24 అక్టోబరు 2019 (గురు వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

24 అక్టోబరు 2019 (గురు వారం, ఈ రోజు రాశిఫలాలు చదివేయండి)

ఈ రోజు (24 అక్టోబరు, 2019) 12 రాశులకు సంబంధించిన ఫలితాలు, రాశి ఫలాలు (horoscope and astrology) మీకోసం

మేష రాశి  (Aries) – ఈ రోజు మీరు క్రియేటివ్ ఆలోచనలు, ఆ నిర్ణయాలను అమలు పర్చడంలో ముందుకు వెళ్తారు. మీకు అవసరమైన సపోర్ట్ మీకు లభిస్తుంది. అయితే ఒక సమయంలో ఒక అంశంపై ఫోకస్ పెట్టండి. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. మీ భాగస్వామితో వీలైనంత ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

వృషభ రాశి  (Tarus) – ఈ రోజు మీ ఆలోచనల వేగాన్ని తగ్గించండి. పని మామూలుగా సాగుతుంది. మీరు చేసే పని విషయంలో క్లారిటీ రావడం వల్ల దాన్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు కాస్త బద్ధకంగా, మూడీగా ఉండడం వల్ల వారిని మామూలుగా చేసేందుకు మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. మీ స్నేహితులు కూడా మీ సలహాల కోసం వస్తారు. వారి కోసం సమయాన్ని కేటాయించండి.

మిథున రాశి  (Gemini) – ఈ రోజు మీ పని మామూలుగా సాగుతుంది. మీ ఆరోగ్యం అంతగా బాగాలేకపోవడం వల్ల ఈరోజు మీరు చేయాలనుకొని ప్రారంభించిన పనులన్నీ పూర్తిచేయలేరు. కానీ దాని గురించి కంగారు పడకండి. మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. డాక్టర్ ని సంప్రదించడం మంచిది. స్నేహితులు మిమ్మల్ని చూసేందుకు మీ దగ్గరకు వస్తారు.

కర్కాటక రాశి  (Cancer) – ఈ రోజు మీ పని సజావుగా సాగుతుంది. మీ క్రియేటివ్ ఆలోచనలను అమల్లో పెడతారు. పాత క్లైంట్ల నుంచి కొత్త పనులు అందుకుంటారు. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పని గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని వారి సలహాలు తీసుకోండి. ఒంటరిగా కూర్చొని క్రియేటివ్ ఆలోచనల అమలు గురించి ఆలోచిస్తారు.

సింహ రాశి  (Leo) – ఈ రోజు పాత పెండింగ్ పనులు పూర్తి చేయాల్సి రావడంతో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీరు పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. ఇది మీపై ఒత్తిడి పెంచుతుంది. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంటుంది. వారి కోసం మీరు వేచి చూస్తూ ఉంటారు.

ఈ రాశుల్లో పుట్టినవారికి.. రొమాన్స్ అంటే ఎంతో ఇష్టమట..!

క‌న్య రాశి (Virgo) – ఈ రోజు ఆనందంగా సాగుతుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. మీ పని ప్రదేశంలో ఓ సీనియర్ అధికారి మీ ఆలోచనలు ఇష్టపడతారు. మీ స్వేచ్ఛనిచ్చి వాటిని అమల్లో పెట్టేందుకు అవకాశం ఇస్తారు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్తారు. కానీ ఇంట్లో ఉండాలనే కోరికతో అక్కడ ఎంజాయ్ చేయలేరు.

తుల రాశి (Libra) – ఈ రోజు ఇతరులు మిమ్మల్ని వేచి చూసేలా చేస్తారు. అయితే కొత్త పని ప్రారంభం కాకపోతే పెండింగ్ పని పై ఫోకస్ పెట్టండి. ఈరోజు జరగాల్సిన ఓ కాంట్రాక్ట్ మీటింగ్ వాయిదా పడుతుంది. కానీ మీరు నిరుత్సాహానికి గురి కావద్దు. పని ఎక్కువగా ఉండడం వల్ల కుటుంబంతో సమయం గడపలేరు. తోటి పనివారితో బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు.

