తారు. 

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు పని చాలా అద్భుతంగా సాగుతుంది. ఎన్నో సర్ ప్రైజులు మీకు అందుతాయి. పని ప్రదేశంలో ఉన్నవారు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. ఈ రోజు ప్రాజెక్ట్ కి సంబంధించి పేపర్ వర్క్ పూర్తవుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. భాగస్వామితో సమయం గడుపుతారు. స్నేహితులు బిజీగా ఉండడం వల్ల మీరు ఒంటరిగా ఫీలవుతారు.

మిథున రాశి  (Gemini) – ఈ రోజు మీరు మీ ఆలోచనల వేగాన్ని తగ్గించుకోవడం ఎంతో మంచిది. మీ అంచనాలను మీరు చేరుకోలేకపోతారు కాబట్టి ఇలా చేయడం మంచి పద్ధతి. ఇతరుల బాధ్యతలను కూడా మీరు తీసుకోవాల్సి రావచ్చు. ఎక్కువ గంటలు పని చేయాల్సి రావడంతో అలసిపోవడంతో పాటు ఇంట్లోనూ గొడవలు అవుతాయి. ఇతరుల అంచనాలను మీరు చేరుకోలేకపోవడం వల్ల మీ సోషల్ లైఫ్ సజావుగా సాగదు.

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఆత్మవిశ్వాసంతో చేయాల్సి ఉంటుంది. ఇతరులు చెప్పిన విషయాలు వింటూ మీరేం చేయాలో మర్చిపోతున్నారు. అది మానేయాలి.  ఓ ముఖ్యమైన మీటింగ్ వాయిదా పడుతుంది. పేపర్ వర్క్ ని జాగ్రత్తగా చూసుకోండి. పని ఒత్తిడి వల్ల మీరు చిరాగ్గా ఫీలవుతారు. స్నేహితులు, కుటుంబంతో సాయంత్రాలు కూడా బిజీగా గడుపుతారు. పాత స్నేహితులను కలుస్తారు. 

సింహ రాశి  (Leo) – ఈ రోజు మీరు ఎక్కువగా మాట్లాడడం మంచిది. మీరు మీ జీవితంలో అన్ని అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పని నెమ్మదిగా సాగుతుంది. అయితే వేగంగా చేయాలని మరీ ఎక్కువ కష్టపడొద్దు. దీనివల్ల మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టండి. స్నేహితులతో కలవాలని ప్లాన్ చేసుకున్నా ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకుంటారు. 

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు పని సజావుగా సాగుతుంది. కానీ మీరు మానసికంగా బాధలో ఉండడం వల్ల పనిపై దృష్టి  పెట్టలేరు. ఇతరుల సలహాలు, సూచనలు తీసుకోవడంలో మరింత ముందుండండి. ఆర్థిక విషయాల గురించి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకొని సహకారం అందిస్తారు. మీ భాగస్వామి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. ఒంటరిగా సమయం గడిపేందుకు స్నేహితులకు నో చెబుతారు. 

తుల రాశి (Libra) – ఈ రోజు మీ పనిలో ఇబ్బందులు ఎదురై మీరు చాలా పనులు చేయాల్సి వస్తుంది. షెడ్యూల్ లో ఆఖరి నిమిషంలో వచ్చే మార్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మానసికంగా అలసిపోకుండా ఉండేందుకు మీ ఆలోచనల వేగాన్ని తగ్గించుకోండి. ఎక్కువగా ఒప్పుకొని తక్కువ పని చేయడం కంటే తక్కువగానే చెప్పడం మంచిది. పెండింగ్ లో ఉన్న పేపర్ వర్క్ ని మరోసారి చెక్ చేయాల్సి రావచ్చు. కుటుంబ జీవితం సజావుగా సాగుతుంది. కానీ పని ఒత్తిడి వల్ల మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడపలేరు. 

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీ ఆలోచనలు, చేసే పనులు ఒకేలా ఉండేలా చూసుకోవాలి. పనిలో మార్పులు చేసుకునే ముందు మీరు కోరుకుంటున్నదేంటో క్లియర్ గా నిర్ణయించుకోండి. తోటి పనివారితో గొడవలు పెట్టుకోకండి. దీనివల్ల మీరు తర్వాత బాధపడతారు. ఇంట్లోనూ గొడవలు జరుగుతాయి. కానీ దాన్నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. లేదంటే అది మీకు ఇబ్బందికరంగా మారుతుంది. స్నేహితులను కలవడం వల్ల ఈ సమస్యలన్నీ మర్చిపోయే వీలుంటుంది. 

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు మీరు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి కాబట్టి మీరు అలసిపోయినట్లు ఉంటారు కానీ మీరే చొరవ తీసుకొని పనిచేయడం మంచిది. ఈ రోజు పనిలో చాలా సవాళ్లుంటాయి. ఇతరులు మీ ఆలోచనలను అర్థం చేసుకోలేరు. ఈరోజు మీ డబ్బు ఎక్కువగా అందుతుంది. కానీ ఎక్కువ ఖర్చులు చేయడం తగ్గించండి. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. భాగస్వామి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. 

మకర రాశి  (Capricorn) – ఈ రోజు మీరు చేయాల్సిన పని చాలా ఎక్కువగా ఉంటుంది కానీ దాని గురించి సరైన క్లారిటీ మాత్రం ఉండదు. ఏం చేయాలో అర్థం కాదు. అయితే సాయంత్రానికి మీ కుటుంబ సభ్యులు మీ మూడ్ మారుస్తారు కాబట్టి ఆనందంగా ఫీలవుతారు. మీలాగే ఆలోచించే స్నేహితులతోనే సమయం గడుపుతారు. కొత్త వ్యక్తులతో స్నేహం చేస్తారు. 

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈ రోజు మీ పని సజావుగా సాగుతుంది. అయితే ఉద్యోగం మారడం లేదా ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అయితే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి దానికి మంచి, చెడు ఆలోచించుకోవడం తప్పనిసరి. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల్లో కుటుంబ సభ్యులు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. కానీ తర్వాత వాళ్లే అర్థం చేసుకుంటారు. మీ ఆలోచనలను వారిపై రుద్దే ప్రయత్నం చేయకండి. ఓ ఫ్రెండ్ మీ సలహా కోసం మీ దగ్గరికి వస్తారు. 

మీన రాశి  (Pisces) – ఈ రోజు మీకు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే పని వాయిదా పడడం వల్ల మీరు నిరుత్సాహానికి గురవుతారు. ఉదయాన్నే ఎంతో శక్తితో పని  ప్రారంభించినా సాయంత్రానికి మీరు అలసిపోతారు. కానీ ఫ్లెక్సిబుల్ గా ఉండడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతాయి. మీ భాగస్వామి మీకు అండగా నిలుస్తారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మంచి ప్లాన్ చేస్తారు. 

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.