వృశ్చిక రాశి  (Scorpio) – ఈ రోజు మీ పని సజావుగా సాగుతుంది. ప్రతి పనికీ సమయాన్ని కేటాయించుకొని పనిచేస్తారు. కుటుంబం, స్నేహితులతో కూడా గడుపుతారు. కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కుటుంబంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మీ సలహాలను ఇతరులు కోరుకుంటారు. స్నేహితులతో బయటకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది.

ఓ సారి అలా.. మరోసారి ఇలా.. మకర రాశి అమ్మాయిల తీరు విభిన్నం

ధనుస్సు రాశి (Saggitarius) - ఈ రోజు ఒక సమయంలో ఒక అంశంపై ఫోకస్ పెట్టండి. మీరు ప్రతి పని వేగంగా చేస్తూ పోతారు. ఇతరులకు ఆ వేగాన్ని అందుకోవడం ఇబ్బందిగా మారొచ్చు. పనిని ఇతరులకు అప్పగించండి. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. వాళ్లు మీరు తమని నిర్లక్ష్యం చేస్తున్నారని భావించకుండా చూసుకోండి. ఇతరుల విషయాల్లో తలదూర్చడం వల్ల మీకు ఇబ్బందులెదురవుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండండి.

మకర రాశి  (Capricorn) – ఈ రోజు మీ పని పెద్దగా ముందుకు సాగదు. మానసికంగా మూడ్ ఆఫ్ లో ఉండడం వల్ల కేవలం పనిచేస్తున్నా అంటే చేస్తున్నా అన్నట్లుగా సాగుతుంది. పెండింగ్ లో ఉన్న కాంట్రాక్ట్ మీకే వస్తుంది. కానీ అది మీకు అంత ఆనందాన్ని అందించదు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఒంటరిగా సమయం గడిపేందుకు ఈ రోజు మంచి సమయం. ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని భావించకండి.

ఈ రాశుల వారు తప్పక ధనవంతులవుతారట. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి మరి

కుంభ రాశి  (Aquarius) -  ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా దాని వల్ల మంచి ఫలితం దక్కుతుంది. ఓ పెద్ద డీల్ ని పూర్తి చేసి ప్రాజెక్ట్ దక్కించుకుంటారు. అయితే దీనికి మీ పైస్థాయి వారి సలహాలు తీసుకోవడం అవసరం. మీ నిర్ణయాల గురించి అతిగా నమ్మకం పెట్టుకోకండి. ఎక్కువ గంటల పాటు పనిచేయాల్సి వస్తుంది. ఎక్కువగా చేస్తానని చెప్పి తక్కువ చేయకుండా మీ రోజు షెడ్యూల్ చేసుకోవడం మంచిది. పని ఒత్తిడి వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేరు.

మీన రాశి  (Pisces) – ఈ రోజు మీ నిర్ణయాలు సరైనవని మీరు భావించినా.. ఇతరులు వాటిని పాటించాలని ఒత్తిడి పెట్టకండి. వారి క్రియేటివ్ ఆలోచనలు ఉపయోగించే అవకాశం వారికి కూడా అందించండి. పని కాస్త ఆలస్యమైన సజావుగా సాగుతుంది. మీ అనుమానాలు ఇతరులతో మీ బంధాన్ని పాడు చేయకుండా కాపాడుకోండి. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. పాత స్నేహితులను కలుస్తారు.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో పాఠకులకు లభ్యమవుతోంది. ఇక ఇంగ్లీష్హిందీతెలుగుతమిళంమరాఠీబెంగాలీలో కూడా మీరు ఈ వెబ్ సైటును వీక్షించవచ్చు.

అద్భుతమైన వార్త ! POPxo SHOP మీ కోసం సిద్ధంగా ఉంది. సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ మొదలైన వాటిపై 25% డిస్కౌంట్‌ను ప్రత్యేకంగా అందిస్తోంది. మహిళల ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని మరింత కొత్తగా మీకు అందుబాటులో తీసుకొస్తోంది.